Artificial intelligence (AI): గత కొన్ని నెలలుగా ప్రపంచ వ్యాప్తంగా లేఆఫ్స్ ముప్పు కనిపిస్తుంది. మైక్రోసాఫ్ట్, గూగుల్, టీసీఎస్ లాంటి అనేక పెద్ద కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అమెజాన్ నుండి ఇంటెల్ వంటి అనేక కంపెనీలు వేల మంది ఉద్యోగులను తొలగించాయి. దీనికి ప్రధాన కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఏఐ టెక్నాలజీతో వర్క్ ఆటోమేషన్ మరింత మెరుగవుతుంది. దాంతో ఉద్యోగుల అవసరం భారీగా తగ్గుతుంది. మ్యాన్ పవర్ తగ్గించి టెక్నాలజీతో వర్క్ చేపించడానికి కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి.

Continues below advertisement

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాలా ఉద్యోగాలను తొలగిస్తుందని వాల్‌మార్ట్ (Walmart) సీఈవో డగ్ మెక్‌మిలన్ (Doug McMillon) కూడా హెచ్చరించారు. వర్క్‌ఫోర్స్‌కు ఏఐ కొత్త రూపాన్ని ఇస్తుందని అన్నారు. ఇది అందరూ తెలుసుకోవాల్సిన వాస్తవం, దీనిని ఎదుర్కోవడానికి ప్రపంచంలోని అతిపెద్ద రిటైల్ కంపెనీ వాల్‌మార్ట్ సైతం సిద్ధంగా ఉందన్నారు. AI ఖచ్చితంగా ప్రతిరంగంలో ఉద్యోగాలను మారుస్తుందని డగ్ మెక్‌మిలన్ పేర్కొన్నారు.

అంచనాలకు మించి మార్పులు 

ఆర్కాన్సాస్‌లోని బెంట్న్‌విల్లేలో ఇటీవల జరిగిన వర్క్‌ఫోర్స్ కాన్ఫరెన్స్‌లో వాల్‌మార్ట్ సీఈవో డగ్ మెక్‌మిలన్ మాట్లాడుతూ.. "రాబోయే కాలంలో పని విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం కనిపిస్తుంది. AI నిజంగా ప్రతి ఉద్యోగాన్ని మారుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. AI మార్చలేని ఉద్యోగాలు ఉండటం ప్రపంచంలో చాలా అరుదు" అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Continues below advertisement

AIని సంస్థలు వినియోగించడం వల్ల లేబర్ మార్కెట్‌లో మార్పులు వస్తాయన్నారు. ఇది మన అంచనాలకు మించి ఉంటుందని అంతా అందుకోసం సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం, ఫోర్డ్ నుంచి JP మోర్గాన్ చేజ్, అమెజాన్ వరకు, అన్ని కంపెనీల ఉద్యోగాలపై పెరుగుతున్న ఏఐ ప్రభావాన్ని గురించి ఇలాంటి హెచ్చరికలు చేశారు.

కొందరి తొలగింపు, మరికొందరి నియామకం

2.1 మిలియన్ల మంది ఉద్యోగులతో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ వాల్‌మార్ట్. వచ్చే మూడేళ్లలో తన ఉద్యోగుల సంఖ్య అలాగే ఉంటుందని స్పష్టం చేసింది. అయితే కొన్ని పని చేసే విధానాలు మారుతున్నందున చాలా ఉద్యోగాలు రద్దవుతాయి. వేర్‌హౌస్ ఆటోమేషన్, AI- ఆధారిత చాట్‌బాట్‌లు, బ్యాక్‌స్టోర్ ఆటోమేషన్‌లో ఇప్పటికే చాలా ఉద్యోగాలు తొలగించారు.. స్టాకింగ్, కస్టమర్ సర్వీస్ వంటి కొన్ని ఇతర పాత్రలు కూడా మారే దశలో ఉన్నాయి.

వాల్‌మార్ట్ ఇటీవల 'ఏజెంట్ బిల్డర్' పొజిషన్ ప్రారంభించగా కొన్ని కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి. ఇందులో కార్మికులకు వ్యాపారుల కోసం AI సాధనాలను తయారు చేసే పనిని అప్పగించారు. హోమ్ డెలివరీ, బేకరీ, హై-టచ్-కస్టమర్ ఫేసింగ్ విభాగాలలో కొత్తవారిని నియమించవచ్చు. ఉద్యోగాల పనితీరు, వారి పని స్వభావం భవిష్యత్తులో చాలా మారుతుందని, ప్రస్తుతం ఓ అంచనాకు రాలేమని వాల్‌మార్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ డోనా మోరిస్ అన్నారు.

రెండు సంవత్సరాలలో గతంలాగ ఉండదు

AIని వచ్చే 18 నుంచి 36 నెలల్లో వేగంగా స్వీకరించాలని కంపెనీలు భావిస్తున్నాయని, కార్మికులు దీన్ని స్వీకరించాలని OpenAI చీఫ్ ఎకనామిస్ట్ రోనీ చటర్జీ అన్నారు. దీనికి సంబంధించిన నైపుణ్యాలను నేర్చుకోవాలి, ప్రమాదం నుంచి బయటపడాలని సూచించారు. రెండేళ్ల తరువాత మీరు ఇప్పుడు చేసే పని అలాగే ఉండదని, ఎన్నో మార్పులు వస్తాయని AI CEO కూడా స్పష్టం చేశారు.