Saturday Tips: హిందూ ధ‌ర్మంలో, శనైశ్చ‌రుడు న్యాయానికి దేవుడు, చర్యలకు ప్రతిఫలమిచ్చేవాడు. వారంలోని ఏడు రోజులలో శని దేవుడిని శనివారం పూజిస్తారు. ఈ రోజున నూనెలో మీ ముఖాన్ని చూసి శనిదేవుని పాదాల వ‌ద్ద ఆ నూనె నైవేద్యంగా పెడితే జాతకంలో శనిదోషం తొలగిపోతుందని విశ్వ‌సిస్తారు. అదేవిధంగా శనివారం నాడు మనకు ఈ శుభసూచకాలు క‌నిపిస్తే శని మనల్ని అనుగ్రహించాడని అర్థం. శనిదేవుని ఆశీస్సులు సూచించే ఆ సంకేతాలు ఏంటి?


నల్ల కుక్క            
నల్ల కుక్క కాలభైరవుడి అంశ‌గా భావిస్తారు, శనికి సంకేతంగా సూచిస్తుంది. శనివారం నల్ల కుక్కను చూడటం చాలా శుభ సంకేతం. ఈ రోజున నల్ల కుక్కలకు ఆహారం ఇస్తే శని దేవుడు సంతోషిస్తాడు. ఆయ‌న‌ ఆశీర్వాదాలను మీకు అందజేస్తుంది. అంతే కాకుండా శనివారం నల్ల కుక్కకు ఆహారం తినిపిస్తే రాహు, కేతువుల అనుగ్రహం మీపై ఉంటుంది.


Also Read : శ్రావణ శనివారం ఇలా చేస్తే శివానుగ్ర‌హంతో పాటు శని బాధ‌ల నుంచి విముక్తి.!


బిచ్చగాడు                
మనం పేదలకు లేదా యాచకులకు సహాయం చేసినప్పుడు శని దేవుడు చాలా సంతోషిస్తాడు. శనివారం నాడు భిక్షగాడిని చూస్తే రిక్తహస్తాలతో వెళ్లొద్దు. మీ సామర్థ్యాన్ని బట్టి ఏదైనా దానం చేయండి. ఇలా చేయడం వల్ల శని దేవుడు సంతోషించి, మీ పట్ల దయ చూపిస్తాడు.


నల్ల ఆవు                 
శనివారం రోజు నల్ల ఆవును చూసినా, నల్ల కుక్కను చూసినా మీకు అదృష్టం కలుగుతుంది. శనివారం నల్ల ఆవు కనిపిస్తే శుభసూచకం. శని దేవుడు మీ పట్ల ప్రసన్నుడయ్యాడని అర్థం. మీరు మీ ప్రతి పనిలో విజయం సాధించబోతున్నారనడానికి దీనిని సంకేతం భావించాలి.


కాకి
శనిదేవుని వాహనం కాకి. మీరు కాకిపై స్వారీ చేస్తున్న శనిదేవుని ఫోటో లేదా విగ్రహాన్ని కూడా చూసి ఉండవచ్చు. శాస్త్రం ప్రకారం, మీరు శనివారం కాకిని చూస్తే, అది శుభ సంకేతంగా పరిగణించాలి.                 


Also Read : శనివారం ఈ తప్పులు చేస్తే శని దోషం ఖాయం..!


నీరు తాగుతున్న కాకి                  
శనివారం రోజు కాకి నీళ్లు తాగడం చూస్తే మీకు శుభం కలుగుతుంది. దీని అర్థం ఆ వ్యక్తికి త్వరలో అదృష్ట యోగం ఉంద‌ని సంకేతం. నీరు తాగుతున్న కాకిని చూసిన‌ వ్యక్తి తాను భవిష్యత్తులో చేప‌ట్టే ప్రతి పనిలో విజయం సాధిస్తాడు. శని దేవుడు కూడా అతనిపై దయతో ఉంటాడు.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.