శ్రావణం శివానుగ్రహానికి చాలా అనువైన మాసం. ఈ మాసం అంతా శివుడికి ప్రత్యేక పూజలు, జపాలు, అభిషేకాలు చేస్తారు శివారాధకులు. ఉపవాసం కూడా చేస్తారు. హిందూ సనాతన ధర్మశాస్త్రం శ్రావణ సోమవారం నాడు ఆరాధన, జపం చెయ్యడం శ్రేష్ఠమైందిగా పరిగణిస్తుంది. శ్రావణ సోమవారం నాడు శివారాధన చేస్తే సకల దు:ఖాలు నశిస్తాయని నమ్మకం. శివుడి కరుణా కటాక్షం శ్రావణంలో పూజలు చేసుకునే వారి మీద అపారంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు జ్యోతిషాన్ని అనుసరించి ఏయే రాశుల వారు ఎలాంటి శ్రావణ సోమవారం నాడు ఎలాంటి దాన ధర్మాలు చెయ్యాలనే విషయాలను కూడా ఇక్కడ తెలుకుందాం.


మేషరాశి


మేషరాశి వారు శివుని అనుగ్రహం పొందడానికి శ్రావణ సోమవారం నాడు పిండి, పంచదార, బెల్లం దానం చెయ్యడం మంచిది. మిఠాయిలు దానం చేసినా మంచి ఫలితం ఉంటుంది. ఇలాంటి దానాల వల్ల వీరికి పనుల్లో విజయం లభిస్తుంది.


వృషభ రాశి


వృషభ రాశి వారు శివానుగ్రహానికి శ్రావణ సోమవారాల్లో పాలు, పెరుగు, అన్నం, పరిమళ ద్రవ్యాలు, సువాసన కలిగిన వస్తువులు దానం చెయ్యాలి. ఇలా చెయ్యడం వల్ల సుఖం, సంపద కలుగుతాయి.


మిథున రాశి


శ్రావణ మాసంలో సోమవారం నాడు పెసరపప్పు, పచ్చి కూరగాయలు, ఆకుపచ్చని పళ్లను దానం చెయ్యడం, శివుడి వాహనమైన నందికి అంటే ఎద్దుకు పచ్చిగడ్డి మేతగా తినిపించడం వల్ల మిథున రాశి వారికి ఆదాయం పెరుగుతుంది.


కర్కాటక రాశి


కర్కాటక రాశి వారు శ్రావణ మాసంలో నాలుగో సోమవారం నాడు శివుని అనుగ్రహం పొందడానికి పుణ్య స్త్రీలకు వెండి పాదుకలు, వేపపువ్వు దానం చెయ్యలి. అన్నం, పంచదార, నెయ్యి, నీళ్ల అవసరమైన వారికి ఇవ్వడం ద్వారా కూడా మంచి ఫలితాలు ఉంటాయి.


సింహ రాశి


సింహరాశి వారు శ్రావణ సోమవారం నాడు శివపూజ తర్వాత బెల్లం, గోధుమలు, పప్పులు, తేనె దానం చెయ్యాలి. ఇలా చెయ్యడం వల్ల సూర్యభగవానుని అనుగ్రహం లభిస్తుంది. అలాగే వృత్తి వ్యాపారాల్లో విజయం చేకూరుతుంది


కన్యారాశి


కన్యారాశి వారు శ్రావణ సోమవారం నాడు పుణ్య స్త్రీలకు అలంకరణ వస్తువులు, అద్దాలు దానం చెయ్యాలి. ఈ పరిహారం చెయ్యడం వల్ల అన్ని పనుల్లో విజయం సంప్రాప్తిస్తుంది.


తులారాశి


తులారాశి వారు శివుడి అనుగ్రహం పొందడానికి శ్రావణ సోమవారం నాడు పాలు, పెరుగు, బియ్యం, తెల్లని వస్త్రాలు దానం చెయ్యాలి. మీకు ఆత్మీయులుగా భావించే వారికి పెర్ఫ్యూమ్, అలంకరణ సామాగ్రి బహుకరించవచ్చు


వృశ్చిక రాశి


వృశ్చిక రాశి వారు శ్రావణ సోమవారం నాడు బెల్లం, తేనె, పంచదార, ఎర్రమిరపకాయలు దానం చెయ్యాలి. ఈ పరిహారం చెయ్యడం ద్వారా జాతకంలో కుజద్రహం వల్ల కలిగే ప్రభావం తొలగి పోతుంది. దీనితో పాటు కుజుడి అనుగ్రహం కూడా దొరకుతుంది.


ధనుస్సురాశి


ధనస్సు రాశి వారు శ్రావణ సోమవారాల్లో బొప్పాయి, చందనం, శనగపప్పు, పసుపు, కుంకుమ, మిఠాయిలు దానం చెయ్యాలి. ఇలా చెయ్యడం వల్ల జాతకంలో గురు స్థానం బలపడి మనోబలం పెరుగుతుంది.


మకరరాశి


మకర రాశి వారు శ్రావణ సోమవారాల్లో కొబ్బరి నల్ల నువ్వులు, చీపురు, రాజ్మా, నల్ల శనగలు వంటి వాటిని దానం చెయ్యాలి. ఇలా చెయ్యడం వల్ల మనిషి జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయి.


కుంభరాశి


కుంభరాశి వారు శ్రావణ సోమవారం నాడు పేద, వికలాంగులకు సహాయం చెయ్యాలి. డబ్బు మందులు, బట్టలు విరాళంగా ఇవ్వవచ్చు. ఇలా చెయ్యడం వల్ల శివుడు ప్రసన్నుడై దీవెనలు అందిస్తాడు.  


మీనరాశి


మీనరాశి వారు శివుని ప్రసన్నం చేసుకోవడానికి శ్రావణ సోమవారం నాడు పుణ్యస్త్రీలకు పసుపురంగు గాజులు బహుకరిస్తే మంచిది. వీటితో పాటు అరటి పండు, శనగపప్పు, కుంకుమ పువ్వు వేసిన పాలు, శనగ పిండి వంటి వాటిని ఎవరికైనా ఇవ్వాలి.


Also Read: ఆగష్టు మొదటివారం ఈ 3 రాశులవారికి లక్కు మామూలుగా లేదు!



Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial