ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు శాస్త్రాలు అనేక పరిహారాలను సూచిస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనది మందార పువ్వులతో చేసే పరిహారం. ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా మందర పుల మొక్క ఉంటుంది. నిత్యం ఆ పూలను ఇంట్లో పూజలకు ఉపయోగిస్తుంటారు. మందారంలో ఔషధ విలువలు కూడా చాలానే ఉన్నాయి. అందుకే, ఈ మొక్కను ఎప్పటికీ విలువైనదే. మరి, ఆర్థిక సమస్యల నుంచి మిమ్మల్ని బయటపడేందుకు మందారం ఎలా సహకరిస్తుంది? ఎలాంటి పరిహారాలు చేస్తే ఫలితం ఉంటుందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.


కాళీ మాతకు ప్రియమైంది


సాధారణంగా అమ్మవారి పూజలోఎర్రని పువ్వులను ఉపయోగిస్తారు. ముఖ్యంగా కాళీ మాత ఆరాధనలో ఎర్రని పూలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. కాళికా దేవికి ఎర్రని మందారాలు చాలా ఇష్టమైనవి. ఈ పుష్పం లేకుండా అమ్మవారి పూజ అసంపూర్ణం. హనుమంతుని పూజలో కూడా మందారపువ్వును ఉపయోగిస్తారు. వాస్తు ప్రకారం ఇంట్లో మందార మొక్క ఉండడం శుభకరం. మందారపూల మొక్క ఇంట్లో ఉండడం లక్ష్మీ ప్రదం కూడా. ఈ మొక్క వల్ల ఇంట్లో ఆర్థిక సంక్షోభాలు రావని పండితులు చెబుతున్నారు. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో మందార మొక్క ఉంటే జాతకంలో సూర్యుడి స్థితి బలోపేతమై ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుంది.


జాతకదోషాలకు కూడా


జన్మజాతకంలో కుజదోషం ఉంటే మందారంతో పరిహారం చేసుకోవచ్చు.  జాతక చక్రంలో కుజుడు బలహీనంగా ఉన్నవారికి కుజదోషం ఏర్పడుతిం. ఇలాంటి వారికి వివాహంలో జాప్యం లేదా వైవాహిక సంబంధాల్లో సమస్యలు వస్తాయి. వీరు ఇంట్లో మందార మొక్కను తప్పకుండా పెంచుకోవాలి. మందార మొక్క పెంచుకుంటే కుజుడు శాంతిస్తాడు. సమస్యల తీవ్రత తగ్గుతుంది.


కెరీర్ లో దూసుకుపోవాలంటే


మందార మొక్క ఉన్న ఇంటిలో ప్రతికూల శక్తి ప్రవేశించలేదు. ఉద్యోగ వ్యాపారాల్లో సమస్యలు ఎదుర్కొంటున్న వారి ఇంట్లో మందార మొక్క పెంచుకుని ప్రతి రోజు సూర్యుడికి నీటితో అర్ఘ్యం విడిచే సమయంలో మందార పువ్వును కూడా సమర్పించుకోవాలి. ఈ పరిహారం కెరీర్ లో మంచి ఫలితాలు పొందేందుకు దోహదం చేస్తుంది.


వైభవ లక్ష్మి పూజలో


శుక్రవారం నాడు చేసే వైభవలక్ష్మీ పూజలో మందార పూలు దేవికి సమర్పించడం ద్వారా ఆమెను ప్రసన్నం చేసుకోవచ్చు. ఎర్రని మందారాలు సమర్పించి కోరినకోరికలు నెరవేర్చమని లక్ష్మీ దేవిని కోరుకుంటే ఆమె తప్పక కటాక్షిస్తుంది. అ పరిహారం చేసుకున్న వారికి ఆర్థిక సమస్యలు తీరుతాయి. కోరిన ఉద్యోగం పొందుందుకు మార్గాలు సుగమం అవుతాయి.


Also read : ఇంట్లోని ఈ వస్తువులను అస్సలు ఖాళీగా ఉంచకూడదట, అలా చేస్తే ధన నష్టమే!


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial