నిత్య జీవితంలో నడుచుకోవాల్సిన అనేక నియమాలను గురించి వాస్తు చర్చిస్తుంది. ఈ నియమాలను అనుసరించి జీవితం గడిపే వారి ఇంట్లో ఎల్లప్పుడు ఆనందం, సంపద నిలిచి ఉంటాయి. చాలా సార్లు మనం తెలిసి తెలియక ఇలాంటి తప్పులు చెయ్యడం వల్ల కుటుంబంలోని అందరూ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తులో చెప్పిన ఈ నియమాలను పాటించడం వల్ల నెగెటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించదు. అలాగే ఇంట్లో కొన్ని వస్తువులు ఎప్పటికీ నిండుకోకూడదు. అలా నిండుకుంటే ఇంట్లోంచి లక్ష్మీ దేవి వెళ్లి పోతుందని నమ్మకం. ఈ చిన్నచిన్న విషయాలు ఇంటి ఆర్థిక స్థితి మీద నేరుగా ప్రభావం చూపుతాయి. అలాంటి కొన్ని విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.


ధాన్యం


వాస్తు చెప్పిన దాన్ని బట్టి ఇంట్లో ధ్యాన్యం ఎప్పటికీ నిండుకోకూడదు. ఇంట్లో తిండి గింజలు అయిపోవడం ప్రతికూలతలకు సంకేతం. అంతేకాదు అవమానకరం అని వాస్తు అభివర్ణిస్తోంది. ముఖ్యంగా బియ్యం, గోధుమల వంటి ధాన్యం ఎప్పటికీ అయిపోవద్దు. ఈ జాగ్రత్త అన్నపూర్ణా దేవిని ప్రసన్నం చేస్తుంది.


నీటి కుండ


ఇంట్లో నీళ్లు నింపి పెట్టుకునే కుండ, బాత్రూమ్ లోబకెట్ ఎప్పుడూ ఖాళీగా ఉంచవద్దు. నీటి పాత్రలు ఖాళీగా ఉంచితే ఇంట్లో ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతాయి. పేదరికం ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంటుంది. ఇంటి పరువు పరిస్థితులు కూడ ప్రమాదంలో పడొచ్చు. కనుక నీటి పాత్రలను ఎప్పుడూ నిండుగా ఉంచుకోవాలి. ముఖ్యంగా రాత్రిపూట ఈ జాగ్రత్త తప్పక పాటించాలి. నీరు నింపిపెట్టుకునే పాత్ర విరిగిపోయి లేదా రంధ్రాలతో ఉండకూడదు. నీటి వృధా చేస్తే ఇంట్లో లక్ష్మీ నిలవదు. నీరు వృథా చేస్తే డబ్బు కూడా మీ దగ్గర అలాగే ఖర్చవుతుంది.


తిజోరి


మీ ఇంట్లో డబ్బు దాచుకునే తిజోరి లేదా మీ పాకెట్ లో ఉండే పర్సు ఎప్పుడూ ఖాళీగా ఉంచవద్దు. అందులో కొంత డబ్బు ఎప్పటికీ ఉంచాలి. పర్స్ లేదా తిజోరిలో తప్పకుండా కొంత డబ్బు ఉంచడం అవసరం. ఖాళీ పర్సు లేదా తిజోరి అపశకునంగా భావిస్తారు. ఖాళీ పర్సు దరిద్రానికి సంకేతం. లక్ష్మి దేవికి కోపం తెప్పిస్తుంది. ఇంట్లో డబ్బుదాచుకునే బీరువా లేదా తిజోరిలో గోమతీ చక్రం, నాణేం, శంఖం ఉంచుకోవడం శుభప్రదం.


ఇంట్లో పూజకు వినియోగించిన పూలు వాడిపోయినా కూడా తీసెయ్యకుండా ఉంచకూడదు. ఎట్టిపరిస్థితుల్లో దేవుడికి అలంకరించిన పూలు తెల్లవారి తప్పనిసరిగా తీసెయ్యాలి. 


Also read : Vastu Tips for Positive Energy: టైమ్ బాలేదా అయితే ఇలా చేసి చూడండి మంచి ఫలితం ఉంటుంది


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial