Vastu Tips for Positive Energy: దేనికైనా సమయం రావాలి అంటుంటారు. వాస్తు దోషం, జాతకంలో గ్రహదోషం ఏదీ లేకపోయినా ఒక్కోసారి పనులు సరిగ్గా కావు. పనులు ఎందుకు జరగడం లేదో అర్థం కాదు. ఉంటున్న ఇంటిలో వాస్తు సరిగానే ఉంటుంది.  జాతకంలో గ్రహాల కదలికలు కూడా సరిగ్గా ఉన్నా కూడా పనులు జరగక పోవడానికి ఒక చిన్న లోపం ఉండి ఉంటుంది. ఇంట్లో కొన్ని వస్తువుల అమరిక కూడా ఇలా ఆటంకాలను కలిగించవచ్చు. అందుకే ఇంట్లో ఏ ప్రదేశంలో ఏ వస్తువు ఉంచాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.


Also Read: ఆగష్టు మొదటివారం ఈ 3 రాశులవారికి లక్కు మామూలుగా లేదు!



  • ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య సంబంధ బాంధవ్యాలు సరిగా ఉండాలంటే, కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరియాలంటే ఇంట్లోని నైరుతి మూలలో పింక్ లేదా ఎరుపు రంగు పువ్వులను అలంకరించాలి.

  • ఇంట్లో పెళ్లి కావల్సిన అమ్మాయి ఉంటే, త్వరగా పెళ్లి కుదరాలంటే ఇంటి ప్రధాన ద్వారం బయట సుగంధం వెలువరించే మల్లెల వంటి పువ్వుల బొమ్మను ఉంచడం మంచి ఫలితాన్ని ఇస్తుంది.

  • ఇంటి ఆగ్నేయ దిశలో నారింజ మొక్క షోపీస్ లేదా చిత్రాన్ని అలంకరించితే ఇంటికి శుభప్రదం.

  • పిల్లలు చదువుకునే గదిలో ఈశాన్య మూలలో నాలుగు క్రిష్టల్ బాల్స్ వేలాడ దీయండి. ఇవి పిల్లల్లో ఏకాగ్రత పెంపొందించేందుకు దోహదం చేస్తాయి.

  • ఇంటికి దక్షిణం వైపు ఎర్రని విగ్రహం లేదా ఎరుపు రంగు చిత్రాన్ని అలంకరిస్తే అన్ని పనుల్లో మంచి ఫలితాలు ఉంటాయి.

  • ఇంట్లో ఏదైనా గదిలో దక్షిణం వైపు గోడకు ఫినిక్స్ పక్షి చిత్రాన్ని దానికి వేలాడా దీసి అలంకరిస్తే ఇంట్లో శాంతి నెల కొంటుంది.

  • యుద్ధం, హింసాత్మక చిత్రాలు, భయంకరంగా ఉండే విగ్రహాలను ఇంట్లో ఉంచకూడదు. ఇవి కుటుంబ సభ్యుల మీద చెడు ప్రభావం చూపుతుంది.

  • పూజకు వాడే విగ్రహాలు 6 అంగుళాలు మించకుండా ఉండాలి. పూజ గదిలో ఎవరూ నిద్రించకూడదు.

  • ఒకటి కంటే ఎక్కువ అంతస్తుల్లో ఇల్లు ఉన్నపుడు మాస్టర్ బెడ్ రూమ్ అన్నింటికంటే పై అంతస్తులో ఉండాలి.

  • ఇంట్లో మొక్కలు పెంచుకోవాలని అనుకుంటే ముల్లు ఉండే కాక్టస్ లాంటివి ఇంట్లో పెంచకూడదు. అలాగే ఉత్తరం, తూర్పు వైపు గోడల మీదుగా పాకే మొక్కలు పెంచకూడదు.

  • డైనింగ్ టేబుల్ పడమరకు ముఖం చేసి ఉండాలి. ఇది శని స్థానం. ఆకలికి చిహ్నం అయిన బకాసురుడి దారి ఇదే.


ఇంటి అలంకారం విషయంలో కొన్ని చిన్నచిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా మంచి సమయాన్ని మన ఇంట్లోకి ఆహ్వానించవచ్చు.


Also read : Spirituality: తిలక ధారణ దేనికి సంకేతం ,చిన్న చుక్క బొట్టులో ఇన్ని విషయాలున్నాయా!


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial