జ్యోతిషం ప్రకారం సంచార గ్రహాలు శుభాశుభ యోగాలను సృష్టిస్తాయి. గ్రహాల స్థితి గతులను అనుసరించి గోచార ఫలితాలు ఉంటాయి. వారఫలాలలో ముఖ్యంగా తెలిపేది ఈ గోచారా ఫలితాలనే. వీటి ఆధారంగానే ఆ వారంలో ఏఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలుంటాయో పండితులు విశ్లేషిస్తుంటారు. కొన్ని సార్లు కొన్ని గ్రహాల కూటమి ఏర్పడుతుంది. అంటే ఏవో రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఒకే రాశిలో ఉంటాయి. ఇలా ఉండడం వల్ల కొన్ని ప్రత్యేక యోగాలు  ఏర్పడుతాయి. ఈ యోగాల ఫలితాలు కొన్ని రాశులవారికి మేలు చేసే విధంగా ఉంటే మరికొన్ని రాశుల వారికి కీడు జరుగుతుంది. ఈ మార్చి 23న మేషరాశిలో రాహు, చంద్ర కూటమి ఏర్పడ బోతోంది. దీని వల్ల గ్రహణ యోగం ఏర్పడుతుంది. ఈ యోగ ప్రభావం అన్ని రాశుల మీదా ఉంటుంది. కొన్ని రాశుల వారికి ఈ యోగం అత్యంత శుభకాలంగా ఉంటుంది. వారి వృత్తి వ్యాపారల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. అలాంటి వారికి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ ఉండదు. కానీ 4 రాశుల వారికి ఈ యోగం అంత మంచి ఫలితాలను ఇవ్వబోవడం లేదు. వారు మాత్రం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఏ రాశుల వారి మీద ఈ గ్రహణ యోగం తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందో తెలుసుకుందాం.


వృషభం


గ్రహణ యోగం కొంత వరకు వీరికి హానికరం కావచ్చు. ఈ రాశి వారికి 12వ ఇంటిలో రాహు చంద్ర కూటమి ఏర్పడుతోంది. అందువల్ల అనవసర ఖర్చులు రావచ్చు. మీ బడ్జెట్ ప్రణాళికలు తారుమారు కావచ్చు. ఈ సమయంలో ఏ కొత్త పని ప్రారంభించడం మంచిది కాదు. ఆస్తి పత్రాలు జాగ్రత్త పెట్టుకోవాలి. వీటిని పొగొట్టుకునే ప్రమాదం ఉంది. డ్రైవింగ్ సమయాల్లో కూడా జాగ్రత్త అవసరం.


కన్యరాశి


రాహు చంద్రుల కూటమి కన్యా రాశి వారికి హానికరం కావచ్చు. ఈ కూటమి ఈ జాతకులకు 8వ ఇంట ఏర్పడుతోంది. మనసులో శాంతి ఉండదు, పనిమీద శ్రద్ధ తగ్గుతుంది. ఈ సమయంలో ఉద్యోగం మారకూడదు. మానసిక ఒత్తిడి ఉంటుంది. వ్యాపారస్తులు ఎలాంటి డీల్స్ ఈ సమయంలో కుదుర్చుకోకూడదు.


వృశ్చిక రాశి


ఈ గ్రహణ యోగం వృశ్చిక రాశి వారికి అసలు మంచిది కాదు. రాశి చక్రంలో వీరికి ఆరో ఇంట ఈ కూటమి ఏర్పడుతోంది. ఈ సమయంలో రహస్య శత్రువులు ఇబ్బంది పెట్టవచ్చు. పరుల్లో అనవసర ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక జాగ్రత్త అవసరం.


మకర రాశి


మకర రాశి వారికి ఈ యోగం హానికరం. రాహు చంద్రుల కలయిక మకర రాశి వారికి నాలుగవ ఇంట జరుగుతోంది. ఒకరి మాటల వల్ల మనసు గాయపడవచ్చు. కుటుంబంలో వివాహం ఖాయం కావచ్చు. ఈ సమయంలో కొత్త పని ప్రారంభించడం మాత్రం అంత మంచిది కాదు. పనుల్లో ఆటంకం కలుగుతుంది.


Also Read: శోభకృత్ నామ సంవత్సరంలో ఈ రాశివారికి అష్టమంలో గురుడు ఆరోగ్యంపై దెబ్బకొడతాడు, ఏ రంగం వారికీ శుభఫలితాలు లేవు!