Pitrudosha: ఎంత శ్రద్ధగా పనిచేసినా పని పూర్తికాదు..ఎన్ని ప్రణాళికలు వేసినా అడుగు ముందుకు కదలదు..ఎంత ఖర్చు చేసినా ఫలితం రాదు.. కష్టపడినా ప్రయోజనం ఉండదు..ఏం జరుగుతోందో అర్థంకాదు..లోలోపల ఏదో వ్యధ పట్టి పీడిస్తుంటుంది..ఏమవుతోందని ఆలోచిస్తే అంతా బావున్నట్టే అనిపిస్తుంది...
ఎందుకీ వ్యధ..ఏంటీ బాధ 
వీటికి సమాధానం పితృదోషం అంటారు పండితులు
పితృ దోషం అనే మాట వినే ఉంటారు కదా...తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తిపాస్తులను వంశపారంపర్యంగా అనుభవించటానికి ఎలా హక్కు, అర్హత పొందుతామో ...అలాగే...తాతలు తండ్రులు చేసిన పాపపుణ్యాలు కూడా ఆ వంశానికి వర్తిస్తాయి. పెద్దలు పుణ్య కార్యాలు చేస్తే ఆ వంశం తరతరాలుగా సుఖ సంతోషాలతో ఉంటుంది. అదే పూర్వీకులు పాపాలు చేస్తే (తెలుసు కావొచ్చు తెలియక కావొచ్చు )...ఆ కర్మలు ఆ వంశాన్ని పట్టి పీడిస్తాయి.ఈ విషయం తెలియనివారంతా ఏం పాపం చేశాం ఈ కర్మ అనుభవిస్తున్నాం అనుకుంటారు కానీ పాపం మీరుమాత్రమే చేయాల్సిన అవసరంలేదు..అది కూడా వారసత్వంగా వచ్చినదే..


Also Read: గంగా పుష్కరాలకు కాశీ వెళుతున్నారా - టెంట్ సిటీలో రూమ్స్ ఇలా బుక్ చేసుకోండి


పితృదోషం ఉందని ఎలా తెలుస్తుంది


రవి, శని స్థానాలను బట్టి జాతకుడికి పితృ దోషం ఉందో లేదో తెలుస్తుంది. 
రవి కానీ శని కానీ రాహు నక్షత్రంలో ఉంటే ఈ దోషం ఉంటుంది
రవి శని భగవానుడు ఒకే స్థానంలో కలిసి ఉన్నా సమ సప్తక స్థితిలో ఉన్నప్పటికీ ఈ దోషం ఉంటుంది
రవి, శని కి  రాహువు కానీ కేతువు కానీ అతి దగ్గరగా ఉన్నప్పటికీ కూడా ఈ దోషం ఉంటుంది
రాహు కేతువులు  ధర్మ త్రికోణ స్థానాల్లో ఉన్నా...రవి శనితో సంబంధం ఉన్నప్పటికీ ఈ దోషం ఉంటుంది
తండ్రి వైపు తాత నానమ్మలను రాహు గ్రహం సూచిస్తుంది. తల్లి వైపు తాత అమ్మమ్మలను కేతు గ్రహం సూచిస్తుంది


పితృదోషం ఉంటే ఏం జరుగుతుంది
చిన్న వారు అకాలమరణం పొందడం 
శరీరంలోని ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి ఆస్పత్రి పాలవడం
అప్పులపాలు అవడం, అపనిందలు మోయడం
ప్రమాదాలకు గురవుతూ పడుతూ లేస్తూ జీవితాంతం కర్మలను అనుభవించడం
కళ్ళ ముందు పిల్లలు వ్యసనాలకు బానిసగా మారుతున్నా ఏమీ చేయలేని దుస్థితిలోకి వెళ్లిపోవడం


Also Read: గంగా పుష్కరాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, పుష్కరాలు ఎలా ప్రారంభమయ్యాయి!


పితృ దోషం ఉంటే ఏం చేయాలి
పితృదోషం ఉన్నప్పుడు పూర్వీకులకు ఆభ్దీకాలను సక్రమంగా నిర్వహించడం, అమావాస్య రోజు తర్పణాలు వదలడం, పుష్కరాల సమయంలో పిండప్రదానాలు చేయడం ( ఈ ఏడాది గంగా పుష్కరాలు),  కులదేవత ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది. స్మశాన నారాయణుడిని ప్రసన్నం చేసుకుంటే ఈ దోషాల నుంచి విముక్తి కలుగుతుంది. స్మశాన నారాయణుడి ఆలయాలు భారతదేశంలో రెండే ఉన్నాయి.  
1. కాశీ
2. పాపనాశి  ( అలంపురం 'జోగుళాంబ గద్వాల జిల్లా)
అలంపురంలోని ఈ స్మశాన నారాయణుడి ఆలయం గురించి కేరళ తాంత్రిక శాస్త్రంలో ప్రస్తావన ఉంది. అయితే అలంపురంలో స్మశాన నారాయణుడి ఆలయం ఉందన్న విషయం చాలామందికి తెలియదు.  స్మశాన నారాయణుడిని ప్రసన్నం చేసుకుని పితృ బాధల నుంచి విముక్తి కలుగుతుంది. 
అన్నంతో చేసిన పాయసం, అన్నం, ముద్దపప్పుని స్మశాన నారాయణుడికి నైవేద్యంగా సమర్పించి ఆ వంశం వారంతా ఆ ప్రసాదం స్వీకరించాలి. స్వామివారికి తెల్లటి కండువా సమర్పించాలి. స్నానమాచరించిన తర్వాత అక్కడున్న ఆలయాల్లో దర్శనం పూర్తచేసుకుని...ఆఖర్లో స్మశాన నారాయణుడిని దర్శించుకుని నేరుగా ఇంటికి వెళ్లాలి. 


పితృదోషం ఐదు తరాలవారిని వెంటాడుతుంది. అందుకే మీరు పుణ్యకార్యాలు చేయకపోయినా పర్వాలేదు, ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ పాపాలు చేసి మీ తర్వాతి తరాల బాధకు కారణం కావొద్దు. 


గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.