Numerology : న్యూమరాలజీ అనేది పురాతన శాస్త్రం ఇందులో ఒక వ్యక్తి జీవితంలో జరిగే ప్రధాన సంఘటనలను ముందుగానే తెలుసుకొనే వీలుంది. మానవ జీవితం అంటేనే లెక్కలతో ముడిపడి ఉంది. ప్రతీది న్యూమరాలజీతోనే అనుసంధానమై ఉంటుంది. ఒక మనిషి జీవితంలో అంకెలు అనేవి ప్రతి క్షణాన్ని బేరీజు వేస్తూ ఉంటాయి. అంకెలతోనే మన జీవితం ముడిపడి ఉందని మనందరికీ తెలిసిన విషయమే. అందుకే సంఖ్యాశాస్త్రం ప్రకారం ఒక మనిషి జీవితంలో ఏమేం జరుగుతాయో ముందుగానే పసిగట్టే అవకాశం ఉంది. 


సంఖ్యాశాస్త్ర విశ్వాసాల ప్రకారం.. కొన్ని నిర్దిష్ట తేదీలలో జన్మించిన వ్యక్తులు తమ భాగస్వామిని మోసం చేసే అవకాశం ఉంది. అలాగే వివాహేతర సంబంధాలు కొనసాగించే వీలుందని శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా ఈ 5 తేదీల్లో పుట్టిన వారు తమ జీవిత భాగస్వామిని మోసం చేసే అవకాశం ఉందట.


ఏదైనా నెలలో 3, 12, 21 లేదా 30వ తేదీలలో జన్మించిన వ్యక్తులు :


ఈ వ్యక్తులు తరచుగా ఆకర్షణీయంగా, రొమాంటిక్‌గా ఉంటారు. వారి రూపం, చంచల మనస్తత్వం కారణంగా వివాహేతర సంబంధాలు, మోసం, ప్రలోభాలకు ఎక్కువగా గురవుతారని న్యూమరాలజీ చెబుతోంది. అలాగే వీరు తమ జీవిత భాగస్వామితో తరచూ అబద్ధాలు చెప్పడానికి ఏమాత్రం వెనకాడరు. అందుకే ఈ తేదీల్లో పుట్టిన వారి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. 


ఏదైనా నెలలో 9, 18 లేదా 27వ తేదీన జన్మించిన వ్యక్తులు:


ఈ వ్యక్తులు తరచుగా శ్రద్ధగల, ఆదర్శవంతమైన వ్యక్తులు. అయినప్పటికీ, వారు తమ  జీవిత భాగస్వామిని మోసం చేసే సంబంధాల్లో ఉండవచ్చు. ఈ తేదీల్లో జన్మించిన వారు తమ జీవిత భాగస్వామిని కాదని ఇతరులతో ఎక్కువ చనువుగా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. వీరు తమ చుట్టూ ఉన్న పరిస్థితులను కాదనలేక వివాహేతర సంబంధం పెట్టుకునేందుకు బలహీనులు అవుతారు.


ఏదైనా నెలలో 6, 15 లేదా 24వ తేదీలలో జన్మించిన వ్యక్తులు:


ఈ వ్యక్తులు తరచుగా తమ జీవిత భాగస్వామి పట్ల దయతోను కరుణతోను చాలా కేరింగ్ ఉన్నట్లు నటిస్తుంటారు. వీరు తమ జీవిత భాగస్వామితో మానసికంగా తాము సంతృప్తి చెందడం లేదని భావిస్తుంటారు. ఇది వారిని మోసం లేదా వివాహేతర సంబంధాలు పెట్టుకునేందుకు దారితీస్తుంది. ముఖ్యంగా ఈ తేదీల్లో జన్మించిన వ్యక్తులు మోసం చేసేందుకు ఏమాత్రం వెనుకాడరు. కావున వీరి పట్ల కూడా కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. 


ఏదైనా నెలలో 5వ, 14వ, లేదా 23వ తేదీలలో జన్మించిన వ్యక్తులు:


ఈ వ్యక్తులు తరచుగా సాహసోపేతమైన వైఖరిని కలిగి ఉంటారు. ఈ తేదీల్లో జన్మించిన వారు కొత్తదనం కోసం చిలిపి పనులు చేయడం కోసం వివాహేతర సంబంధాలు పెట్టుకునేందుకు ప్రయత్నం చేస్తుంటారు. 


ఏదైనా నెలలో 8వ, 17వ లేదా 26వ తేదీలలో జన్మించిన వ్యక్తులు:


ఈ వ్యక్తులు తరచుగా విజయం, అధికారం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. తమకు అవసరం అనుకుంటే మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకునేందుకు ఏమాత్రం సంకోచించారు. తమ విజయం కోసం జీవిత భాగస్వామిని మోసం చేసేందుకు కూడా సిద్ధంగా ఉంటారు.


ముఖ్య గమనిక: పైన పేర్కొన్న లక్షణాలన్నీ ఆయా తేదీల్లో పుట్టినవారికి వర్తిస్తుందని భావించ కూడదు. వారి జన్మనక్షత్రాలు, పుట్టిన సమయాలు, గడియాలు మీద కూడా వారి వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది. ఇందులో పేర్కొన్న అంశాలు కేవలం అంచనాలు మాత్రమే. కాబట్టి, ఇలాంటి విషయాలను పూర్తిగా నమ్మకూడదని మనవి.


Also Read: రామాయణంలో సుందరకాండకే ఎందుకంత ప్రాధాన్యం - సుందరకాండలో అసలేముంది!


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు.. ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.