Past Life: గత జన్మల గురించి చిన్నప్పుడు చాలా కథలు విన్నాం. పిల్లలు పెరగడం ప్రారంభించినప్పుడు, వారి పూర్వ జన్మ జ్ఞాపకం నెమ్మదిగా తగ్గిపోతుంది. వయస్సుతో, జ్ఞాపకాలు పూర్తిగా మసకబారుతాయి. హిందూ మతం మాత్రమే కాకుండా అనేక ఇతర ప్రాచీన మతాలు కూడా గత జన్మకు గుర్తింపు ఇస్తాయని తెలుసు. సైన్స్ ప‌రంగా చూసినా సైన్స్ పూర్వ జన్మను సవాలుగా పరిగణిస్తుంది. దీనిపై చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ దీనిని పరిష్కరించడం ఇప్పటికీ చాలా క్లిష్టంగా ఉంది. గత జన్మ గురించి మాట్లాడేటప్పుడు, గత జన్మ జ్ఞాపకాలను ఎందుకు గుర్తు చేసుకోలేం అని ఆలోచించడం సహజం. దీనికి శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలను తెలుసుకుందాం.


Also Read: భార్య వ్యవహారాలు భర్తే చూసుకోవాలి.!


1. శాస్త్రీయ నమ్మకాల ప్రకారం


శాస్త్రీయ దృక్కోణంలో, మన మెదడు గత జ్ఞాపకాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోలేని విధంగా నిర్మాణాత్మకంగా పని చేస్తుంది.  మనస్సు కొత్తవాటిని గుర్తుంచుకునేలా, పాతవాటిని మరచిపోయేలా పనిచేస్తుంది. దీనివల్ల అనవసరమైన జ్ఞాపకాలను గుర్తుంచుకోవడానికి మెదడుపై భారం ఉండదు. అందుకే ఇది సరిగ్గా పనిచేస్తుంది. సాధారణంగా మన జీవితంలో చాలా చెడు విషయాలు జరుగుతుంటాయి. మనిషి మనసు పాత సంగ‌తుల‌ను మరచిపోలేకపోతే, కొత్త జీవితాన్ని ప్రారంభించడం అసాధ్యం. ఈ కారణంగా, మనకు మన పూర్వ జన్మలోని విషయాలు గుర్తుండవు.


2. మత విశ్వాసాల ప్రకారం


ఒక వ్యక్తి తన పూర్వ జన్మలో ఎలా మరణించాడో లేదా తన పూర్వ జన్మలో ఏ పని చేస్తున్నాడో అకస్మాత్తుగా గుర్తుకు వస్తే, అతను ప్రస్తుత జీవితంలో కూడా ఆ విషయం గురించి భయపడే అవకాశం ఉంది. ప్రతి వ్యక్తి తన బాధలు, ఇబ్బందుల‌ను వదిలించుకోవాలని కోరుకుంటాడు అనేది మత విశ్వాసం.


Also Read : ఓదార్పు అంటే ఇదీ - ద్రౌపదీ వస్త్రాపహరణం తర్వాత శ్రీకృష్ణుడు-ద్రౌపది మధ్య జరిగిన సంభాషణ అత్యంత ఆసక్తికరం


3. ఈ పద్ధతి ద్వారా గత జన్మ జ్ఞాప‌కాలు


హిప్నాటిజం అనే భారతదేశపు పురాతన జ్ఞానం నేటికీ వినియోగంలో ఉంది. ప్రస్తుతం, ఒకరి గత జీవితాన్ని గుర్తు చేసుకోవడానికి హిప్నాటిజాన్ని ఉపయోగించడం ఉత్తమ మార్గంగా ప‌రిగ‌ణిస్తారు. నేటికీ చాలా మంది తమ గత జీవితాలను గుర్తుంచుకోవడానికి ఈ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. అయితే, దీనితో కూడా వ్యక్తి గుర్తుపెట్టుకున్నది నిజమా లేదా అబద్ధమా అనేది పూర్తిగా కచ్చితంగా తెలియదు.


పాత జ్ఞాప‌కాల‌ను మరచిపోకుండా తదుపరి జీవితాన్ని గడపలేం కాబట్టి పూర్వజన్మను మరచిపోతారని చెబితే, మత విశ్వాసాల  ప్రకారం, పూర్వజన్మలో జరిగిన సంఘటనలు దుఃఖాన్ని, బాధను కలిగిస్తాయి. కాబట్టి ఒక వ్యక్తి తన పూర్వ జీవితాన్ని మరచిపోతాడు. అతను మునుపటి జీవితంలోని సంఘటనలను గుర్తుంచుకుంటే ప్రస్తుత జీవితంలో కూడా భయపడుతూ జీవిస్తాడు. అందువ‌ల్లే మ‌న‌కు గ‌త జ‌న్మ తాలూకు జ్ఞాప‌కాలు గుర్తుండ‌వు.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.