జూన్ 18 శనివారం పంచాంగం


శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు


తేదీ: 18- 06 - 2022
వారం:  శనివారం


శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం


తిథి  : చవితి  శనివారం ఉదయం 8.05 వరకు తదుపరి పంచమి
వారం : శనివారం
నక్షత్రం:  శ్రవణం మధ్యాహ్నం 1.03 వరకు తదుపరి ధనిష్ఠ
వర్జ్యం : సాయంత్రం 4.50 నుంచి 6.21 వరకు 
దుర్ముహూర్తం : సూర్యోదయం ముంచి ఉదయం 7.13 వరకు
అమృతఘడియలు  : రాత్రి 1.55 నుంచి తెల్లవారుజామున 3.26 వరకు 
సూర్యోదయం: 05:29
సూర్యాస్తమయం : 06:32


( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)


Also Read: ఫెంగ్ షుయ్‌ ప్రకారం ఈ వస్తువులు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి తిష్టవేసుకుని కూర్చుంటుదట


శనివారం శ్రీవేంకటేశ్వస్వామికి ప్రీతికరమైన రోజు.  శ్రీవారి భక్తులకోసం శ్రీ వేంకటేశ విజయ స్తోత్రం


శ్రీ వేంకటేశ విజయ స్తోత్రం (Sri Venkatesha Vijaya Stotram )


దైవతదైవత మంగలమంగల
పావనపావన కారణకారణ |
వేంకటభూధరమౌలివిభూషణ
మాధవ భూధవ దేవ జయీభవ || 


వారిదసంనిభదేహ దయాకర
శారదనీరజచారువిలోచన |
దేవశిరోమణిపాదసరోరుహ
వేంకటశైలపతే విజయీభవ || 


అంజనశైలనివాస నిరంజన
రంజితసర్వజనాంజనమేచక |
మామభిషించ కృపామృతశీతల-
-శీకరవర్షిదృశా జగదీశ్వర || 


వీతసమాధిక సారగుణాకర
కేవలసత్త్వతనో పురుషోత్తమ |
భీమభవార్ణవతారణకోవిద
వేంకటశైలపతే విజయీభవ ||


స్వామిసరోవరతీరరమాకృత-
-కేలిమహారసలాలసమానస |
సారతపోధనచిత్తనికేతన
వేంకటశైలపతే విజయీభవ || 


ఆయుధభూషణకోటినివేశిత-
-శంఖరథాంగజితామతసం‍మత |
స్వేతరదుర్ఘటసంఘటనక్షమ
వేంకటశైలపతే విజయీభవ ||


పంకజనానిలయాకృతిసౌరభ-
-వాసితశైలవనోపవనాంతర |
మంద్రమహాస్వనమంగలనిర్జ్ఝర
వేంకటశైలపతే విజయీభవ ||


నందకుమారక గోకులపాలక
గోపవధూవర కృష్ణ పరాత్పర |
శ్రీవసుదేవ జన్మభయాపహ
వేంకటశైలపతే విజయీభవ ||


శైశవపాతితపాతకిపూతన
ధేనుకకేశిముఖాసురసూదన |
కాలియమర్దన కంసనిరాసక
మోహతమోపహ కృష్ణ జయీభవ || 


పాలితసంగర భాగవతప్రియ
సారథితాహితతోషపృథాసుత |
పాండవదూత పరాకృతభూభర
పాహి పరావరనాథ పరాయణ || 


శాతమఖాసువిభంజనపాటవ
సత్రిశిరఃఖరదూషణదూషణ |
శ్రీరఘునాయక రామ రమాసఖ
విశ్వజనీన హరే విజయీభవ || 


రాక్షససోదరభీతినివారక
శారదశీతమయూఖముఖాంబుజ |
రావణదారుణవారణదారణ-
-కేసరిపుంగవ దేవ జయీభవ || 


కాననవానరవీరవనేచర-
-కుంజరసింహమృగాదిషు వత్సల |
శ్రీవరసూరినిరస్తభవాదర
వేంకటశైలపతే విజయీభవ || 


వాదిసాధ్వసకృత్సూరికథితం స్తవనం మహత్ |
వృషశైలపతేః శ్రేయస్కామో నిత్యం పఠేత్సుధీః || 


ఇతి శ్రీ వేంకటేశ విజయ స్తోత్రమ్ |


Also Read: చనిపోయిన వారి ఫొటోలు వాస్తు ప్రకారం ఇంట్లో ఈ ప్రదేశాల్లో అస్సలు పెట్టకూడదు


శ్రీ వేంకటేశ్వర దివ్య వర్ణన స్తోత్రం
ఈ దివ్య స్తోత్రాన్ని  18 సార్లు చదివి స్వామివారికి హారతిస్తే అనకున్నవి నెరవేరుతాయని భక్తుల విశ్వాసం


ఓం శిరసివజ్ర కిరీటం - వదనే శశివర్ణ ప్రకాశం
ఫాలే కస్తూరి శ్రీగంధ తిలకం - కర్ణే వజ్ర కుండల శోభితం
నాసికాయాం సువాసిక పుష్పాదళం - నయనే శశిమండల ప్రకాశం
కంఠేసువర్ణపుష్ప మాలాలంకృతం - హృదయే శ్రీనివాస మందిరం
కరే కరుణాభయసాగరం భుజేశంఖ చక్రగదాధరం
స్కంధే సువర్ణ యజ్ఞోపవీత భూషణం - సర్వాంగే స్వర్ణపీతాంబరం ధరం
పాదే పరమానందరూపం - సర్వపాపనివారకం  
సర్వం స్వర్ణమయం - నామ పావనం శ్రీ వేంకటేశం
శ్రీనివాసం - తిరుమలేశం - నమామి శ్రీ వేంకటేశం !!