Indo-Pak War 

పహల్గాం ఉగ్రదాడి పూరీ జగన్నాథుడి ఆలయంపై జెండాకి ఏంటి సంబంధం

ఉగ్రదాడి, భారత్-పాక్ యుద్ధం గురించి జగన్నాథుడు ముందే హింట్ ఇచ్చాడా

జగమంతా పాలించే జగన్నాథుడి ఆలయంపై జెండాను గరుడ పక్షి జెండా ఎత్తుకెళ్లడం అశుభానికి సూచనేనా?

ఏదో జరగబోతోందనే సంకేతంగా పూరీ ఆలయంపై జెండాను గరుత్మంతుడు జెండా ఎత్తుకెళ్లాడా?

కురుక్షేత్ర యుద్ధానికి ముందు సంధికోసం శ్రీ కృష్ణుడు కౌరవుల దగ్గరకు వెళతాడు. పాండవులకు ఐదు ఊర్లిస్తే చాలని అడిగినా కౌరవులు అంగీకరించరు. అదే రోజు రాత్రి ఏం జరిగిందంటే...ఓ గరుడ పక్షి వచ్చి ఓ పతాకాన్ని తీసుకెళ్లిపోతుంది, నక్కలు అరుస్తాయి, భూమి కంపిస్తుంది.  ఈ శకునాలు చూసి ఏదో జరగబోతోందని ధృతరాష్ట్రుడు గమనించాడు. అదే విషయం దుర్యోధనుడికి చెప్పి హెచ్చరించాడు కానీ దుర్యోధనుడు పట్టించుకోలేదు. ఆ తర్వాత జరిగిందే కురుక్షేత్ర సంగ్రామం.

ఇప్పుడు కూడా పూరీ జగన్నాథుడి ఆలయంపై జెండాను గరుత్మంతుడు ఎత్తుకెళ్లిన తర్వాత కశ్మీర్లో ఉగ్రవాదుల దాడి జరిగింది. ఎన్నో జ్ఞాపకాలను మూటగట్టుకునేందుకు వెళ్లిన పర్యాటకులు వారి కుటుంబాలను పుట్టెడు దుఃఖంలో ముంచెత్తారు. ఆతర్వాత భారత ప్రభుత్వం తీవ్రంగా రియాక్టైంది. దాయాదిదేశానికి గట్టిగా బుద్ధి చెప్పాలని ఫిక్సైంది. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయి. త్రివిద దళాలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు ప్రదాని మోదీ. త్వరలోనే ధర్మయుద్ధం జరగబోతోందని భారతీయులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా భారత్-పాక్ మధ్య యుద్ధం జరుగబోతుందనే సంకేతం ఇస్తూ  జెండాను గరుత్మంతుడు తీసుకెళ్లి ఎగరేసి వదిలేశాడని చెబుతున్నారు ఆధ్యాత్మిక వేత్తలు.  

2025 ఏప్రిల్ 12 సాయంత్రం పూరీ జగన్నాథ్ ఆలయం గోపురంపై ఓ గరుడ పక్షి ప్రదక్షిణలు చేసింది. ఆలయంపై ఉన్న జెండాను పట్టుకుని మరీ ప్రదక్షిణ చేసి ఆ తర్వాత ఓ దగ్గర జెండాను వదిలేసి వెళ్లిపోయింది. ఈ ఘటనను కొందరు వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటన క్షణాల్లో వైరల్ అయింది. పూరీ ఆలయం గోపురంపై ఉన్న జెండాకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఈ ఆలయంలో జెండా గాలిదిశకు రివర్స్ లో ఎగురుతుంది. 45 అంతస్తులున్న ఈ ఆలయంపై జెండాను నిత్యం మారుస్తారు. 1800 ఏళ్లుగా ఈ ఆచారం సాగుతోంది...ఒక్కరోజు ఈ జెండాను ఎగరేయడం మానేసినా 18 ఏళ్లపాటూ ఆలయం మూతపడుతుందని నమ్మకం. ఇంత మహిమాన్విత అయిన జెండాను గరుడపక్షి తీసుకెళ్లడం అంటే అది ఓ హెచ్చరిక అంటున్నారు ఆధ్యాత్మిక వేత్తలు ఇది దైవ సందేశమా..ప్రమాద హెచ్చరికా అని అప్పట్లోనే చర్చ జరిగింది. 2020లో ఈ జెండా అగ్నికి ఆహుతైంది..ఆ సమయంలో కరోనా వచ్చి దేశం అల్లాడిపోయిందని గుర్తుచేశారు. అలానే ఇప్పుడు కూడా ఏమైనా జరగబోతున్నాయా అంటూ సోషల్ మీడియా వేదికలా చాలామంది భక్తులు సందేహాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి కూడా ఈ కోవకే చెందుతుంది అంటున్నారు. అప్పట్లో కురుక్షేత్ర యుద్ధంలా ఇప్పుడు కూడా భారత్-పాక్ మధ్య యుద్ధం వస్తుందేమో అంటున్నారు ఆధ్యాత్మిక వేత్తలు. 

ఇందులో వాస్తవం ఎంత? ఇది ఎంతవరకూ విశ్వశించాలి అన్నది స్పష్టంగా చెప్పలేం..ఇది కేవలం నమ్మకం, మత విశ్వాసాలమీద ఆధారపడి చెప్పిన విషయం మాత్రమే.

వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్ |దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ ‖