మే 03 రాశిఫలాలుమేష రాశి
మేష రాశి వారికి ఈ రోజు ఆదాయం బావుంటుంది. కష్టపడి చేసిన పనికి మించిన అదృష్టం వరిస్తుంది. మీరు ముందుగా చేసిన ప్రయత్నం లేదా పెట్టుబడి ఈ రోజు ప్రయోజనకరంగా మారుతుంది. ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుంచి సహకారం లభిస్తుంది. ఇంటా బయటా మీ గౌరవం పెరుగుతుంది. ధార్మిక కార్యక్రమాలలో కూడా చురుకుగా పాల్గొంటారు. భాగస్వామ్యంలో ఏ పని చేసినా మీకు మంచిది.
వృషభ రాశి
ఈ రోజు మీరు ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. పనిపై కూడా పూర్తి శ్రద్ధ వహించాలి. పని ప్రాధాన్యతను నిర్ణయించి పని చేయాల్సి ఉంటుంది లేదంటే ముఖ్యమైన పనులు ఆగిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యమైన పత్రాల విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. పూర్తిగా చదవకుండా ఏ పేపర్ పైనా సంతకం పెట్టొద్దు. ప్రమాదకరమైన పనులకు దూరంగా ఉండడం మంచిది. మీకు కుటుంబం నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. తెలివితేటలతో సవాళ్లు ఎదుర్కొంటారు. మిథున రాశి
ఈ రోజు మీరు ఏదైనా పనిలోనైనా ముందుకు సాగే ముందు దాని లాభనష్టాలను ముందుగా అంచనా వేసుకోవాలి. ఇంటి ఏర్పాట్లు, నిర్వహణపై డబ్బు ఖర్చు చేస్తారు. మీ వ్యాపార ప్రణాళికలను చాలా జాగ్రత్తగా అమలు చేయాలి లేకపోతే మీకు నష్టం జరుగుతుంది. కుటుంబంలో ఏదైనా ప్రత్యేక సందర్భం వల్ల ఆనందం వస్తుంది. మీ గౌరవం పెరుగుతుంది. ఏ పనిచేసినా పూర్థిస్థాయిలో మనసు కేంద్రీకరించి చేయండి. వివిధ రకాల ఆలోచనల మధ్య చేసే పని మీకు నష్టాన్నిస్తుంది.
కర్కాటక రాశి
ఈ రోజు కర్కాటక రాశి వారికి శ్రమతో కూడుకున్నది అవుతుంది. మీపై పని బాధ్యత అధికంగా ఉంటుంది. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. అప్పు తీసుకోవడం, ఇవ్వడం నుంచి దూరంగా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు రేపు పని ప్రదేశంలో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి మరియు ఉన్నతాధికారులతో సామరస్యంగా వ్యవహరించాలి. విద్యార్థులకు వారి ప్రయత్నాలకు అనుగుణంగా ఫలితాలు లభించడం వల్ల సంతోషం ఉంటుంది. రేపు మీరు కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. వైవాహికజీవితం సాధారణంగా ఉంటుంది
సింహ రాశి ఈ రోజు మీకు సానుకూలంగా సాగిపోతుంది. మీ పని ప్రణాళిక ప్రకారం ప్రారంభిస్తారు. అయితే ఎదుటివారిని నమ్మి రంగంలోకి దిగేయవద్దు. మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సహోద్యోగులపై అతి నమ్మకం పెట్టుకోవద్దు. చాలా కాలంగా ఆగిపోయిన పనిని ఈ రోజు పూర్తిచేసేస్తారు. కుటుంబంలో సమారస్యాన్ని కాపాడుకోవడంలో విజయం సాధిస్తారు. దాంపత్య జీవితం సంతోషంగా సాగిపోతుంది.
కన్యా రాశి
ఈరోజు మీరు చేసే పనుల్లో పురోగతి ఉంటుంది. సంతోషంగా ఉంటారు. వాహనం కొనుగోలు చేసేందుకు ప్రయత్నించేవారి కల నెరవేరుతుంది. ప్రభుత్వానికి సంబంధించి పెండింగ్ ఉన్న పనులు పూర్తవుతాయి. ఎప్పటి నుంచో ఆగిన పనులు ఓ కొలిక్కి వచ్చేస్తాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఉత్తేజకరమైన పనులు చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తారు.
తులా రాశి ఈ రోజు మీలో ధైర్యం, ఉత్సాహం నిండి ఉంటాయి. కొన్ని విషయాల్లో రిస్క్ తీసుకుంటేన పనులు పూర్తవుతాయి. మానసిక సమస్యలు, ఆందోళన నుంచి ఈ రోజు మీకు ఉపశమనం లభిస్తుంది. కుటుంబ సభ్యల ద్వారా సంతోషకరమైన వార్తలు వింటారు. తొందరపాటుతో పనులు చేయొద్దు, నిర్ణయాలు తీసుకోవద్దు. వ్యాపారంలో లాభాలుంటాయి. ఇతరుల విషయాలకు దూరంగా ఉండడం మంచిది.
వృశ్చిక రాశి ఈ రోజు వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలున్నాయి. కుటుంబ సభ్యుని వివాహం గురించి చర్చలు జరుగుతాయి. కుటుంబంతో మంచి సమయం స్పెండ్ చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఏదైనా విలువైన వస్తువు బహుమతిగా లభించవచ్చు. మీ విలువలు, సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తారు. చేపట్టిన పనిని విజయవంతంగా పూర్తిచేసేందుకు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. సంతానం ఆరోగ్యం గురించి మీరు కొంత ఆందోళన చెందవచ్చు.
ధనుస్సు రాశి ఈ రోజు మీరు సృజనాత్మక పనులలో ఎక్కువ ఆసక్తి చూపుతారు. మీ కళాత్మక నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీ సహోద్యోగుల నుంచి సహకారం అందుతుంది. మీ వ్యక్తిత్వం, ప్రవర్తన మీకు గౌరవాన్ని అందిస్తుంది. మీరు ఉన్నతాధికారుల ఆశలను నెరవేరుస్తారు. మీరు ఇచ్చిన హామీలను విజయవంతంగా పూర్తిచేస్తారు. వ్యాపారంలో ముందుగా పెట్టిన పెట్టుబడికి మంచి లాభం పొందుతారు.
మకర రాశి ఈ రోజు మకర రాశి వారికి ముఖ్యమైనది, లాభదాయకంగా ఉంటుంది. దానధర్మాలలో మీ ఆసక్తి పెరుగుతుంది . ఏదైనా సామాజిక కార్యక్రమంలో పాల్గొంటారు. మీ పని ప్రదేశంలో అదృష్టం కలిసొస్తుంది. ఏదైనా చాలా కాలంగా ఆగిపోయి ఉంటే ఆ పని పూర్తవుతుంది. పెరుగుతున్న ఖర్చులపై నియంత్రణ ఉండాలి. ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి రేపు సానుకూల వార్తలు లభించవచ్చు. మీరు ఏదైనా దూర ప్రయాణం వ్యాపార ప్రయాణం చేయాల్సి వస్తుంది. తొందరపడి తీసుకున్న నిర్ణయాలు మీకు ఇబ్బంది కలిగించవచ్చు.
కుంభ రాశి
ఈ రోజు కుంభ రాశి వారికి వ్యాపారం పరంగా లాభాలుంటాయి. అభివృద్ధి, లాభం కోసం మంచి అవకాశాలు లభిస్తాయి. పని ప్రదేశంలో కొత్త వనరుల నుంచి లాభపడతారు, ఆదాయం పెరుగుతుంది. చాలా కాలంగా ఉన్న గృహ సమస్యల నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది. ప్రభుత్వ రంగ పనిలో రేపు మీకు అనుభవజ్ఞులైన వ్యక్తి సహాయంతో లాభం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో మీరు జాగ్రత్త వహించాలి. ఏదైనా చట్టపరమైన విషయం కోర్టులో జరుగుతుంటే రేపు మీకు అందులో సానుకూల ఫలితం లభించవచ్చు.
మీన రాశి
ఈ రాశివారు ఆదాయం , ఖర్చుల మధ్య సమతుల్యతను కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. పని ప్రదేశంలో మీ పనిలో కొన్ని అడ్డంకులను ఎదుర్కోవచ్చు, కానీ మీ ఉన్నతాధికారుల సహాయంతో వాటిని అధిగమించడంలో మీరు విజయం సాధిస్తారు.ఓ కొత్తవ్యక్తిని కలుస్తారు..వారి నుంచి ముఖ్యమైన సమాచారం లభించవచ్చు. మీ సానుకూల ఆలోచన వల్ల మీకు చాలా లాభం ఉంటుంది. తల్లి తరఫునుంచి ఆర్థికంగా లాభపడతారు.
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.