జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం ఈ రెండూ కూడా వ్యకి భవిష్యత్తు, స్వభావం, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని తెలుసుకోవడానికి సహాయపడతాయి. జ్యోతిష్యంలో ప్రతి వ్యక్తికి వారి వారి కాలగణను బట్టి ఒక్కో రాశి ఉంటుంది. అదే విధంగా సంఖ్యా శాస్త్రంలో కూడా వారి పుట్టిన తేదీ, సంవత్సరాన్ని బట్టి వారి సంఖ్య ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం, మీ సంఖ్యను లెక్కించడానికి, మీరు మీ పుట్టిన తేదీ, నెల, సంవత్సరాన్ని యూనిట్ అంకెకు జోడిస్తే వచ్చే సంఖ్యే మీది. ఉదాహరణకు, నెలలో 2, 11, 20 తేదీలలో జన్మించిన వ్యక్తులకు రాడిక్స్ సంఖ్య 2 ఉంటుంది. నవంబర్ 5న మీ రోజు ఎలా ఉంటుందో తెలుసుకోండి. మరి సంఖ్యా శాస్త్రం ప్రకారం ఈరోజు (నవంబర్ 5) మీకు ఎలా ఉండబోతుందో తెలుసుకోండి.
నంబర్ 1
వీరికి ఈ రోజు చాలా సాధారణంగా గడుస్తుంది. కొత్త పనులేవీ ప్రారంభించకపోవడం మంచిది. చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఆఫీస్ లో సహోద్యోగులతో, అధికారులతో విభేదాలు ఏర్పడేందుకు అవకాశం ఉంది. పాతమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారంలో లాభాలు ఆశించినంతగా రాకపోవచ్చు. వాతావరణంలో మార్పు వల్ల ఆరోగ్యంపై ప్రభావం ఏర్పడుతుంది. ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది. దాంపత్య జీవితం బాగుంటుంది.
నంబర్ 2
ఈరోజు చాలా ఆహ్లాదకరంగా రోజు గడుస్తుంది. కొత్త పదవులను పొందుతారు. వ్యాపారంలో ఆశించిన లాభాలు గడిస్తారు. వ్యాపారంలో పోటీ పరిస్థితులకు దూరంగా ఉండండి. కుటుంబ మద్ధతు లభిస్తుంది. దాంపత్య జీవితం బాగుంటుంది. విహారయాత్రలకు వెళ్లే అవకాశాలున్నాయి. కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు.
నంబర్ 3
నేడు మీకు మిశ్రమ ఫలితాలు చూపిస్తున్నాయి. కొత్తపనులేవీ ప్రారంభం చేయవద్దు. విందులు, వినోదాలలో పాల్గొనే అవకాశాలున్నాయి. విహారయాత్రలకు వెళ్లడానికి ప్రణాళికలు చేస్తారు. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు అధికం. కడుపునొప్పి బాధిస్తుంది. ఆహారంపై నియంత్రణ పాటించడం చెప్పదగిన సూచన. కుటుంబ సహాయ సహకారాలు లభిస్తాయి.
నంబర్ 4
కార్యాలయంలో చాలా జాగ్రత్తగా పనిచేయండి. ఆర్ధిక విషయాల్లో ఆచితూచి ఖర్చులు చేయండి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. కోపం పనికిరాదు. కుటుంబంలో ఒకరికి అనారోగ్య సూచనలు కనిపిస్తుంది. మానసికంగా చాలా ఒత్తిడిగా ఉంటారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం.
నంబర్ 5
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి.. ఏదైనా పని ప్రారంభించే ముందు తెలిసిన వ్యక్తిని సంప్రదించడం మంచిది. వ్యాపారంలో ఆకస్మిక లాభాలు సూచిస్తున్నాయి. కుటుంబ సమస్యలు బాధిస్తాయి. భావోద్వేగాలను అదుపులో పెట్టుకుంటే మంచిది. తొందరపడి ఏవిషయంపై నిర్ణయాలను తీసుకోకండి. సమయానికి తగిన ఆహారం తీసుకోవాలి.
నంబర్ 6
ఈరోజు వీరికి చాలా అనుకూలంగా ఉంది. కొత్త ప్రణాళికలను ప్రారంభిస్తారు. ముఖ్యమైన విషయాలపై ఆచితూచి అడుగువేయడం చెప్పదగిన సూచన. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. దూరప్రయాణాలు చేస్తారు.
నంబర్ 7
చాలా ఆహ్లాదకరంగా ఈరోజు గడుస్తుంది. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఎప్పటి నుంచో పరిష్కారం దొరకని సమస్యకు పరిష్కారం లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు పొందుతారు. ప్రేమవ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. దైవసంబంధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగుంటుంది.
నంబర్ 8
అత్యుత్సాహంతో ఏ పనులను చేయకపోవడం మంచిది. వ్యాపారంలో ఆశించిన లాభాలు పొందకపోవచ్చు. కార్యాలయంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ మద్ధతు లభిస్తుంది. దాంపత్య జీవితం బాగుటుంది. అనారోగ్య సూచనలు ఉన్నాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం.
నంబర్ 9
ఈరోజు చాలా ఆహ్లాదకరంగా కాలం గడుపుతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అనారోగ్య బాధలు తొలుగుతాయి. కొత్త ప్రణాళికలు చేస్తారు. వ్యాపారంలో, ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది. పోటీ పరిస్థితులకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. దైవసంబంధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారంలో ఆశించిన లాభాలు పొందుతారు.