Chanakya Niti: జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండకపోవడమే ఆనంద రహస్యం. కానీ, జీవితంలో ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే కళ నేర్చుకోవడమే రహస్యం. సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి అవసరమైన రహస్యాల గురించి చాణక్యుడి నీతి చెబుతుంది. ఒక వ్యక్తి సంతోషంగా ఉండాలంటే ఈ నాలుగు సంద‌ర్భాల్లో ఎప్పుడూ జోక్యం చేసుకోకూడదని చాణక్యుడు చెప్పాడు. మనం ఏ సంద‌ర్భంలో జోక్యం చేసుకోకూడదో తెలుసా?

చాణక్యుని శ్లోకం

"వ్ప్రయోవ్రీప్రవాహనేశ్చ దంపత్యోః స్వామిభృత్యయోఃఅంత్రేణ గంథవ్యం హాలస్య వృషభస్ ||''

1. జ్ఞానుల మధ్య జోక్యం చేసుకోకండిఈ శ్లోకంలో ఆచార్య చాణక్యుడు చెప్పిన‌ ప్రకారం, ఇద్దరు జ్ఞానులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు, ఎవరూ వారిని అడ్డుకోకూడదు. అలా చేస్తే వారి పనికి ఆటంకం కలుగుతుంది. దీనినే మూర్ఖత్వం అంటారు. తెలివైన వ్యక్తి ఎప్పుడూ ఇలా చేయడు. అలాంటప్పుడు వాళ్ళ మధ్యకి వెళితే వారు నిన్ను మూర్ఖుడని అనుకుంటారు. ఇది మీ గౌరవ, ప్రతిష్ఠ‌ల‌ను దెబ్బతీస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.

Also Read: ఇలాంటి అలవాట్లు ఎప్పటికీ మారవని చెప్పిన ఆచార్య చాణక్యుడు

2. భార్యాభర్తల మధ్యకు వెళ్లవద్దుభార్యాభర్తలు జీవిత రథానికి రెండు చక్రాలు అని చాణక్యుడు తన చాణక్య నీతిలో చెప్పాడు. భార్యాభర్తలు కలిసి కొన్ని పనులు చేసినప్పుడు, వారి పనిలో మూడవ వ్యక్తి జోక్యం చేసుకోకూడదని చాణక్యుడు చెప్పాడు. అలాగే, ఏ వ్యక్తి కూడా వారి సంభాషణకు అంతరాయం కలిగించకూడదు. ఇది వారి వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ‌కు భంగం కలిగిస్తుందని చాణ‌క్యుడు తెలిపారు.

3. నాగలి - ఎద్దుల మధ్య వెళ్లవద్దు                  నాగలి, ఎద్దులు కలిసి వెళుతున్న‌ప్పుడు మీరు వాటి మ‌ధ్య‌లోకి వెళ్లి తప్పు చేయకూడదు. అలా వెళితే మీరు గాయాల‌పాలై బాధ ప‌డ‌వచ్చు. ఒక్కోసారి ఈ తప్పు మరణానికి దారితీస్తుందని చాణక్యుడు హెచ్చ‌రించాడు.

4. య‌జ్ఞం- పండితుల మధ్యకు వెళ్లవద్దు             అగ్నిగుండం దగ్గర పూజారి లేదా వేద పండితులు కూర్చున్నప్పుడు, ఎవరూ వారి మ‌ధ్య‌గా వెళ్ల‌కూడదు. ఇలా చేయడం వల్ల వారి పూజలో ఆటంకాలు ఏర్పడి హవన యాగానికి ఆటంకం కలుగుతుంది. దీనివల్ల అలా మ‌ధ్య‌లో వెళ్లిన వ్యక్తి పాపంలో పాలుపంచుకుంటాడని చాణక్యుడు చెప్పాడు.

Also Read : భార్యాభర్తలు ఇలా ఉండకపోతే ఇంట్లో రోజూ యుద్ధ‌మే

ఆచార్య చాణక్యుడి ప్రకారం, ఒక వ్యక్తి పై 4 సంద‌ర్భాల్లో లేదా అలాంటి వ్య‌క్తుల‌ జీవితాలలో ఎప్పుడూ జోక్యం చేసుకోకూడదు. అలా కాకుండా జోక్యం చేసుకుంటే ఒక వ్యక్తి మరణం లేదా నాశనానికి దారి తీస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి.             

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.Join Us on Telegram: https://t.me/abpdesamofficial