Chanakya Niti: ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడిగా పేరొందాడు. విజయవంతమైన, సంతోషకరమైన జీవితానికి ఆచార్య చాణక్యనీతి చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మానవ జీవితాన్ని ప్రభావితం చేసే కొన్ని విషయాలను చాణక్యుడు చాలా విస్తృతంగా అధ్యయనం చేశాడు.


చాణక్యుడి సూత్రాలను పాటించడం ద్వారా మనం జీవితంలోని అత్యంత క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడవచ్చు. అందుకే చాణక్య నీతిని అనుసరించే వ్యక్తి తన జీవితంలో బాధలు, కష్టాలు లేకుండా ఉంటాడు. భార్యాభర్తల సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం చాణక్యుడు కొన్ని ముఖ్యమైన విషయాలను కూడా ప్రస్తావించాడు. వీటిని పాటించడం వల్ల వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.


భార్యాభర్తల బంధం ప్రపంచంలోనే అత్యంత గట్టి బంధమని చాణక్యుడు చెప్పాడు. కానీ ఈ సంబంధం ప్రేమ, నమ్మకం అనే పునాదుల‌పై ఆధారపడి ఉంటుంది. వైవాహిక జీవితంలో ప్రేమ లేదా నమ్మకం లోపిస్తే, ఈ బంధం కూడా బలహీనపడటం ప్రారంభమవుతుంది. కాబట్టి, సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం, ఈ రోజే మీ జీవితంలో చాణక్యుడి సూత్రాలను అమలు చేయండి.


సంతోషకరమైన దాంపత్యం కోసం భార్యాభర్తలు చేయవలసినవి


1. ష‌ర‌తులు లేని ప్రేమ
చాణక్య నీతి ప్రకారం భార్యాభర్తలు ఒకరికొకరు ప్రేమను పంచుకోవడానికి సిగ్గుపడకూడదు. పరస్పరం ప్రేమను పంచుకోకపోతే అది వారి బంధంలో దూరాన్ని, అడ్డంకిని కలిగిస్తుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ, అంకితభావం, త్యాగం విషయంలో ఎలాంటి సంకోచం ఉండకూడదు. కాబట్టి జీవితంలో ఆనందంగా ఉండే అవకాశం దొరికినప్పుడల్లా ఆనందించాల‌ని ఆచార్య చాణక్యుడు సూచించాడు.


2. పరస్పర గౌరవం
వివాహ బంధంలో ప్రేమతో పాటు గౌరవం కూడా ముఖ్యం. అహం భావాల వల్ల సంబంధం చెడిపోతుంది. అందుకే ఈ విషయాన్ని ఎప్పటికీ మరచిపోకూడదు. భర్త తన భార్యను ఎల్లప్పుడూ గౌరవించాలి. భార్య కూడా భర్తను అదే విధంగా గౌరవించాలి. నీ జీవితం నువ్వు జీవించు అనే సూత్రం ఇద్ద‌రికీ వ‌ర్తిస్తుంది. ఇది మీ సంతోషకరమైన వైవాహిక జీవితానికి ఆధారం.


3. భార్యాభర్తల గౌరవం వేరువేరు కాదు
భార్యాభర్తల గౌరవం వేరు కాదన్న విషయం దంప‌తులు అర్థం చేసుకోకపోవడమే బంధం చెడిపోవడానికి అసలు కారణమని చాణక్యుడు చెప్పాడు. భార్యాభర్తలు జీవిత రథానికి రెండు చక్రాల వంటివారు. అందుకే భార్యాభర్తలు ఒకరి తప్పులను, చెడు ల‌క్ష‌ణాల‌ను ఇతరుల ముందు బయటపెట్టకూడదని గుర్తుంచుకోవాలి.


చాణక్య నీతి ప్రకారం, భార్యాభర్తలు పైన పేర్కొన్న 3 ఆలోచనలను అనుసరిస్తే, వారి వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. వారి వైవాహిక బంధం బలంగా ఉంటుంది. మీరు కూడా మీ వైవాహిక జీవితాన్ని సంతోషంగా ఉంచుకోవాలనుకుంటే చాణక్యుడి ఈ సూచనలను అనుసరించండి.


Also Read : దిండు కింద వీటిని పెట్టుకుని పడుకోవడం పెద్ద తప్పు!


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.