Nita Ambani: అంబానీ కుటుంబం ప్రతి పండుగను చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు. ప్రస్తుతం ముఖేష్ అంబానీ, నీతా అంబానీల నివాసం యాంటిలియాలో నవరాత్రి పండుగ సందడి కనిపిస్తోంది. నీతా అంబానీ ప్రతి పండుగకు ప్రత్యేకంగా అలంకరించుకుంటారు. నవరాత్రి సందర్భంగా కూడా ఆమె తన అందమైన, రంగురంగుల, రాయల్ ఇండియన్ దుస్తులతో అందరి దృష్టిని ఆకర్షించారు.

Continues below advertisement

నవరాత్రి సందర్భంగా నీతా అంబానీ ప్రత్యేకంగా తొమ్మిది రంగులతో చేసిన లెహంగా ధరించారు

మానవ్ మంగళాని తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో నీతా అంబానీ ఫోటోలను షేర్ చేశారు. ఫోటోలలో నీతా అంబానీ రంగురంగుల లెహంగాలో చాలా అందంగా ఉన్నారు. ఆమె మోనికా, కరిష్మా రూపొందించిన జెడ్ లెహంగా  చోళీ ధరించారు. నీతా అంబానీ ధరించిన ఈ లెహంగాలో దుర్గాదేవి తొమ్మిది అవతారాలను ప్రదర్శించారు, వీటిని నవరంగ్స్‌గా భావించారు. ఇందులో రిచ్ బెనారసి బ్రోకేడ్‌లో నేసిన తొమ్మిది రంగులు ఉన్నాయి.

Continues below advertisement

నీతా తొమ్మిది రంగులతో పింక్ బ్లౌజ్‌ను జత చేశారు

నీతా అంబానీ తన రంగురంగుల లెహంగాతో పింక్ కలర్ బ్లౌజ్‌ను జత చేశారు. ఆమె బ్లౌజ్‌పై బంగారు, కాంస్య డిజైన్‌లు ఉన్నాయి. ఆమె బ్లౌజ్స్లీ వ్స్‌పై, మెడపై  చక్కటి ఎంబ్రాయిడరీ ఉంది, ఇది వివిధ రంగులతో చేసిన లెహంగాకు సరిగ్గా సరిపోయింది. ఆమె తన లెహంగాను సాంప్రదాయ టై-డై టెక్నిక్‌ని ఉపయోగించి రంగు వేసిన లెహరియా దుపట్టాతో జత చేశారు.

 

వజ్రాలు, పచ్చలతో చేసిన నెక్లెస్‌తో నీతా అంబానీ చాలా స్పెషల్ గా కనిపిస్తున్నారు

నీతా అంబానీ తన తొమ్మిది రంగుల లెహంగాతో పాటూ నగల కోసం 3 లేయర్ల వజ్రాలు, పచ్చలతో చేసిన భారీ, అందమైన నెక్లెస్‌ను ధరించారు. ఆమె మ్యాచింగ్ జుంకాలు పెట్టుకున్నారు. ఆమె చేతికి చాలా ఉంగరాలు  గాజులు కూడా రంగురంగుల లెహంగాతో మ్యాచ్ అయ్యాయి. 

ఇంత అలంకరణకు నిండుదనం ఇచ్చింది  నీతా అంబానీ నుదుటిపై ఎరుపు రంగు బొట్టు. సాధారణ మేకప్ వేసుకుని నిండైన బొట్టు పెట్టుకున్నారు. హెయిర్ స్టైల్ లెహెంగా లుక్ ని మరింత అందంగా మార్చింది. 

నవరాత్రి తొమ్మిది రోజులకు గుర్తుగా... తొమ్మిది రంగులున్న  లెహంగాతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  అభిమానులు వాటిని చాలా ఇష్టపడుతున్నారు. మీరు కూడా దాండియా లేదా గర్బా నైట్ కోసం ఇలాంటి లుక్ ట్రై చేయవచ్చు.

శ్రీశైలం శక్తిపీఠంలో శరన్నవరాత్రి ఉత్సవాలు! 2025లో భ్రమరాంబిక అమ్మవారి అలంకారాలు ఇవే!

నవరాత్రులు ఆధ్యాత్మికంగానే కాదు.. మానసిక శారీరక ఆరోగ్య సాధన కూడా - అందుకే పూజలో ఈ 3 తప్పులు చేయకండి!.. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

2025 శరన్నవరాత్రుల్లో ఏ రోజు ఏ అలంకారం? ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలి? పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి