Navratri 2025: భారతీయ పండుగలు సంప్రదాయం, వేడుకల  ప్రత్యేకమైన కలయికను సూచిస్తాయి. ఈ పండుగలు  జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను నేర్పుతాయి. హిందువుల పండుగలలో ముఖ్యమైన శరన్నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ 22నుంచి ప్రారంభమవుతాయి. తొమ్మిది రోజుల పాటూ 9 రూపాల్లో భక్తులను అనుగ్రహిస్తుంది శక్తి స్వరూపిణి. పదో రోజు విజయదశమి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఎక్కడచూసినా అమ్మవారి పూజలతో శక్తి పీఠాలు, అమ్మవారి ఆలయాలు, హిందువుల లోగిళ్లలో ఆధ్యాత్మిక వాతావరణం నిండి ఉంటుంది. 
 
ఈ సంవత్సరం శారదీయ నవరాత్రి  సెప్టెంబర్ 22న ప్రారంభమవుతుంది.. అక్టోబర్ 2న విజయదశమి జరుపుకుంటారు. నవరాత్రి సమయంలో చేసే పూజలు, ఉపాసనల ద్వారా జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. నవదుర్గ 9 రూపాలు ప్రత్యేక లక్షణాలకు చిహ్నంగా పరిగణిస్తారు. ఇవి భక్తి భావంతో పాటు జీవిత విలువలు ఆదర్శాల గురించి కూడా బోధిస్తాయి. దుర్గాదేవి ఈ 9 వివిధ రూపాలు పెట్టుబడులు , ఆర్థిక మెళకువలు కూడా నేర్పుతాయి. అందుకే దుర్గాదేవి  9 రూపాలను జ్ఞాన పాఠశాల అని పిలుస్తారు.  

Continues below advertisement


నవదుర్గ రూపాల నుంచి నేర్చుకోవాల్సిన  ఆర్థిక పాఠాలు - పెట్టుబడి సలహాలు


Navratri 2025 Day 1 శైలపుత్రి - స్థిరత్వం
పాఠం: ఆర్థిక జీవనంలో బలమైన పునాది అవసరం.
సలహా: అత్యవసర నిధిని ఫిక్స్‌డ్ డిపాజిట్ లేదా లిక్విడ్ ఫండ్స్‌లో ఉంచండి. ఆరోగ్య, జీవన బీమా తీసుకోండి.


Navratri 2025 Day 2 బ్రహ్మచారిణి - క్రమశిక్షణ
పాఠం: దీర్ఘకాలిక ఆర్థిక విజయానికి క్రమశిక్షణ, ఓపికగా ఉండాలి
సలహా: మ్యూచువల్ ఫండ్స్‌లో క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టండి.  ప్రయోజనం కోసం ఓపికగా ఉండండి.


Navratri 2025 Day 3 చంద్రఘంట - శాంతి, ధైర్యం
పాఠం: ఆర్థిక నిర్ణయాల్లో శాంతి, ధైర్యం అవసరం.
సలహా: మార్కెట్ ఒడిదొడుకుల్లో భయపడకండి. ఈక్విటీ, డెట్, గోల్డ్‌లో డైవర్సిఫై చేయండి.


Navratri 2025 Day 4 కూష్మాండ - సృజనాత్మకత
పాఠం: సృజనాత్మక ఆలోచనలు సంపదను పెంచుతాయి.
సలహా:   స్టార్టప్ ఈక్విటీలలో పెట్టుబడి అవకాశాలను చూసుకోండి కానీ రిస్క్‌ను ముందే గుర్తించండి


Navratri 2025 Day 5 స్కందమాత - సంరక్షణ
పాఠం: సంపదను బాధ్యతాయుతంగా సంరక్షించాలి.
సలహా: NPS, EPF వంటి రిటైర్మెంట్ ప్లాన్‌లలో పెట్టుబడి పెట్టండి. పిల్లల విద్య కోసం నిధులు కేటాయించండి.


Navratri 2025 Day 6 కాత్యాయని - ఆర్థిక స్వాతంత్ర్యం
పాఠం: ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం స్వాతంత్ర్యాన్ని ఇస్తుంది.
సలహా: ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టండి, కానీ మీ రిస్క్ సామర్థ్యాన్ని అంచనా వేయండి.


Navratri 2025 Day 7 కాళరాత్రి - అడ్డంకులను అధిగమించడం
పాఠం: సంక్షోభాలను ధైర్యంగా ఎదుర్కోవాలి.
సలహా: మార్కెట్ క్షీణత సమయంలో తక్కువ ధరలకు నాణ్యమైన ఆస్తులు కొనుగోలు చేయండి.


Navratri 2025 Day 8 మహాగౌరి - సరళత
పాఠం: ఆర్థిక నిర్వహణలో సరళత, నీతి ముఖ్యం.
సలహా: ఇండెక్స్ ఫండ్స్, బ్లూ-చిప్ స్టాక్స్ వంటి పారదర్శక పెట్టుబడులు పెట్టండి. ఖర్చులను తగ్గించండి.


Navratri 2025 Day 9 సిద్ధిదాత్రి - జ్ఞానం
పాఠం: ఆర్థిక జ్ఞానం సంపద సృష్టికి కీలకం.
సలహా: ఆర్థిక సాహిత్యం చదవండి, సలహాదారుని సంప్రదించండి, ట్యాక్స్ ప్లానింగ్ గురించి తెలుసుకోండి.


గమనిక:   ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించింది మాత్రమే. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించనవి.  ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.