ఒక్కొక్కరిది ఒక్కోతీరు. ప్రతి ఒక్కరిలోనూ కొన్ని ప్రత్యేకతలుంటాయి, మరికొన్ని మార్చుకోవాల్సిన లక్షణాలుంటాయి. ఏ ఇద్దరి మనస్తత్వం, ప్రవర్తన, తీరు పూర్తిగా ఒకేలా ఉండదు. అయితే అదంతా మీ పేరులో మొదటి అక్షరంపై కూడా ఆధారపడి ఉంటుందంటారు జ్యోతిష్యులు.

  "K" అక్షరంతో పేరున్న వ్యక్తులు రొమాంటిక్ గా, రహస్యాలు మెంటైన్ చేసేవారిగా, పనిపట్ల శ్రద్ధగా ఉంటారు. వారి భావోద్వేగానలు ఇతరుల ముందు దాచే శక్తి కలిగిఉంటారు.  ఈ వ్యక్తులు సంబంధాలు, ప్రేమ సంబంధిత విషయాల విషయానికి వస్తే చాలా తీవ్రంగా తీసుకుంటారు. ఎలాంటి దురాశ, స్వార్థం లేకుండా స్వచ్ఛమైన మనసుతో సహాయం చేస్తారు. 


"K" అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తుల లక్షణాలు



  • "K" అనే అక్షరంతో పేరు ప్రారంభం అయితే ఆ వ్యక్తి రూడ్ గా కనిపించరు కానీ కఠినమైన వ్యక్తి అంటారు జ్యోతిష్యులు

  • ఈ కేటగిరీకి చెందిన వ్యక్తులు ఎక్కువగా ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు.

  • నలుగురిలో తొందరగా కలిసేందుకు సిగ్గుపడతారు కానీ అందరితో మాట్లాడాలని మాత్రం అనుకుంటారు

  • వీరు ఎప్పుడూ అనవసర అటెన్షన్ కు గురవుతారు. అందరి దృష్టినీ ఆకర్షించాలనే ఆలోచన ఉండదు

  • 'k'తో పేరు ప్రారంభమయ్యే వారిలో ఎక్కువ దయాభావం ఉంటుంది. అయితే వారి హృదయానికి దగ్గరైతేనే మీకు ఆ విషయంపై క్లారిటీ వస్తుంది. ఎందుకంటే అందర్నీ ఒకేలా ట్రీట్ చేయడం వీరికి నచ్చదు

  • వీరు అత్యంత సాహసోపేతమైన వ్యక్తి. తమకు సంబంధించిన యుద్ధంలో తామే పోరాడాలి అనుకుంటారు.

  • నమ్మిన వాటిపై బలంగా నిలబడతారు. మంచి జ్ఞానం ఉంటుంది..సహజంగా తెలివైన వారు

  • వీరు అత్యంత సున్నితమైన కమర్షియల్ ట్రిక్స్ ని ప్లే చేయడంలో ఘటికులు. అందుకే ఏ ఆటనైనా ఆడేందుకు ఇష్టపడతారు

  • ఒక్కసారి ఆట మొదలెట్టాక గెలుపుదిశగా సర్వశక్తులు ఒడ్డుతారు, ఆట కూడా ప్రొఫెషనల్ గానే ఉండేలా చూసుకుంటారు

  • ఈ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు సహజంగానే గర్వం ఎక్కువగా కలిగి ఉంటారు. ఎక్కువగా మాట్లాడతారు..అందుకే స్నేహితులు వీరిని వసపిట్ట అంటారు

  • ఈ వ్యక్తులు ఏదైనా చేయాలనుకుంటే ఆ పని పూర్తయ్యే వరకూ ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధపడతాడు.

  • త్వరగా ఆలోచించే శక్తి కలిగి ఉండటం, కష్టపడే మనస్తత్వం ఉండడం వల్ల త్వరగా డబ్బును సంపాదిస్తారు. 


NOTE: ఇవి కొందరు పండితుల నుంచి , కొన్ని బక్స్ నుంచి సేకరించి రాసిన సమాచారం. ఇది విశ్వసించాలా వద్దా అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం...


Also Read: మీ పేరు M,T అక్షరాలతో మొదలైందా.. వామ్మో మీరు మామూలోళ్లు కాదు...