Nagula Chaviti 2022: నాగులచవితికి పుట్టలో పాలుపోసేందుకు వెళ్లేముందు...ముందుగా ఇంట్లో దేవుడికి దీపం పెట్టి నమస్కరించి... చేసిన చలిమిడి, చిమ్మిలి, వడపప్పు , పండ్లు కొంత నైవేద్యం పెట్టి ఆ తర్వాత పుట్టదగ్గరకు వెళతారు. పుట్ట దగ్గర షోడసోపచార పూజలేమీ అవసరం లేదుకానీ అవకాశం ఉంటే నవగాన స్త్రోత్రం, సర్ప సూక్తం చదువుకుంటే మంచిదంటారు పండితులు. పుట్టదగ్గర అంత సమయం ఉండనివ్వరు కదా అనుకుంటే...ఇంట్లో దీపం పెట్టేటప్పుడు చదువుకుని పుట్ట దగ్గరకు వెళ్లినా మంచిదే.  


నవనాగ నామ స్తోత్రం
అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలం!
శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళియం తథా!!


ఫలశృతి:
ఏతాని నవ నామాని నాగానాం చ మహాత్మనామ్!
సాయంకాలే పఠేన్నిత్యం ప్రాతః కాలే విశేషతః!


సంతానం ప్రాప్యతే నూనం సంతానస్య చ రక్షకాః!
సర్వబాధా వినిర్ముక్తః సర్వత్ర విజయీభవేత్!!


సర్ప దర్శనకాలే వా పూజాకాలే చ యః ఫఠేత్!
తస్య విషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్‌!!


ఓం నాగరాజాయనమః ప్రార్థయామి నమస్కరోమి


ఇతి శ్రీ నవనాగ స్తోత్రం.


Also Read: పాములను పూజించడం మూఢనమ్మకమా, పుట్టలో పాలు పోయకూడదా - ఏది నిజం!


సర్ప ప్రార్థన
బ్రహ్మ లోకేచ సర్పః శేషనాగ పురోగమః |
నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నానంత మేసదా || 1 ||


విష్ణు లోకే చ యేసర్పః వాసుకి ప్రముకాస్చయే:
నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నానంత మేసదా || 2 ||


రుద్రలోకే చ యేసర్పః తక్షక ప్రముఖాస్థధా |
నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నానంత మేసదా || 3 ||


ఖాండవస్య తథాదాహే స్వర్గం యే చ సమాశ్రితాః |
నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నానంత మేసదా || 4 ||


సర్పసత్రేయే సర్పాః ఆస్తికేన చరక్షితాః |
నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నానంత మేసదా || 5 ||


ప్రళయే చైవ యే సర్పః కర్కోట ప్రముఖాశ్యయే |
నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నానంత మేసదా || 6 ||


ధర్మలోకేచయే సర్పాః వైతరన్యాం సమాశ్రితాః |
నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నానంత మేసదా || 7 ||


యేసర్పః పార్వతాయేషు దరీసంధిషు సంస్థతాః |
నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నానంత మేసదా || 8 ||


గ్రామేవాయది వారన్యే సర్పః ప్రచరంతిహి
నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నానంత మేసదా || 9 ||


పృథివ్యాం చైవ యేసర్పాయే సర్ప బిలసంస్తితా
నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నానంత మేసదా || 10 ||


రసాతలే చయే సర్పా అనంతాధ్యామహాబలాః
నమోస్తు తేభ్యః సుప్రీతాః ప్రసన్నానంత మేసదా || 11 ||


ఇతి శ్రీ సర్ప ప్రార్థన సంపూర్ణం ||


Also Read: నాగుల చవితి పుట్టలో పాలుపోసే ముహూర్తం వివరాలు, పుట్ట దగ్గర చేయాల్సిన ప్రార్థన!


సర్ప సూక్తం 
నమో అస్తు సర్వేభ్యోయే కేచ పృథివీమను |
మీ అత్తరిక్షే యే దివి తేభ్యః సర్వేభ్యో నమః ॥ 1 ॥


(సర్పాలకు నమస్కారములు. ఈ పృథివిపై, అంతరిక్షంలో, సర్గంలో ఉన్న సర్పాలన్నంటికీ నమస్కారము)


యేధో రోచనే దివో యేవా సూర్యస్య రష్మిషు |
యేషామప్సు సదః కృతం తేభ్యః సర్వేభ్యో నమః ॥ 2 ॥


(అధోలోకములంలో, స్వర్గంలో, సూర్య కిరణాల్లో , నీటిలో నివాసం కల్పించుకుని ఉన్న సర్పాలకు నమస్కారము)


యా ఇషవో యాతుధానానాం యేవా వనస్పతీగ్ం రను |
యే వాsవటేషు శేరతే తేభ్యః సర్వేభ్యో నమః ॥ 3 ॥


(అసురులతో అస్త్రములుగా ప్రయోగింపనివి, వృక్ష సమూహాలలో నివసించేవి, బావుల్లో నిద్రించే సర్పాలకు నమస్కారాలు)


ఇదగ్ం సర్పేభ్యో హవిరస్తు జుష్టమ్ |
ఆశ్రేషా యేషామను యన్తి చేతః ।
యే అంతరిక్షం పృధివీం క్షియన్తి |
తే నస్సర్పాసో హవమాగమిష్ఠాః |
యే రోచనే సూర్యస్వాపి సర్పాః |
యేదివం దేవీమనుసన్చరన్తి |
యేషామాశ్రేషా అనుయన్తి కామమ్ | తేభ్యస్వర్పేభ్యో మధుమజ్జుహోమి ॥ 4 ॥


(ఈ సర్పాలకు ప్రీతికరమైన హవిస్సు అందునుగాక. మంచి బుద్ధిని ప్రసాదించి రక్షించుగా)


నిఘృష్వెరసమాయుతైః |
కాలైర్హరిత్వమాపన్నైః |
ఇంద్రాయాహి సహస్రయుక్ |
అగ్నిర్విభ్రాష్టివసనః |
వాయుశ్వేతసికద్రుకః |
సంవత్సరోవిఘావర్ణైః|
నిత్యా స్తే నుచరాస్తవ |
సుబ్రహ్మణ్యోగ్ం సుబ్రహ్మణ్యోగ్ం సుబ్రహ్మణ్యోగ్ం ॥ 5 ॥


(ఓ సహస్ర నేత్రములు కల ఇంద్రా!కాలానికి అధీనులైన దేవతలతో, ప్రకాశవంతమైన వస్త్రములను ధరించిన అగ్ని దేవునితోనూ, తెల్లటి వాయువుతోనూ, సంవత్సర దేవునితోనూ నిరంతరం సన్నిహితుగా మెలిగే దేవతలతో కూడి నాకు ప్రత్యక్షమగుదువు గాక /నన్ను అనుగ్రహింతువు గాక. ఓం ఓం ఓం సుబ్రహ్మణ్యోగ్ం…


ఇతి శ్రీ సర్ప సూక్తం ||