మూడ్ లో నిద్ర లేస్తామనే దాని మీద ఆరోజు ఎలా గడుస్తుందనేది ఆధారపడి ఉంటుంది. అందుకే శుభ సమయంలో నిద్ర లేవాలని అంటారు. వీలైతే బ్రహ్మీ ముహూర్తంలో నిద్ర లేస్తే మరీ మంచిది. కానీ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కి అలా అంత ఉదయాన్నే నిద్రలేచే అవకాశం చాలా మందికి ఉండడం లేదు. అటువంటప్పుడు కనీసం కొన్ని మంచి అలవాట్లు చేసుకోవడం వల్ల జీవితం సాఫీగా గడిపేందుకు అవకాశం ఉంటుందే తప్ప పెద్ద నష్టం లేదు. కొన్ని సులభమైన నియమాలే పాటించడంలో పెద్దగా ఇబ్బంది లేనపుడు పాటించడం మంచిదే కదా.  అటువంటి కొన్ని మంచి అలవాట్ల గురించి తెలుసుకుందాం.


రోజు మంచి శకునంతో ప్రారంభం అయిందంటే ఆరోజు శుభంగా గడుస్తుందని నమ్ముతాం అందరం. ఆరోజు అనుకున్న పనులన్నీ పూర్తిచెయ్యగలమన్న నమ్మకం వస్తుంది. అయితే కొన్ని పనులు పొద్దున్నే చెయ్యడం లేదా కొన్ని వస్తువులు ఎదురుపడడం అపశకునంగా భావిస్తారు. అలాంటివి జరిగినపుడు అశుభం జరుగుతుందని నమ్ముతారు.  


అద్దంలో చూడడం


ఉదయం లేవగానే అద్దం చూసుకోకూడదు. కొంత మందికి ఈ అలవాటు ఉంటుంది. లేవగానే తలదువ్వుకోవడం వంటివి చేస్తుంటారు. ఇలా చెయ్యకూడదు. ఇందువల్ల నెగెటివిటీ పెరుగుతుంది. లేచి కళ్లు తెరవగానే అరచేతులు చూసుకోవడం మంచి అలవాటు. తర్వాత ముఖం కడుకున్న తర్వాత అద్దం చూసుకొని తలదువ్వుకోవాలి.


ఎంగిలి పాత్రలు


పొద్దున్న లేవగానే ఎంగిలి పాత్రల మీద దృష్టి పడడం అసలు మంచిది కాదు. చాలా మంది రాత్రి బాగా పొద్దు పోయిందనో లేక అలసి పోయామనో రాత్రి భోజనం తర్వాత పాత్రలు శుభ్రం చేసుకోవడం లేదా వాషింగ్ కి పెట్టుకోవడం చెయ్యరు. అది ఎంత మాత్రమూ మంచిది కాదు.  అందుకే రాత్రి తప్పని సరిగా కిచెన్ శుభ్రం చేసుకుని పడుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎంగిలి పాత్రలు ఉదయాన్నే చూడడం నెగెటివిటిని ప్రేరేపిస్తుంది. ఆరోజు వ్యర్థం అవుతుంది.


చెడిపోయిన గడియారం


నిద్ర లేవగానే పనిచేయని గడియారం వైపు చూడడం కూడా అంత మంచిది కాదు. నిజానికి చెడిపోయిన గడియారం పెట్టుకోవడం కూడా వాస్తు దోషంగా పరిగణిస్తారు. చెడిపోయిన గడియారాలు ఇంట్లో ఉంటే అభివృధ్ది ప్రతిబంధకాలుగా వాస్తు వివరిస్తుంది. అటువంటి గడియారాలను ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో పెట్టుకోవద్దు. కాబట్టి ఇంట్లో అనుకోకుండా గడియారం చెడిపోతే దాన్ని తిరగేసి పెట్టడం మంచిది.


 క్రూరమృగాలు


ఇంట్లో సింహాలు, పులుల వంటి హింసాత్మక జంతువుల చిత్రాలు లేదా బొమ్మలు పెట్టుకోవడం అంత మంచిది కాదు. వాస్తు ప్రకారం ఇవి ఇంట్లో అశాంతికి, పోట్లాటలకు కారణం అవుతాయి. కాబట్టి పాములు, పులులు, సింహాల వంటి కౄరమైన మృగాల చిత్రాలు, విగ్రహాలు ఇంట్లో పెట్టుకోకూడదు. ఉదయాన్నే ఇలాంటివి చూస్తే ఆరోజంతా పాడైపోతుంది.


చెత్తబుట్ట


పొద్దున్న లేస్తూనే చెత్తబుట్ట కనిపించడం అంత మంచి శకునం కాదు. కాబట్టి చెత్తబుట్ట ఎప్పుడూ కనిపించని ప్రదేశంలో పెట్టుకోవాలి.


రోజూ నిద్ర లేవగానే రెండు చేతులు చూసుకొని మంచం దిగాలి. తర్వాత ముఖం కడుక్కుని అద్దం చూసుకుని తలదువ్వుకుని రోజు వారీ పనుల్లో పడడం అన్నింటి కంటే ఉత్తమం.