Ponds in Temple: భారతదేశంలోని దాదాపు ప్రతి దేవాలయంలో, పుణ్య‌క్షేత్రంలో ఒక పవిత్రమైన పుష్క‌రిణి ఉండటం మీరు చూసి ఉండవచ్చు. ఈ జలాశయాన్ని లేదా చెరువును తీర్థం లేదా పుష్కరిణి అంటారు. అయితే ఈ రోజుల్లో కొత్తగా కట్టిన చాలా దేవాలయాల్లో ఈ రకమైన పుష్క‌రిణులు కనిపించడం కష్టం. మనం పురాతన దేవాలయాలను పరిశీలిస్తే, పుష్క‌రిణి తప్పక కనిపిస్తుంది. ఈ పుష్క‌రిణిల వెనుక‌ ఒక కథ లేదా చారిత్రక నేపథ్యం ఉంటుంది.  చాలా ప్రసిద్ధ దేవాలయాలు నది ఒడ్డున నిర్మించారు. ఇంతకీ, నీటి వనరులకు ఆలయాలకు సంబంధం ఏమిటి..? భారతదేశంలోని పురాతన దేవాలయాల్లో పుష్క‌రిణులు ఎందుకు ఉన్నాయి..?


1. ప్రాచీన దేవాలయాలలో పుష్క‌రిణి నిర్మాణం
పూర్వకాలంలో దాదాపు అందరూ ఆలయానికి వెళ్లేవారు, సందర్శకులు కూడా ఆలయాలకు సంబంధించిన స‌త్రాల‌లోనే బస చేసేవారు. దేవతలకు నిత్యపూజలు చేసే పూజారులు దేవాలయాల దగ్గర నివసించేవారు. ఆ రోజుల్లో ఆలయ పరిశుభ్రత, దేవతలను శుభ్రపరచడం, త్రాగడానికి, వంట అవసరాలకు, దేవతలకు, భక్తులకు పవిత్ర స్నానాలకు పుష్క‌రిణిలు ప్రధాన నీటి వనరులుగా ఉపయోగించారు.


చాలా మంది దేవాలయాల్లో అన్న‌ప్రసాదం తిని రోజులు గడిపారు. ఆలయ ప్రసాదాన్ని స్వీకరించడానికి చాలా మంది భక్తులు గుమిగూడేవారు. అందువల్ల, దేవాలయాలలో, వాటి చుట్టుపక్కల పవిత్ర పుష్క‌రిణులు, తీర్థాలు నిర్మించారు. అప్ప‌ట్టో అవే సమాజానికి ప్రధాన నీటి వనరులుగా ఉండేవి.


2. దేవాలయాలలో తీర్థాలు
దేవాలయాలు వేద మంత్రోచ్ఛారణలు, గంటలు మోగించడం ద్వారా సృష్టిలో ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తాయి. సాధారణంగా గుడి తప్ప చాలా చోట్ల కూర్చుని కబుర్లు చెబుతుంటారు. కానీ, ప్రజలు ఎప్పుడూ గుడిలో కబుర్లు చెప్పరు. ఆలయంలోని నీటి వనరులు ఆలయంలోని వాతావరణాన్ని మరింత శుద్ధి చేస్తాయి. నీరు జీవానికి మూలం, శక్తికి చిహ్నం కూడా. నీరు సానుకూల శక్తిని గ్రహిస్తుందని అంటారు.


Also Read : రోజూ గుడికి వెళితే మీ జీవితంలో వచ్చే మార్పులు ఇవే - మీరు అస్సలు ఊహించలేరు


వేద మంత్రోచ్ఛారణ, ఆచారాల శక్తి ఆలయంలోని తీర్థం లేదా పవిత్ర కొలను లేదా పుష్క‌రిణుల్లో నివసిస్తుంది. ఆ పవిత్ర జలాన్ని తాకడం లేదా స్నానం చేయడం వల్ల శ‌రీరానికి కొత్త శక్తి వస్తుంది. అందుకే నీటి కొలనుల చుట్టూ లేదా నదీ తీరాల దగ్గర దేవాలయాలు నిర్మించారు. తీర్థం, పుష్క‌రిణి లేదా పవిత్రమైన న‌దుల సమీపంలో దేవాలయాలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రదేశంలో సానుకూల శక్తులు, దైవిక శక్తుల ప్రవాహం ఎక్కువగా ఉంటుంది. ఇది భక్తులకు దైవిక శక్తి అనుభవాన్ని ఇస్తుంది.         


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.


Also Read : మాంసాహారం తిన్న త‌ర్వాత‌ గుడికి ఎందుకు వెళ్లకూడదో తెలుసా..?