First Humans on Earth: సనాతన ధర్మంలో బ్రహ్మ దేవుడిని విశ్వం లేదా సృష్టికి కర్తగా పేర్కొన్నారు. బ్రహ్మదేవుడు లోకకల్యాణం, లోక అభివృద్ధి కోసం తనను తాను రెండు భాగాలుగా విభజించుకున్నాడని మత్స్య పురాణంలో పేర్కొన్నారు. బ్రహ్మ విశ్వాన్ని సృష్టించిన తర్వాత ఈ భూమిపైకి మొదట ఎవరు వచ్చారు..? దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇదిగో.    


1. విశ్వంలో మొదటి స్త్రీ, పురుషులు


ప్రపంచ అభివృద్ధి కోసం బ్రహ్మ తనను తాను 2 భాగాలుగా విభజించుకున్నప్పుడు బ్రహ్మ శరీరం నుంచి కాయ ఉద్భవించింది. ఇందులో మొదటి భాగాన్ని 'క' గా, రెండో భాగాన్ని 'య' గా భావించారు. బ్రహ్మదేవుడు మొదటి భాగంలో దైవిక శక్తితో మనువును, రెండవ భాగంలో శత‌రూపాన్ని సృష్టించాడు. ఈ ఇద్దరినీ విశ్వం లేదా ప్రపంచంలో మొదటి స్త్రీ, పురుషుల‌ని పిలుస్తారు.


Also Read : న‌గ‌దు చెల్లించకుండా తీసుకోకూడని వస్తువులు ఇవే - ఎందుకో తెలుసా!


2. మాన‌వ‌ అనే పేరు ఎలా వచ్చింది


బ్రహ్మ సృష్టించిన స్త్రీ, పురుషుల్లో స్వయంభూ మనువును విశ్వంలో మొదటి మానవుడిగా పరిగణిస్తారు. ప్రపంచంలోకి వచ్చిన మొదటి వ్యక్తి మనువు, ఈ వంశాన్నే మానవ జాతి అని పిలుస్తారు.         


3. మనువు, శతరూప కుమారులు


బ్రహ్మదేవుడు మనువు, శ‌త‌రూపాల‌ను సృష్టించినప్పుడు, ఈ ఇద్దరూ విశ్వంలో ఉన్నారు. ఈ రెండూ కలిస్తేనే సృష్టి వర్ధిల్లుతుందని దేవతలకు తెలుసు. దీనివల్ల మనువు, శత‌రూప‌ ఒక్కటయ్యారు. దీంతో మను, శత‌రూప‌ దంపతులకు ఐదుగురు పిల్లలు పుట్టారు. ఈ ఐదుగురు పిల్లలలో ప్రియవత, ఉత్తానపాద అనే ఇద్దరు కుమారులు, ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.           


4. మనువు మనుమలు


దేవహూతి, మనువు కుమార్తె, ప్రజాపతి కర్దముని వివాహం చేసుకుంది. ఆమె తొమ్మిది మంది కుమార్తెలకు, ఒక కుమారుడు కపిలకు జన్మనిచ్చింది. ప్రసూతి ఖిమా, అనసూయతో సహా అనేకమంది కుమార్తెలకు జన్మనిచ్చింది. ఆకూటికి యజ్ఞ అనే కుమారుడు, కుమార్తె జన్మించారు. దేవహూతి, ఆకూతి కుమారులైన కపిల, యజ్ఞ ఇద్దరూ విష్ణువు అవతారాలు. స్వయంభువ మనువు తన భార్య శతరూపతో కలిసి సునంద నది ఒడ్డున తపస్సు చేయడానికి అడవికి వెళ్లాడు.  


Also Read : ఇంట్లో వీటిని ఖాళీగా ఉంచితే దురదృష్టం వెంట‌పడుతుందా!


ఈ విధంగా స్వయంభువ‌ మనువు నుంచి విశ్వంలో మానవ జాతులు ఏర్ప‌డ్డాయి. అనంత‌రం వాటి పెరుగుదలకు దారితీసింది. మనువునే మనం విశ్వంలో మొదటి మానవుడు అని పిలుస్తాము.     


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.