Christmas and New Year 2023 Wishes: ‘క్రిస్మస్’ వస్తుందంటే చాలు..దాదాపు నెల రోజుల నుంచి సందడి మొదలవుతుంది. నూతన సంవత్సరం (New Year) కూడా అక్కడకు వారం రోజులే ఉండడంతో..క్రిస్మస్ నుంచి న్యూ ఇయర్ వరకూ పండుగ వాతావరణం కొనసాగుతూనే ఉంటుంది. కుల, మతాలకు అతీతంగా అందరూ క్రిస్మస్ వేడుకల్లో భాగమవుతారు. ఈ సందర్భంగా మీ స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులకు ఈ కోట్స్ తో క్రిస్మస్ తో పాటూ న్యూ ఇయర్ శుభాకాంక్షలు కూడా చెప్పేయండి...
1. హృదయ శుద్ధిగలవారు ధన్యులు
మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
2. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు
కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము
మీకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు
3. నీతి మార్గమున జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు
మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు
4. యెహోవా పడిపోవువారినందరిని ఉద్ధరించువాడు
కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు
మీకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు
Also Read: క్రిస్మస్ ట్రీ అలంకరణలలో ఈ నాలుగు రంగులే ప్రత్యేకం, ఎందుకంటే!
5. నన్ను ప్రేమించువారిని నేను ప్రేమించుచున్నాను
నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు
క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు
6. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును
తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును
మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
7. ఈ క్రిస్మస్ మీ జీవితంలో చీకట్లు తొలగించి
వెలుగువైపు పయనించేలా చేయాలని ఆకాంక్షిస్తూ
క్రిస్మస్ శుభాకాంక్షలు
8. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము
అది అంతరంగములన్నియు శోధించును
మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
9. యేసయ్య నీతో ఉన్నాడు నీవు సుఖముగా నిద్రించుము
మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు
Also Read: భారతదేశంలో ప్రధానమైన, పురాతనమైన, అందమైన చర్చిలు ఇవే!
10. కోప్పడండి కానీ పాపం చేయకండి
సూర్యుడు అస్తమించేలోగా మీకోపం మాయమవ్వాలి
మీకు మీ కుటుంబసభ్యులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు
11. నీతిమంతుల కొరకు వెలుగు
యదార్థ హృదయం కొరకు ఆనందం విత్తబడి ఉన్నాయి
మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు
12. నీ ప్రతిరోజుని ప్రార్థనతో ప్రారంభించు
నీ ప్రతి రోజుని ప్రార్థనతో ముగించు
నీ ప్రతి సమస్యను ప్రార్థనతో జయించు
మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు
13. వేలకొలది బంగారు, వెండి నాణముల కన్నా
నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు యెహోవా
మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు
14. క్రీస్తు జన్మించిన ఈ శుభదినం మీ అందరికీ
శాంతి, సౌభాగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ..
క్రిస్మస్ శుభాకాంక్షలు
15. ఈ క్రిస్మస్ మీ జీవితాలలో కొత్త కాంతులు నింపాలని కోరుకుంటూ…
మీకు మీ కుటంబ సభ్యులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు
16. కరుణామయుడు జన్మించిన ఈరోజు..మీ ఇంట్లో కోటి కాంతుల చిరునవ్వులు వెల్లివిరియాలి
మీకు మీ కుటంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
17. ఈ క్రిస్మస్ మీ జీవితంలో సంతోషాన్ని నింపాలని కోరుకుంటూ
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
18. ఏసు జన్మించిన ఈ పవిత్ర దినం..మీ జీవితానికి కావాలి పర్వదినం
మీకు మీ కుటంబ సభ్యులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు
19. అందరూ ఆ దేవుడి బిడ్డలే..ప్రపంచ శాంతికోసం అంతా కలసి ఉండాలి
క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు
20. క్రీస్తు కృప, కరుణ మీపై ఉండాలని కోరుకుంటూ
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్, న్యూ ఇయర్ శుభాకాంక్షలు
21. ఈ క్రిస్మస్ వేళ మీ ఇంట ఆనందం శాశ్వతంగా కొలువుండాలని ఆశిస్తూ
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు.
22. పాత సంవత్సానికి గుడ్ చెప్పేవేళ
ఈ క్రిస్మస్ మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ
మీకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు
23. కోటి దీపకాంతులు మీ చిరునవ్వులుగా మారాలని కోరుతూ
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్-నూతన సంవత్సర శుభాకాంక్షలు