Merry Christmas 2024 Wishes In Telugu : ఏసుక్రీస్తు జన్మదినం అయిన డిసెంబరు 25న క్రిస్మస్ పర్వదినంగా జరుపుకుంటారు. ప్రపంచమంతా ఘనంగా జరుపుకునే అతి పెద్ద పండుగ క్రిస్మస్. దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ జ్ఞానాన్ని పంచే బాలక్రీస్తు ప్రబోధలు వింటూ అతా ఆశ్చర్యపోయేవారు.
పాపాన్ని త్యజించి మనసా, వాచా, కర్మణా పరిశుద్ధ జీవితం కొనసాగించాలని అప్పుడే పరలోక ప్రాప్తి కలుగుతుందని మానవాళికి క్రీస్తు ప్రబోధించాడు.
ఎన్ని పాప కార్యాలు చేసినా వాటిని గ్రహించి పశ్చాత్తాప పడినప్పుడే ఏసుక్రీస్తు క్షమిస్తాడు. అదే క్రైస్తవ విశ్వాసానికి కేంద్రబిందువని బోధించాడు.
హృదయకవాటం వద్ద ప్రభువు ఉన్నాడు..చెడును విడిచినప్పుడు మాత్రమే దైవ సాక్షాత్కారం దక్కుతుందని బోధించాడు
Also Read: 2024 డిసెంబర్ 23 to 29 ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల వారఫలాలు!
క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి...
నీ ప్రతిరోజుని ప్రార్థనతో ప్రారంభించు
నీ ప్రతి రోజుని ప్రార్థనతో ముగించు
నీ ప్రతి సమస్యను ప్రార్థనతో జయించు
క్రిస్మస్ శుభాకాంక్షలు
అందరికి తండ్రయైన దేవుడు ఒక్కడే
ఆయన అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
నన్ను బలపరుచువానియందే
నేను సమస్తమును చేయగలను
మీకు, మీ కుటుంబ సభ్యులకు మెర్రీ క్రిస్మస్
మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక
ఇతరుల కార్యములను కూడ చూడవలెను
మీకు, మీ కుటుంబ సభ్యులకు మెర్రీ క్రిస్మస్
ఈ క్రిస్మస్ మీ జీవితంలో చీకట్లు తొలగించి
వెలుగువైపు పయనించేలా చేయాలని ఆకాంక్షిస్తూ
క్రిస్మస్ శుభాకాంక్షలు
అందరూ ఆ దేవుడి బిడ్డలే..
ప్రపంచ శాంతికోసం అంతా కలసి ఉండాలి
క్రిస్మస్ శుభాకాంక్షలు
Also Read: కర్కాటక రాశి వార్షిక ఫలితాలు 2025 - శని నుంచి విముక్తి , ఆర్థిక వృద్ధి, మానసిక ఆనందం ఉంటుంది కానీ..!
నీవు నడుచు మార్గమంతటిలో
నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును
క్రిస్మస్ శుభాకాంక్షలు
యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును
క్రిస్మస్ శుభాకాంక్షలు
సోమరిపోతు లేమిని అనుభవించును
కష్టించి పనిచేయు వాడు సంపదలు బడయును
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను
ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి
మీకు, మీ కుటుంబ సభ్యులకు మెర్రీ క్రిస్మస్
ఏసు జన్మించిన ఈ పవిత్ర దినం..మీ జీవితానికి కావాలి పర్వదినం
మీకు మీ కుటంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము
యెహోవా మహిమ నీ మీద ఉదయించెను
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
ఈ క్రిస్మస్ సందర్భంగా మీఇంట ఆనందం శాశ్వతంగా కొలువుండాలి
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు.
నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము
అది అంతరంగములన్నియు శోధించును
మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
నీవైతే ధర్మము చేయునప్పుడు, నీ ధర్మము రహస్యముగానుండు నిమిత్తము
నీ కుడిచెయ్యి చేయునది నీ యెడమచేతికి తెలియక యుండవలెను
మీకు, మీ కుటుంబ సభ్యులకు మెర్రీ క్రిస్మస్
Also Read: 2025 మొత్తం మేషరాశివారిపై శని ప్రభావం.. ఇబ్బందులతో సావాసం!
క్రీస్తు కృప, కరుణ మీపై ఉండాలని కోరుకుంటూ
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్, న్యూ ఇయర్ శుభాకాంక్షలు
కోటి దీపకాంతులు మీ చిరునవ్వులుగా మారాలని కోరుతూ
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా..!
నా యొద్దకు రండి.. నేను మీకు విశ్రాంతి కలుగజేతును
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
ఈ క్రిస్మస్ మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ
మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు
నీతిమంతుల కొరకు వెలుగు
యదార్థ హృదయం కొరకు ఆనందం విత్తబడి ఉన్నాయి
మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు
యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము
మీకు, మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు
యేసయ్య నీతో ఉన్నాడు నీవు సుఖముగా నిద్రించుము
మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు
ఏసు సందేశం!
ప్రతి మనిషి వినయం, స్వచ్ఛత, శాంతి, ప్రేమ, సద్భావన, క్షమాపణతో ఉండాలి. తాము సంపాదించిన దాంట్లో కొంత భాగం పేదలకు పంచాలి..అప్పుడు లభించే సంతోషం వెలకట్టలేనిదిగా ఉంటుంది.
Also Read: వృషభ రాశి వార్షిక ఫలితాలు 2025 - ఒక్క నెల మినహా ఏడాది మొత్తం వృషభ రాశివారికి అద్భుతంగా ఉంటుంది