2022 జూన్ నెలలో పండుగలు
జూన్ 2 రంభావ్రతం
జూన్ 7 శుక్లాదేవి పూజ
జూన్ 8 మృగశిర కార్తె ప్రారంభం
జూన్ 9 దశపాపహర దశమి, రామేశ్వర ప్రతిష్ట
జూన్ 10 నిర్జల ఏకాదశి
జూన్ 11 రామలక్ష్మణ ద్వాదశి
జూన్ 14 ఏరువాక పూర్ణిమ, వృషభ పూజ
జూన్ 15 మిథున సంక్రాంతి
జూన్ 17 సంకటహర చతుర్థి
జూన్ 22 ఆరుద్ర కార్తె ప్రారంభం
జూన్ 24 మతత్రయ ఏకాదశి
జూన్ 25 కూర్మ జయంతి
జూన్ 27 మాసశివరాత్రి
జూన్ 28 వటసావిత్రి వ్రతం
జూన్ 30 చంద్రదర్శనం
Also Read: జూన్ 10న నిర్జల ఏకాదశి, ఈ నియమాలు పాటిస్తే ఆర్థిక, అనారోగ్య సమస్యలుండవ్
రంభావ్రతం
ఈ నెలలో రంభ తృతీయ జూన్ రెండో తేదీన గురువారం వచ్చింది. ఈ పవిత్రమైన రోజున వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయువు మరియు పిల్లల శ్రేయస్సు కోసం అరటిచెట్టుకి పూజ చేస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఏటా జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్షంలోని తృతీయ తిథి రోజున ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.
గంగా దసరా
హిందూ పంచాంగం ప్రకారం దశపాపహర దశమిని జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్షంలోని పదో రోజున జరుపుకుంటారు. ఈరోజున గంగా మాతను పూజించడం, గంగాస్నానం చేయడం ఉత్తమం అంటారు. ఈ ఏడాది దశపాపహర దశమి జూన్ 9న వచ్చింది. ఇదే రోజు రామేశ్వర ప్రతిష్ట కూడా.
నిర్జల ఏకాదశి
ఈ పర్వదినం రోజు చుక్క నీరు కూడా తీసుకోకుండా ఉపవాసం ఉంటారు. అందుకే నిర్జల ఏకాదశి అంటారు. నిర్జల ఏకాదశి ఈ ఏడాది జూన్ 10 శుక్రవారం వచ్చింది. ఈ రోజు ఉపవాసం చేయాలి, నేలపైనే నిద్రించాలి, మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి పూజచేయాలి. అష్టాక్షరి మంత్రం "ఓం నమో భగవతే వాసుదేవాయ" అని జపించాలి. అనంతరం ఏకాదశికి సంబంధించిన కథ చెప్పుకుని హారతివ్వాలి. అతిథులను పిలిచి భోజనం పెట్టడం, బ్రాహ్మణుడికి స్వయంపాకం ఇవ్వడం, చలివేంద్రాలు ఏర్పాటు చేయడం సహా దాన ధర్మాలకు ఇదే సరైన రోజు అని పండితులు చెబుతారు.
వట సావిత్రి వ్రతం..
మన దేశంలోని చాలా ప్రాంతాల్లో జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్షంలో పౌర్ణమి రోజున వటసావిత్రి వ్రతం ఆచరిస్తారు. ఈరోజున వివాహిత స్త్రీలు రోజంతా ఉపవాసం ఉండి, తమ భర్త దీర్ఘాయువు పొందేందుకు రావి చెట్టును పూజిస్తారు. జూన్ 28న వటసావిత్రి వ్రతం ఆచరించనున్నారు. లక్ష్మీ నారాయణులుగా లేదా శివ పార్వతులుగా భావించి ఐదు పోగుల దారాలను చుట్టూ తిరుగుతూ చుట్టి, పసుపు గౌరమ్మకు పూజ చేయాలి. ఈ వ్రతం మరో ప్రత్యేకత ఏమిటి అంటే ఈ కారణం వల్ల అయినా సరే భార్య ఈ వ్రతాన్ని ఆచరించలేని అనారోగ్య స్థితిలో ఉంటే సంకల్పం చేసి ఆమెను కర్తగా పెట్టి భర్త అయినా సరే ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు.
మాస శివరాత్రి..
ప్రతి నెలా కృష్ణపక్షం చతుర్దశి తిథిని మాస శివరాత్రి జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున పరమేశ్వరుడికి ప్రత్యేక ప్రజలు చేస్తారు. జూన్ నెలలో 27న మాస శివరాత్రి వచ్చింది.
Also Read: జూన్ నెలలో ఈ ఆరు రాశులవారికి గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు
Also Read: ఆరోగ్యం, ఆనందం, ఆదాయం-జూన్ నెలలో ఈ రాశులవారికి అద్భుతంగా ఉంది