కురుక్షేత్రం ముగిసిన తర్వాత పాండవులు 36 ఏళ్ల పాటు ఇంద్రప్రస్థను పరిపాలించారు. కృష్ణుడు అవతారం చాలించిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించిన అనంతరం.. జీవిత చరమాంకంలో సన్యాసాన్ని స్వీకరించాలని భావిస్తారు. ధర్మరాజు తన సోదరులైన భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు భార్య ద్రౌపదితో కలిసి హిమాలయాలకు పయనమయ్యాడు. ఇక్కడే ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. హిమాలయాలకు బయలుదేరిన పాండవులను ఓ కుక్క అనుసరిస్తూ నడవసాగింది. స్వర్గం వైపు నడుస్తూ వెళుతుండగా మార్గ మధ్యలో భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది ఒకరి తర్వాత ఒకరు అలసటతో కుప్పకూలిపోయారు. కిందపడిన వారిని వెనుతిరిగి చూడకుండా ధర్మరాజు ముందుకు సాగాడు. కుక్క మాత్రం అనుసరిస్తూ సాగింది.  


Also Read:  స్వర్గానికి షార్ట్ కట్! ధర్మరాజు తమ్ముళ్లు కుక్కతో కలసి వెళ్లిన రూట్ మ్యాప్ క్లియర్‌గా ఉందిగా!
భూమ్మీద నుంచి స్వర్గానికి చివరిగా చేరుకునే ప్రదేశం హిమాలయాల్లో ఉన్న సత్యపంథ్ అనే సరోవరం. దీనిని "సత్యపంథ" అని పిలుస్తారు. ఈ సరోవరాన్ని సత్యానికి ప్రతిబింబంగా చెబుతారు. ఈ త్రికోణాకార సరోవరం ఎంత పవిత్రమైనది అంటే ఏకాదశి సమయంలో స్వయంగా త్రిమూర్తులు స్నానం చేస్తారట. గంధర్వులు పక్షుల రూపంలో ఈ స్థలంలో కాపలాకాస్తుంటారని అంటారు. ధర్మరాజు , కుక్క ఈ ప్రదేశానికి చేరుకునే సరికి  ఇంద్రుడు రథంతో సహా వచ్చి ధర్మరాజుని మాత్రం రథంలో ఆహ్వానిస్తాడు. ధర్మరాజు గొప్ప నీతిఙ్ఞుడు కావడం వల్ల మానవుడైనా దేవతల రథంపై కూర్చునే అర్హత సంపాదించాడు. అయితే తనతో పాటూ బయలుదేరి మార్గమధ్యలో పడిపోయిన తమ్ముళ్లు, భార్యని ప్రస్తావించని ధర్మరాజు.... ఇక్కడి వరకూ కష్టనష్టాలను ఓర్చి ప్రయాణం చేసిన కుక్కను  ఒంటరిగా వదిలేసి మీతో స్వర్గానికి రాలేనంటాడు. 


Also Read: కృష్ణుడు 36 ఏళ్లలో చనిపోవాలనే గాంధారీ శాపం నెరవేరిందా? కురుక్షేత్రంలో ఏం జరిగింది?
ఆ మాట విన్న వెంటనే కుక్కరూపంలో ఉన్న యమధర్మరాజు నిజరూపంలోకి వచ్చి తనయుడు ( కుంతికి యమధర్మరాజు అంశతో జన్మించాడు) ధర్మరాజని చూసి ఆనందిస్తాడు. నీవు చాలా నీతిపరుడవు... అన్ని ప్రాణులపై  అసాధారణ దయ చూపుతావని మరోసారి నిరూపించుకున్నావు. అందుకే  నీ సోదరుల కంటే ఈ కుక్కనే ప్రియమైనదిగా భావించి నీతోపాటూ స్వర్గానికి తీసుకెళుతున్నావని అంటాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా నీ నీతివంతమైన ప్రవర్తనలో మార్పులేదని నిరూపించడం వల్లే ఎలాంటి అలసట లేకుండా శిఖరం పైకి చేరుకున్నావంటాడు. ధర్మరాజు జీవితంలో ఒకేఒక అబద్ధం చెప్పినందున నరక ద్వారాన్ని చూపించి స్వర్గంలోకి తీసుకెళతారు. మిగిలిన వారు చేసిన పాపాలకు తగిన శిక్షలు అనుభవించిన తర్వాత స్వర్గానికి చేరుకుంటారు. 


ధర్మరాజు చెప్పిన ఒకేఒక అబద్ధం ఏంటి, ఏ సందర్భంలో , ఎందుకలా చెప్పాడనేది రేపటి కథనంలో...


Also Read:  పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే.. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి