Lingastakam Lyrics and Meaning
మహాశివరాత్రి రోజు లింగాష్టకం పఠిస్తే శివానుగ్రహం కలుగుతుందని భక్తుల విశ్వాసం. నిరాకారుడిగా లింగరూపంలో కొలువైన భోళాశంకరుడికి అత్యంత ప్రియమైన లింగాష్టకం అర్థం ఇదిగో...
బ్రహ్మ మురారి సురార్చిత లింగం -బ్రహ్మ , విష్ణు , దేవతలతో పూజలందుకున్న లింగం
నిర్మల భాషిత శోభిత లింగం - నిర్మలమైన మాటలతో అలంకరించిన లింగం
జన్మజ దుఃఖ వినాశక లింగం - జన్మ వల్ల పుట్టిన బాధలను నాశనం చేసే లింగం
తత్ ప్రణమామి సదా శివ లింగం - సదా శివ లింగమా నీకు నమస్కారం !
దేవముని ప్రవరార్చిత లింగం -దేవమునులు , మహా ఋషులు పూజించిన లింగం
కామదహన కరుణాకర లింగం - మన్మధుడిని దహనం చేసిన , అపారమైన కరుణను చూపే శివలింగం
రావణ దర్ప వినాశక లింగం - రావణుడి గర్వాన్ని నాశనం చేసిన శివ లింగం
తత్ ప్రణమామి సద శివ లింగం - సదా శివ లింగమా నీకు నమస్కారం !
సర్వ సుగంధ సులేపిత లింగం - మంచి గంధాలు లేపనాలుగా పూసిన లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగం - మనుషుల బుద్ధి వికాసానికి కారణ మైన శివ లింగం
సిద్ధ సురాసుర వందిత లింగం - సిద్ధులు , దేవతలు , రాక్షసులు కీర్తించిన లింగం
తత్ ప్రణమామి సదా శివ లింగం -సదా శివ లింగమా నీకు నమస్కారం !
కనక మహామణి భూషిత లింగం - బంగారం , మహా మణులతో అలంకరించిన శివ లింగం
ఫణిపతి వేష్టిత శోభిత లింగం - నాగుపాముని అలంకారంగా చేసుకున్న శివలింగం
దక్ష సుయజ్ఞ వినాశక లింగం - దక్షుడు చేసిన మంచి యజ్ఞాన్ని నాశనం చేసిన శివ లింగం
తత్ ప్రణమామి సదా శివ లింగం - సదా శివ లింగమా నీకు నమస్కారం !
కుంకుమ చందన లేపిత లింగం - కుంకుమ , గంధం పూసిన శివ లింగం
పంకజ హార సుశోభిత లింగం - కలువ దండలతో అలంకరించిన లింగం
సంచిత పాప వినాశక లింగం - సంక్రమించిన పాపాలని నాశనం చేసే శివ లింగం
తత్ ప్రణమామి సదా శివ లింగం -సదా శివ లింగమా నీకు నమస్కారం !
దేవగణార్చిత సేవిత లింగం - దేవ గణాలతో పూజలందుకున్న శివలింగం
భావైర్ భక్తీ భిరేవచ లింగం - చక్కటి భావంతో కూడిన భక్తితో పూజలందుకున్నశివ లింగం
దినకర కోటి ప్రభాకర లింగం - కోటి సూర్యుల కాంతితో వెలిగే మరో సూర్య బింబం లాంటి లింగం
తత్ ప్రణమామి సదా శివ లింగం - సదా శివ లింగమా నీకు నమస్కారం !
అష్ట దలోపరి వేష్టిత లింగం -ఎనిమిది రకాల ఆకుల మీద నివాసముండే శివ లింగం
సర్వ సముద్భవ కారణ లింగం -అన్నీ సమానంగా జన్మించడానికి కారణమైన శివ లింగం
అష్ట దరిద్ర వినాశక లింగం - ఎనిమిది రకాల దరిద్రాలను నాశనం చేసే శివ లింగం
తత్ ప్రణమామి సదా శివ లింగం - సదా శివ లింగమా నీకు నమస్కారం !
సురగురు సురవర పూజిత లింగం - దేవ గురువు (బృహస్పతి), దేవతలతో పూజలందుకున్న శివ లింగం
సురవన పుష్ప సదార్చిత లింగం - నిత్యం పారిజాతాలతో పూజలందుకున్న శివలింగం
పరమపదం పరమాత్మక లింగం - ఓ శివ లింగమా, నీ సన్నిధి ఏ ఒక స్వర్గము
తత్ ప్రణమామి సదా శివ లింగం -సదా శివ లింగమా నీకు నమస్కారం !
లింగాష్టక మిదం పుణ్యం యః పట్టేత్ శివ సన్నిధౌ
శివ లోక మవాప్నోతి శివేన సహమోదతే
(ఎప్పుడైతే శివుడి సన్నిధిలో లింగాష్టకం చదువుతారో వారికి శివుడిలో ఐక్యం అయ్యేందుకు మార్గం దొరుకుతుంది)
Also Read: మహా శివరాత్రి పూజ , అభిషేకం ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఉపవాస నియమాలు - మరెన్నో వివరాలు సమగ్రంగా
శివుడు గంగాధరుడు, అభిషేక ప్రియుడు. శివుడి మూర్తి, చిహ్నం లేనప్పుడు మట్టితో లింగాన్ని చేసుకుని అయినా పూజించవచ్చు. శివార్చనకు మంత్రాలు రాకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు . శివనామం ఒక్కటే చాలు. ఓ నమః శివాయ అనే పంచాక్షరాలు పలుకుతూ ధ్యానించవచ్చు. పంచామృతాలు లేకపోయినా ఆవుపాలు, నీళ్లతో అభిషేకం చేసినా చాలు...
Also Read: పాలు, నీళ్లు, పంచామృతాలు - శివుడికే అభిషేకం ఎందుకు చేస్తారు!
Also Read: అవమానించి ఆనందించారు కానీ ఆ తర్వాత ఆమె ఇవ్వబోయే రిటర్న్ గిఫ్ట్ ఊహించలేకపోయారు!