గ్రహణం సంభవించినప్పుడు ఆలయాలను మూసివేస్తారు...ఈ సమయంలో అతి నీల లోహిత కిరణాలు నేరుగా భూమిపై పడతాయని, వాటి ప్రభావం వల్ల మనకు కీడు జరుగుతుందని నమ్ముతారు. గ్రహణ సమయంలో ఆలయాల్లో ములవిరాట్ శక్తిని కోల్పోతుందని.. ప్రతికూల శక్తులు ప్రవేశించే అవకాశం ఉందని చెబుతారు. అందుకే గ్రహణ సమయంలో ఆలయాలను మూసివేస్తారని చెబుతారు.
అయితే ఇందులో నిజమెంత? నిజంగానే గ్రహణం సమయంలో మూలవిరాట్ శక్తి కోల్పోతుందా?
ఆలయాల్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయా?
శాస్త్రీయ దృక్కోణం ఏంటి?
సంప్రదాయం ఏమంటోంది?
ఆధ్యాత్మిక కోణంలో ఎలా చూడాలి?
హిందూ సంప్రదాయంలో, గ్రహణ సమయంలో ఆలయాల్లోని విగ్రహాలు శక్తిని కోల్పోతాయనే నమ్మకం కొన్ని వర్గాలలో ఉంది...అయితే ఇది అందరూ ఆమోదించే సిద్ధాంతం కాదు. ఈ నమ్మకం వెనుక కొన్ని కారణాలు , వివరణలు ఉన్నాయి
శాస్త్రీయ దృక్కోణం
గ్రహణం (సూర్య గ్రహణం లేదా చంద్ర గ్రహణం) అనేది ఖగోళ ఘటన...ఇది సూర్యుడు, చంద్రుడు , భూమి స్థానాల వల్ల సంభవిస్తుంది. శాస్త్రీయంగా చెప్పాలంటే గ్రహణం ప్రభావం విగ్రహాలపై ఉండదు. ఎందుకంటే విగ్రహాలు భౌతిక వస్తువులు... వాటి శక్తి అనేది ఆధ్యాత్మిక లేదా సాంప్రదాయ నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది.
సాంప్రదాయ నమ్మకాలం ప్రకారం
స్థానిక సంప్రదాయాల ప్రకారం గ్రహణ సమయంలో రాహువు లేదా కేతువు ప్రభావం వల్ల ప్రతికూల శక్తులు విజృంభిస్తాయని భావిస్తారు. అందుకే ఈ సమయంలో ఆలయాలను మూసివేయడం, పూజలు ఆపేయడం, దేవతా విగ్రహాలను కప్పి ఉంచడం వంటి ఆచారాలు కొన్ని ప్రాంతాల్లో అనుసరిస్తారు. అయితే గ్రహణ సమయంలో విగ్రహాలు శక్తిని కోల్పోతాయని చెప్పే కన్నా ప్రతికూల శక్తుల నుంచి వాటిని రక్షించడానికి జరిగే ఆచారంగా భావించవచ్చు.
ఆధ్యాత్మిక దృక్కోణం
విగ్రహాల్లో శక్తి అనేది భక్తుల విశ్వాసం మాత్రమే... పవిత్రత , ప్రతిష్ఠాపన ద్వారా ఈ శక్తి వస్తుందని హిందూ ధర్మ చెబుతోంది. కొందరు పండితుల అభిప్రాయం ప్రకారం ఈ శక్తి గ్రహణం లాంటి ఖగోళ సంఘటనల వల్ల ఎలాంటి ప్రభావితం కాదు. ఇది దైవికమైనది , శాశ్వతమైనది.
స్థానిక ఆచారాలు
కొన్ని ఆలయాల్లో గ్రహణం తర్వాత విగ్రహాలను శుద్ధి చేయడం లేదా పునఃప్రతిష్ఠ లాంటి ఆచారాలు జరుపుతారు. అంటే ఇది శక్తినికోల్పోవడం, తిరిగి పునరుద్ధరించడం కాదు.. ఇలాంటి ఆచారాలు పాటించడం , శుద్ధి చర్యలు పాటించడం ద్వారా ఆధ్యాత్మిక వాతావరణాన్ని రక్షించడం, భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించడమే..
విగ్రహాలు శక్తిని కోల్పోతాయా లేదా అనేది పూర్తిగా స్థానిక నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. వీటిని నిరూపించేందుకు శాస్త్రీయ ఆధారాలు లేవు. గ్రహణ సమయంలో ఆలయాలను మూసివేసి శుద్ధి చేసి తెరుస్తారంటే వాటి శక్తి కోల్పోతాయని కాదు. ఇదో ఆచారం మాత్రమే... భగవంతుడు, భగవంతుడి శక్తి శాశ్వతం అనేది చాలామంది భక్తుల నమ్మకం
సంపూర్ణ చంద్ర గ్రహణం! గ్రహణం సమయం, సూతకాలం, ఏ రాశివారు గ్రహణం చూడకూడదు? పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
చంద్రగ్రహణం ప్రభావం మీ రాశిపై ఎలా ఉంటుంది? పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు.