Lunar Eclipse 2023: శరద్ పూర్ణిమ నాడు గంగానదిలో స్నానం చేయడం, విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల భక్తుల కోరికలన్నీ తీరుతాయని మతపరమైన నమ్మకం. అయితే ఈ ఏడాది శరద్ పూర్ణిమ నాడు చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ సమయంలో, ధార్మిక కార్యక్రమాలు, శుభ కార్యాలు నిషేధించారు. చంద్రగ్రహణం సమయంలో ఏమి చేయాలో, ఏమి నివారించాలో తెలుసుకుందాం.
గర్భిణులు ఇలా చేయాలి
గర్భిణులు చంద్రగ్రహణం సమయంలో శ్రీఫలాన్ని తమతో ఉంచుకోవాలి. గ్రహణం ముగిసిన తర్వాత ఈ శ్రీఫలాన్ని(కొబ్బరికాయ) ప్రవహించే నీటిలో వదలాలి. ఈసారి అర్ధరాత్రి చంద్రగ్రహణం ఏర్పడే అవకాశం ఉన్నందున రాత్రి పూట శ్రీఫలాన్ని నీటిలో పడేయడం కుదరకపోవచ్చు. అందుకే ఈ పనిని ఉదయం స్నానమాచరించిన తర్వాత చేయండి.
Also Read : అక్టోబరు 28 చంద్రగ్రహణం - మీ రాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసా!
గర్భిణులు ఈ జాగ్రత్తలు పాటించాలి
గర్భిణులు గ్రహణ సమయంలో పొట్టపై ఎర్రటి మట్టి లేదా పసుపు రాసుకోవాలి. దీని వల్ల కడుపులో పెరుగుతున్న శిశువుపై గ్రహణం ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు.
గ్రహణ సమయంలో ఈ మంత్రాలు పఠించండి
గ్రహణం సమయంలో, విశ్వం రక్షకుడైన విష్ణువు లేదా దేవతలకే దేవుడైన మహాదేవుని మంత్రాలను జపించండి. మీరు శ్రీమహావిష్ణువు, పరమశివుడి బీజ మంత్రాలను జపించవచ్చు. వీటితో పాటు గాయత్రీ, మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించడం వల్ల శుభ ఫలితాలను లేదా శుభ ప్రభావాన్ని కలిగిస్తుంది.
ఈ ఆహారాన్ని తినవద్దు
గ్రహణ సమయంలో వంట చేయడం, ఆరగించడం రెండూ నిషేధించారు. గ్రహణ కాలంలో ఈ తప్పులు చేయకండి. గ్రహణం ప్రారంభమవడానికి ముందు ఈ రోజు చేసిన వంటను ఖాళీ చేయండి. గ్రహణం ముగిసిన తరువాత, శుభ్రంగా స్నానమాచరించి ఆహారాన్ని సిద్ధం చేసి తినండి.
పూజ చేయవద్దు
గ్రహణ సమయంలో పూజ చేయవద్దు. కానీ, మీరు భగవన్నామాన్ని, ఇష్టదేవతా మంత్రాలను జపించవచ్చు. ఈ రోజున మీరు దేవుని గది తలుపును మూసివేయాలని గుర్తుంచుకోండి. గ్రహణ సమయంలో వీలైనన్ని సార్లు భగవంతుడిని ధ్యానించండి. భగవంతుని స్మరణలో మనస్సును, శరీరాన్ని కేంద్రీకరించండి.
Also Read : అక్టోబరు 28న చంద్రగ్రహణం టైమింగ్స్ - ఏ రాశులవారు చూడకూడదంటే!
ఈ తప్పులు చేయకండి
గ్రహణ సమయంలో, గర్భిణులు ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదు లేదా పదునైన వస్తువులను ఉపయోగించకూడదు. అయితే, పిల్లలు, వృద్ధులు, రోగులు, గర్భిణులు ఈ సమయంలో విశ్రాంతి తీసుకోవచ్చు. దీనితో పాటు గ్రహణ సూతక సమయంలో శుభ కార్యాలు చేయకూడదు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.