శ్రావణ మాసం చాలా పవిత్రమైన మాసం. శ్రావణం శివుడికి చాలా ప్రీతిపాత్రమైనది కూడా. ఈ నెలలో  భక్తిశ్రద్ధలతో శివారాధన చేసేవారి అన్ని కోరికలు ఫలిస్తాయని నమ్మకం. శ్రావణ సోమవారాలు పగలు ఉపవాసం ఉండి ప్రదోశ వేళ సాయంత్రం స్వామి వారికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేస్తే విశేష ఫలితాలు ఉంటాయని నమ్మకం. శ్రావణంలో చేసే చిన్న పూజ కూడా పెద్ద ఫలితాలను ఇస్తుందని శాస్త్రం చెబుతోంది. శ్రావణం శివారాధన చేసే వారికి చాలా విశిష్టమైనది.


నిజానికి సనాతన ధర్మంలో శివారధనకు చాలా ప్రత్యేక స్థానం ఉంది. ఏ రూపంలో ఉన్నా ఆ పరమశివుడు కరుణాసముద్రుడుగా, భోళా శంకరుడిగా పేరు గాంచాడు. మహోగ్రంగా కనిపించే రుద్రరూపం కూడా చాలా ప్రత్యేకమైందే.


శివుడు ఎప్పుడు ఉగ్రరూపం దాల్చిన కచ్చితంగా తాండవ నృత్యం చేస్తాడు. శివతాండవం గురించి శివపురాణంలో విశేషంగా ప్రస్తావించారు. ఒకసారి శివుడు తన తాండవంతో పూర్తి బ్రహ్మాండాన్ని విచలితం చేశాడు. భువనభోంతరాలను కదిలించేంత కోపం అత్యంత ప్రసన్నుడైన శంకరుడికి ఎందుకు వచ్చింది. అప్పుడు ఏం జరిగింది తెలుసుకుందాం.


విశ్వాన్ని విచలితం చేసిన శివతాండవం


శివుడు తాండవం చేస్తున్నపుడు ఆయన కళ్లు కోపంతో ఎర్ర గా మారిపోతాయి. పూర్తి విశ్వం ఒక్కసారిగా భయకంపితమవుతుంది. సతీదేవి తన తండ్రి నిర్వహించిన యాగానికి వెళ్లినపుడు శివుడు అక్కడ తాండవం చేశాడు. ఆ యాగ క్షేత్రంలో ఆమె తండ్రి శివుడిని అవమాన పడచడాన్ని తట్టకోలేక యాగాగ్నిలో తనను తాను దహించి వేసుకుంది. సతీదేవి చేసిన ఆత్మాహుతి గురించి తెలుసుకున్న శివుడు కొపంతో ఊగిపోయాడు. తన గణాల్లో ఒకడైన వీరభద్రుడిని పంపి దక్షరాజు తల నరికించాడు. తర్వాత ఆత్మహుతి చేసుకున్న సతీ దేవిని తన ఒడిలోకి తీసుకుని అంతులేని కోపంతో తాండవం చెయ్యడం ప్రారంభించాడు. శివుడి ఉగ్రరూపాన్ని చూసి దేవతలు, రాక్షసులు, విశ్వమంతా భయకంపితమైపోయింది.


అంతా భయంగా బ్రహ్మదేవుడిని శరుణు వేడుకున్నాడు. ఆయన అందరినీ విష్ణువును వేడుకోమ్మని సలహా చెప్పాడు. శివుడు రుద్రావతారంలో ఉన్నపుడు ఎదురుగా వెళ్లడం మంచిది కాదని అందరికీ హితవు చెప్పాడు. సతీదేవి మృతదేహం ఆయన ఒడిలో ఉన్నంతకాలం ఆయన శాంతించడం జరగదని తన సుదర్శన చక్రంతో సతీదేవి మృతదేశాన్ని కింద పడేశాడు. అలా అమ్మవారి శరీరంలోని భాగాలు తెగి భూమిమీద పడిపోయాయి. అలా పడిన ప్రతిచోటా ఒక శక్తిపీఠం వెలసిందని చెబుతారు. మొత్తం శరీరం కిందపడిపోవడం వల్ల మహాదేవుని కోపం తగ్గిందట.


Also read : ఫినిక్స్ బర్డ్ నిజంగానే ఉందా? ఆ పక్షి బొమ్మను ఇంట్లో పెట్టుకుంటే వాస్తు దోషం పోతుందా?


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.



Join Us on Telegram: https://t.me/abpdesamofficial