Viral News: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ2025లో భాగంగా బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా పాకిస్తాన్ పర్యటిస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా సోషల్ మీడియాలో ఆయన పెట్టిన ఓ పోస్టు వైరల్ అవుతోంది. లాహోర్ కోటలో ఉన్న శ్రీరాముడి కుమారుడు లవుడి సమాధి సందర్శించి ప్రార్థనలు జరిపినట్టు సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్ ఫామ్ ఎక్స్‌లో శుక్లా పోస్ట్ చేశారు. ఈ పర్యటనలో తనతోపాటు అక్కడి మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పాకిస్తాన్ హోంమంత్రి మొహ్సిన్ నఖ్వీ కూడా తనతో ఉన్నట్టు రాజీవ్ శుక్ల పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తానే లవుడి సమాధిని అభివృద్ధి చేసినట్టు నఖ్వీ తనతో చెప్పారని రాజీవ్ శుక్ల తెలిపారు. ఆ పోస్ట్‌లోనే లవుడి సమాధి వద్ద తాను పూజలు జరుపుతున్న ఫోటోలు కూడా తన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
Also Read: కులం ఆధారంగా ఆలయాలపై హక్కులు పొందవచ్చా? మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు ఇదీ
శ్రీరాముడి చిన్న కుమారుడు "లవుడు "భారతీయ ఇతిహాసం రామాయణంలోని ఉత్తరకాండ ప్రకారం శ్రీరాముడికి ఇద్దరు కవల కుమారులు ఉన్నారు. వారిలో పెద్దవాడు 'కుశడు' కాగా రెండో వాడు"లవుడు". సీతాదేవిని రాముడు అడవులకు పంపించినప్పుడు వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఆమె ఇద్దరు కుమారులకు జన్మనిచ్చింది. తర్వాత కాలంలో తండ్రి వద్దకు చేరుకున్నారా ఇద్దరు. తర్వాత కుశలవులు తమ పేరు మీద రెండు నగరాలు స్థాపించారు. కుశడు తన పేరు మీద "కుశవర్ ", లవుడు పేరు మీద "లవపురి" నిర్మించినట్టు పురాణాలు చెబుతున్నాయి. వాటిని ప్రస్తుత కాలంలో కసూర్, లాహోర్‌గా పిలుస్తున్నారు. చారిత్రకంగా లాహోర్‌లో 2000 సంవత్సరాలకుపైగానే పెద్ద సంఖ్యలో ప్రజల నివసిస్తున్నట్టు ఆధారాలు ఉన్నాయి.
వాల్మీకి రాసినట్టుగా చెప్పే రామాయణం మరో వెర్షన్ "ఆనంద రామాయణం" ప్రకారం లవుడి భార్య పేరు సుమతి అని వారికి చాలామంది సంతానమని చెబుతారు. భారత్, పాకిస్తాన్‌లోని కొన్ని తెగలు ఎప్పటికీ తాము లవుడి సంతానమనే చెప్పుకుంటారు. ప్రస్తుత లాహోర్‌లోని షాహీ ఖిల్లాలో పురాతన హిందూ దేవాలయం ఉంది. ఆ ప్రాంగణంలోనే శ్రీరాముడు కుమారుడు లవుడి సమాధి ఉందని హిందువుల నమ్మకం. ప్రస్తుతం బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్ల సందర్శించింది ఆ సమాధినే.
Also Read: హోలీ 2025లో మార్చి 14న జరుపుకోవాలా? 15వ తేదీన చేసుకోవాలా? హోలీ, హోలీకా దహనం డిటైల్స్ ఇవే