Holi 2025 Celebrations : భారతదేశంలో రంగుల పండుగ అయిన హోలీ చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు. చిన్నపిల్లల నుంచి పెద్దలవరకు అందరూ రోడ్లపై చేరి.. ప్రియమైన వ్యక్తులతో రంగులు ఆడుకుంటూ.. ఈ ఫెస్టివల్​ను చేసుకుంటారు. హోలీని వసంతకాలం రాకను సూచిస్తూ.. చెడుపై మంచి విజయానికి సూచికగా నిర్వహిస్తారు. మరీ ఈ స్పెషల్ హోలీ 2025లో ఏ తేదీన వచ్చిందో మళ్లీ కన్​ఫ్యూజన్ మొదలైంది. ఇంతకీ దీనిని మార్చి 14వ తేదీన జరుపుకుంటారా? లేదా మార్చి 15వ తేదీన జరుపుకోవాలా? చూసేద్దాం. 

హోలీ తేదీ.. 

హోలీని శీతాకాలం చివర్లో ఫిబ్రవరి లేదా మార్చి నెలలలో వస్తుంది. వసంతకాలం రాకకు గుర్తుగా పౌర్ణమి రోజున జరుపుకుంటారు. 2025లో హోలీ మార్చినెలలో వచ్చింది. హిందూ క్యాలెండర్ ప్రకారం హోలీని రెండు రోజులు జరుపుకుంటారు. మార్చి 13వ తేదీన 2025 గురువారం రోజున హోలిక దహనం జరుగుతుంది. మార్చి 14వ తేదీన 2025న శుక్రవారం రోజు హోలీ జరుపుకుంటారు. 

హోలిక దహనం..

హోలిక దహనం జరగకుండా కొన్ని చోట్ల తెలుగు రాష్ట్రాల్లో హోలీని చేసుకోరు. ఈ సమయంలో ఆ ఘట్టానికి అంత ప్రాముఖ్యత ఉంది. పురాణాల ప్రకారం.. రాక్షస రాజైన హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు విష్ణువుకు భక్తుడు. తండ్రికి ఇది నచ్చకపోవడంతో ఎన్నోసార్లు కొడుకును చంపేందుకు ప్రయత్నించి విఫలమవుతుంది. అతను తన సోదరి హోలికకు ప్రహ్లాదుడిని చంపాలని కోరుతాడు. 

అన్నకు ఇచ్చిన మాటకోసం హోలిక ప్రహ్లాదుడిని మంటల్లో వేసేస్తుంది. విష్ణువుకు పరమ భక్తుడైన ప్రహ్లాదుడు ఎలాంటి గాయాలు లేకుండా మంటల నుంచి తప్పించుకుంటాడు. హోలిక మాత్రం అదే మంటల్లో కాలిపోతుంది. అందుకే చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ హోలీని జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం హోలీ సమయంలో హోలిక అనే రాక్షస బొమ్మను తయారు చేసి నిప్పంటించడం ఆనవాయితీగా వస్తుంది. దీనినే హోలిక దహన్ అంటారు.

భారతదేశం వ్యాప్తంగా హోలీని గొప్పగా జరుపుకుంటారు. ఒక్కోప్రాంతంలో ఒక్కోలా దీనిని చేసుకుంటారు. శ్రీకృష్ణుని జన్మస్థలమైన మధుర, బృందావనంలో హోలీకి ప్రత్యేక ప్రాధన్యత ఉంది. మేజర్​గా అన్ని చోట్ల రంగులతో సెలబ్రేట్ చేసుకుంటారు. హైదారాబాద్​లో కూడా పలు ఈవెంట్స్ నిర్వహిస్తారు. వాటికి తగిన ఏర్పాట్లు.. మ్యూజిక్​తో కూడిన సెలబ్రేషన్స్ ఉంటాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హోలీ ప్రధానంగా రంగుల చుట్టూ ఉంటుంది. అందుకే దీనిని ఆడేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చర్మానికి నష్టం జరగకుండా సేంద్రీయ, సహజమైన రంగులు ఎంచుకుంటే మంచిది. హైడ్రేటెడ్​గా ఉండాలని గుర్తించుకోండి. జుట్టుకు నూనె రాస్తే రంగులు ఈజీగా వదిలిపోతాయి. చర్మానికి చికాకు కలిగించే రంగులు పూసుకోకపోవడమే మంచిది. కళ్లకు అద్దాలు పెట్టుకోవాలి. సన్​స్క్రీన్ వాడితే మంచిది. జుట్టుకు కూడా నూనె రాసుకుంటే కలర్స్ ఈజీగా వదులుతాయి. 

Also Read : అంతర్జాతీయ మహిళా దినోత్సవం తేదీ, చరిత్ర.. ఈ సెలబ్రేషన్ వెనక ప్రాముఖ్యత, థీమ్ ఇవే