Garuda Puranam: గరుడ పురాణంలో, మరణ సమయంలో ఒక వ్యక్తి ఎలాంటి అనుభవాన్ని పొందుతాడు, మరణానంతరం ఆత్మ ఎలాంటి సుఖ‌దుఃఖాల‌ను పొందుతుంది, ఆత్మ స్వర్గం లేదా నరకంలో ఎలాంటి స్థానానికి చేరుకుంటుందో శ్రీ‌మ‌హావిష్ణువు స‌మ‌గ్రంగా వివరించాడు. ఒక వ్యక్తి తన కర్మల ప్రకారం మరణానంతరం స్వర్గం లేదా నరకం పొందుతాడు. అయితే, చనిపోయినప్పుడు కొన్ని వ‌స్తువులు ఆ వ్య‌క్తి దగ్గర ఉంచితే నరకంలో ప్రవేశించాల్సిన అవసరం లేదని గరుడ పురాణంలో పేర్కొన్నారు. మ‌రి ఆ వ‌స్తువులు ఏంటి..?


తులసి మొక్క       


ఒక వ్యక్తి మ‌రికాసేప‌ట్లో చనిపోతాడ‌ని తెలిసిన‌ప్పుడు వెంటనే, అతన్ని తులసి మొక్క దగ్గర పడుకోబెట్టాలి. దీనితో పాటు తులసి ఆకు, మంజరి అత‌ని నుదుటిపై పెట్టాలి. ఇలా చేయడం వల్ల మరణానంతరం ఆత్మ యమలోకానికి వెళ్లదని నమ్ముతారు. చాలా చోట్ల ఒక వ్యక్తి చనిపోయే ముందు తులసి నీళ్లను నోటిలో పోస్తారు.


Also Read : ఈ నలుగురిని ఎప్పుడూ నమ్మొద్దంటోంది గరుడ పురాణం!


గంగా జ‌లం     


చనిపోయిన తర్వాత చనిపోయిన వారి నోటిలో తుల‌సి ఆకులు క‌లిపిన‌ గంగాజలం పోయ‌డం ఒక ముఖ్యమైన సంప్రదాయం. కానీ ఒక వ్యక్తి మరణించే సమయం ఆసన్నమైతే, ఓ వ్యక్తి మరణానికి గురవుతున్నాడని భావించినట్లయితే, చనిపోయే ముందు, అతని నోటిలో గంగాజలం పోయండి. ఇది అతని జీవితకాలంలోని అన్ని పాపాలను నాశనం చేస్తుంది, ఫ‌లితంగా మరణం తర్వాత అత‌ని ఆత్మకు స్వర్గంలో స్థానం సంపాదించడానికి సహాయపడుతుంది.


ద‌ర్భ‌      


ద‌ర్భ‌ ఒక రకమైన పవిత్రమైన గడ్డి. మరణ సమయంలో, ఒక వ్యక్తిని ద‌ర్భాసనంపై పడుకోబెట్టి, మరణిస్తున్న వ్యక్తి నోటిలో తులసి ఆకును ఉంచినట్లయితే, ఆ వ్యక్తి ఆత్మ స్వర్గంలోకి ప్రవేశిస్తుందని నమ్ముతారు.


నల్ల నువ్వులు    


నల్ల నువ్వులు విష్ణువు ధూళి నుంచి ఉద్భవించాయని చెబుతారు. మరణానికి ముందు, వ్యక్తి చేతి నుంచి నువ్వులను దానం చేయ‌డం వలన యమదూతలు మరణానంతరం ఆత్మకు భంగం కలిగించరు. అదే సమయంలో, అసురులు, రాక్షసులు, దానవులు అందరూ పారిపోతారు.


Also Read : శివుడు, విష్ణువులు వేర్వేరా? పురాణాలు ఏం చెబుతున్నాయి?


దుస్తులు   


ఒక వ్యక్తి మరణించిన తరువాత, అతను తన జీవితకాలంలో ఉపయోగించిన వస్తువులు, ముఖ్యంగా అతనికి ఇష్టమైన వస్తువులను దహనం చేస్తారు. గరుడ పురాణం ప్రకారం, మరణించిన తర్వాత కూడా, మరణించిన వ్యక్తి ఆత్మ ప్రాపంచిక అనుబంధాన్ని విడిచిపెట్టదు. అటువంటి పరిస్థితిలో, మీరు వారి దుస్తులను ధరించడం ద్వారా వారి ఆత్మను ఆకర్షించవచ్చు. అందుకే చనిపోయిన వారి దుస్తులు ధరించడం మానుకోవాలి. ఒక వ్యక్తి మరణించిన తరువాత, అతని దుస్తులు దానం చేయాలి. ఇది ఆత్మకు శాంతిని, మోక్షాన్ని ఇస్తుంది.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.