Garuda purana in Telugu: చాలా మందికి తమ గత జన్మ, రాబోయే జన్మల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. దీనిని తెలుసుకునే కొన్ని పద్ధతులు హిందూ ధర్మ-పురాణాలలో కూడా పేర్కొన్నారు. గరుడ పురాణంలో మనిషి చేసే ప్రతి చర్య సమగ్రంగా వివరించారు. ఈ గ్రంథం అతని యోగ్యతను నిర్ణయించడమే కాకుండా, మరణం.. తదుపరి జన్మ ఆ తర్వాత అతను అనుభవించే శిక్ష గురించి కూడా చెబుతుంది. గరుడ పురాణంలో కూడా స్వర్గం- నరకం వివరాలు ప్రస్తావించారు. మరణానంతరం మాత్రమే కాదు మనిషిగా జీవిస్తున్నప్పుడు కూడా పాటించాల్సినవి వివరించింది గరుడ పురాణం. ముఖ్యంగా జీవితంలో ఎలాంటి వ్యక్తిని, వస్తువులను విశ్వసించకూడదో వివరించారు.
1. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి
గరుడ పురాణం ప్రకారం, పాలనా వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించే వ్యక్తిని ఎప్పుడూ నమ్మకూడదు. మీ కంటే ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులను పూర్తిగా విశ్వసించడం మానుకోండి. ఈ వ్యక్తులకు మీ రహస్యాలను ఎప్పుడూ చెప్పకండి. ఎందుకంటే సమయం వచ్చినప్పుడు, వారు మీ రహస్యాలను వారి సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవచ్చు, కాబట్టి ఆ భయంతో జీవించడం కంటే వారికి చెప్పకపోవడమే మంచిది. మీకు - మీ యజమానికి మధ్య పాటించాల్సిన దూరాన్ని కొనసాగించగలిగితే అది మీ మధ్య సంబంధాన్ని చెక్కుచెదరకుండా ఉంచుతుంది.
Also Read: స్నేహమైనా, బంధమైనా ప్రారంభంలోనే ఈ అంశాలు గమనించాలి
2. కపట మనస్తత్వం
నిప్పు ఎప్పుడూ ప్రమాదకరమే. అగ్నిని ఎప్పుడూ విశ్వసించకూడదు, ఎందుకంటే ఏ క్షణంలోనైనా అది కణం స్థాయి నుంచి భయంకరంగా వ్యాపించి అన్నింటినీ భస్మీపటలం చేస్తుంది. ఫలితంగా ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లుతుంది. అందుకే సరైన సమయంలో మంటలను అదుపు చేయడం చాలా ముఖ్యం. అలాగే లోపల మనపై అంతులేని ద్వేషాన్ని పెంచుకుని, పైకి ఎంతో ప్రేమ ఉన్నట్టు నటిస్తూ అవకాశం కోసం ఎదురుచూసే వాళ్లను గుర్తించి దూరంగా ఉండాలి. లేదంటే సమయం చూసి వెన్నుపోటు పొడిచేందుకు ఏమాత్రం వెనుకాడరు.
3. విశ్వాస ఘాతకులు
పాము తన పిల్లలనూ వదలనట్లే నిన్ను వదలదు. పాలు పోసినా విషం కక్కే జీవి ఇది. పాము విషపూరితమైనదైనా.. విషపూరితం కానిదైనా కావచ్చు, కానీ మనం ఖచ్చితంగా దానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది మీ మరణానికి దారి తీస్తుంది. అదే విధంగా మీరు మేలు చేసినా మీకు కీడు తలపెట్టాలని భావించే వారికి దూరంగా ఉండాలి. విశ్వాస ఘాతకులు మిమ్మల్ని దెబ్బకొట్టాలని చూస్తుంటారు. అలాంటి వారిని పెంచి పోషించకుండా ముందుగానే జాగ్రత్తపడాలి. పరిస్థితులకు అనుకూలంగా వ్యవహరించాలి.
4. శత్రు సేవకుడు
శత్రువు ఇంటి సేవకుడికి సాధారణంగా ఆ ఇంటి గుట్టు అంతా తెలుసు. శత్రువు తన సేవకుడిని ఇతరులకు హాని చేయడానికి, ఒకరిని నాశనం చేయడానికి ఉపయోగించడం గురించి మనం చాలా కథలు విన్నాము. అటువంటి పరిస్థితిలో మీరు శత్రువు సేవకుడిని విశ్వసిస్తే మీ ప్రతి రహస్యం అతనికి తెలుస్తుంది. అతను తన యజమానికి ఆ రహస్యాలను చెప్పడం ద్వారా మిమ్మల్ని బాధపెట్టవచ్చు. కాబట్టి మీరు మీ వ్యక్తిగత విషయాలను బయటకు చెప్పకపోవడం ఎల్లప్పుడూ శ్రేయస్కరం.
Also Read: భార్య, భర్తకు ఎటువైపు నిద్రపోవడం మంచిదో తెలుసా? పడక గదిలో ఈ నియమాలు తప్పనిసరి!
ఈ నలుగురినీ మనం ఎప్పుడూ నమ్మకూడదని గరుడ పురాణంలో స్పష్టంచేశారు. అలాంటి వారిని నమ్మడం వల్ల మనం అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటామని తెలిపారు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధ్రువీకరించడం లేదని గమనించగలరు.