Karthika Masam 2023 Lingashtakam:  కార్తీకమాసంలో నిత్య దీపారాధన, ప్రత్యేక పూజ చేసేవారు లింగాష్టకం తప్పనిసరిగా చదువుతారు. ముఖ్యంగా కార్తీకసోమవారం ఉపవాసం ఉన్నవారు లింగాష్టక చదివితే ఉత్తమ ఫలితం లభిస్తుందని పండితులు చెబుతారు. నిరాకారుడిగా  లింగరూపంలో కొలువైన భోళాశంకరుడికి ప్రియమైన లింగాష్టకం అర్థం ఇక్కడ తెలుసుకోండి. 

బ్రహ్మ మురారి సురార్చిత లింగం -బ్రహ్మ , విష్ణు , దేవతలతో పూజలందుకున్న లింగంనిర్మల భాషిత శోభిత లింగం - నిర్మలమైన మాటలతో అలంకరించిన లింగంజన్మజ దుఃఖ వినాశక లింగం - జన్మ వల్ల పుట్టిన బాధలను నాశనం చేసే లింగంతత్ ప్రణమామి సదా శివ లింగం - సదా శివ లింగమా నీకు నమస్కారం !

దేవముని ప్రవరార్చిత లింగం -దేవమునులు , మహా ఋషులు పూజించిన లింగంకామదహన కరుణాకర లింగం  - మన్మధుడిని దహనం చేసిన , అపారమైన కరుణను చూపే శివలింగంరావణ దర్ప వినాశక లింగం - రావణుడి గర్వాన్ని నాశనం చేసిన శివ లింగంతత్ ప్రణమామి సద శివ లింగం - సదా శివ లింగమా నీకు నమస్కారం !

Also Read: కార్తీకమాసంలో ఇందులో ఒక్క క్షేత్రం దర్శించుకున్నా చాలు!

సర్వ సుగంధ సులేపిత లింగం - మంచి గంధాలు లేపనాలుగా పూసిన లింగంబుద్ధి వివర్ధన కారణ లింగం - మనుషుల బుద్ధి వికాసానికి కారణ మైన శివ లింగం సిద్ధ సురాసుర వందిత లింగం - సిద్ధులు , దేవతలు , రాక్షసులు కీర్తించిన లింగంతత్ ప్రణమామి సదా శివ లింగం -సదా శివ లింగమా నీకు నమస్కారం !

కనక మహామణి భూషిత లింగం - బంగారం , మహా మణులతో అలంకరించిన శివ లింగంఫణిపతి వేష్టిత శోభిత లింగం - నాగుపాముని  అలంకారంగా చేసుకున్న శివలింగందక్ష సుయజ్ఞ వినాశక లింగం - దక్షుడు చేసిన మంచి యజ్ఞాన్ని నాశనం చేసిన శివ లింగంతత్ ప్రణమామి సదా శివ లింగం - సదా శివ లింగమా నీకు నమస్కారం !

Also Read: కలిపురుషుడికి - కార్తీక వనభోజనాలకి - ఉసిరిచెట్టుకి లింకేంటి!

కుంకుమ చందన లేపిత లింగం - కుంకుమ , గంధం పూసిన శివ లింగంపంకజ హార సుశోభిత లింగం - కలువ దండలతో అలంకరించిన లింగంసంచిత పాప వినాశక లింగం - సంక్రమించిన పాపాలని నాశనం చేసే శివ లింగంతత్ ప్రణమామి సదా శివ లింగం  -సదా శివ లింగమా నీకు నమస్కారం !

దేవగణార్చిత సేవిత లింగం - దేవ గణాలతో పూజలందుకున్న శివలింగంభావైర్ భక్తీ భిరేవచ లింగం - చక్కటి భావంతో కూడిన భక్తితో పూజలందుకున్నశివ లింగందినకర కోటి ప్రభాకర లింగం - కోటి సూర్యుల కాంతితో వెలిగే మరో సూర్య బింబం లాంటి లింగంతత్ ప్రణమామి సదా శివ లింగం - సదా శివ లింగమా నీకు నమస్కారం !

అష్ట దలోపరి వేష్టిత లింగం -ఎనిమిది రకాల ఆకుల మీద నివాసముండే శివ లింగంసర్వ సముద్భవ కారణ లింగం -అన్నీ సమానంగా జన్మించడానికి కారణమైన శివ లింగంఅష్ట దరిద్ర వినాశక లింగం - ఎనిమిది రకాల దరిద్రాలను నాశనం చేసే శివ లింగంతత్ ప్రణమామి సదా శివ లింగం - సదా శివ లింగమా నీకు నమస్కారం !

Also Read: కార్తీక మాసంలో మాంసాహారం ఎందుకు తినకూడదు!

సురగురు సురవర పూజిత లింగం - దేవ గురువు (బృహస్పతి), దేవతలతో పూజలందుకున్న శివ లింగంసురవన పుష్ప సదార్చిత లింగం - నిత్యం పారిజాతాలతో పూజలందుకున్న శివలింగంపరమపదం పరమాత్మక లింగం - ఓ శివ లింగమా, నీ సన్నిధి ఏ ఒక స్వర్గముతత్ ప్రణమామి సదా శివ లింగం -సదా శివ లింగమా నీకు నమస్కారం !

లింగాష్టక మిదం పుణ్యం యః పట్టేత్ శివ సన్నిధౌ శివ లోక మవాప్నోతి శివేన సహమోదతే (ఎప్పుడైతే శివుడి సన్నిధిలో లింగాష్టకం చదువుతారో వారికి శివుడిలో ఐక్యం అయ్యేందుకు మార్గం దొరుకుతుంది)

Also Read: కార్తీక పూర్ణిమ ఎందుకు ప్రత్యేకం - ఈ రోజు దంపతులు సరిగంగ స్నానాలు చేస్తే