Konaseema News: ఆ గుడికి జూనియర్ ఎన్టీఆర్ విరాళం - ఎందుకంత ప్రత్యేకతో మీకు తెలుసా?

Andhra Pradesh News: కోనసీమ జిల్లాలోని ఓ ఆలయ పునర్నిర్మాణానికి జూనియర్ ఎన్టీఆర్ విరాళం అందించిన విషయం వైరల్ గా మారింది. అసలు ఆ ఆలయం ప్రత్యేకత ఏంటి.?. ఎందుకంత విరాళం ఇచ్చారో తెలుసా.?

Continues below advertisement

Junior NTR Funded Konaseema Bhadrakhali Temple Specialities: కోనసీమలోని (Konaseema) జగ్గన్నపేటలో భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయ పునర్నిర్మాణం కోసం ప్రముఖ టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) రూ.12.50 లక్షల భారీ విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయం మొన్నటి వరకూ ఎవరికీ తెలియలేదు. ఆ ఊరి గ్రామస్థులు గుడిలో ఎన్టీఆర్ కుటుంబం పేరుతో శిలా ఫలకం ఏర్పాటు చేసే వరకూ ఎవరికీ తెలియలేదు. పోలింగ్ సందర్భంగా ఓటు వేయడానికి వచ్చిన కొందరు యువకులు ఆ ఆలయంలో శిలా ఫలకాన్ని ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారి విషయంం వెలుగులోకి వచ్చింది. అసలు, ఆ గుడికి అంత ప్రత్యేకత ఏంటి.? ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ అంత విరాళం ఇచ్చారు అనే ప్రశ్నలు అందరిలోనూ ఆసక్తి కలిగిస్తున్నాయి. 

Continues below advertisement

ఆ పురోహితుని కోరిక మేరకు..

జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి చేసిన పురోహితుడు కారుపాటి కోటేశ్వరరావు కోనసీమలోని జగ్గన్నపేట గ్రామానికి చెందినవారు. 90 ఏళ్ల నాటి వీరభద్ర స్వామి ఆలయం పాడుబడడంతో ఆయన కోరిక మేరకు జూనియర్ ఎన్ఠీఆర్ భారీ విరాళం అందజేశారు. దీంతో ఈ గుడి పునర్నిర్మాణం వేగంగా జరిగింది. ఇక, ఈ గుడికి నందమూరి హరికృష్ణ వచ్చేవారని గ్రామస్థులు తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ తల్లి షాలిని, సోదరుడు కల్యాణ్ రామ్ రహస్యంగా వచ్చి ఈ గుడిని దర్శించి వెళ్తుంటారని ఆలయ ధర్మకర్త భవరాజు తెలిపారు. త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ ను కూడా ఆలయానికి ఆహ్వానిస్తామని చెప్పారు.

ఆలయానికి భారీ విరాళాలు

ఈ ఆలయానికి ఇతర ప్రముఖులు కూడా భారీ విరాళాలు అందజేశారు. ప్రముఖ వస్త్ర దుకాణం సంస్థ సీఎంఆర్ రూ.10 లక్షల విరాళం అందించినట్లు ధర్మకర్త తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ గుడి నిర్మాణం కోసం చాలా చొరవ చూపారని.. గ్రామంలో కొందరు ప్రముఖులు సైతం ఆలయం అభివృద్ధికి విరాళం అందించారని గ్రామస్థులు తెలిపారు.

Also Read: Jr NTR: ఎన్టీఆర్ మోసపోయాడు - ఇంటి స్థలం వివాదంలో హైకోర్టుకు వెళ్లిన జూనియర్

Continues below advertisement
Sponsored Links by Taboola