కొక్కరు ఒక్కో విషయాన్ని బలంగా నమ్ముతారు. అటువంటి కొన్ని నమ్మకాలకు పెద్దగా లాజిక్ కూడా ఉండదు. అలాంటి నమ్మకాల్లో ఒకటి 13 సంఖ్యకు సంబంధించిన వాదనలు. చాలా మంది 13ను అన్ లక్కీగా భావిస్తారు. కొంత మంది భయపడతారు కూడా. అందుకే మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ లలో కూడా పదమూడో ఫ్లోర్ ఉండదు. లిఫ్ట్ ల్లో 13 నంబర్ ఉండదు. పదమూడో తేదీన పనులు మొదలు పెట్టుకుంటే అపశకునం అని వాయిదా వేసుకుంటూ ఉంటారు, మంచి పనులు ప్రారంభించరు. శుభకార్యాలను అస్సలు పెట్టుకోరు. ఇలా 13 సంఖ్య చాలా అపకీర్తిని మూట కట్టుకుంది. మరి నిజానికి పదమూడు దుష్ట సంఖ్యా? జ్యోతిష్యం నిఫుణులు ఏమంటున్నారు?  


భారతీయ జ్యోతిష్యం, సంఖ్యామానం ప్రకారం పదమూడు సంఖ్య కు చాలా ప్రాధాన్యత ఉంది. చాలా సందర్భాలలో పదమూడు సంఖ్యను పవిత్రమైందిగా భావిస్తారు. చాలా సంప్రదాయాల్లో పదమూడు సంఖ్యకు ప్రాధాన్యత ఉంటుంది. కొన్ని పూజల్లో పదమూడు రకాలు పండ్లు పెట్టడం, పదమూడు రకాల పువ్వులతో పూజించడం, కొన్ని వ్రతాలు, దీక్షలు పదమూడు రోజుల పాటు చేస్తుంటారు. పదమూడు సంఖ్య నిజానికి చాలా అదృష్ట సంఖ్య. చాంద్రమానం ప్రకారం తిథుల్లో పదమూడో తిథి త్రయోదశి మంచిరోజు. ఇది శివుడికి ప్రీతి పాత్రమైన రోజు. దీర్ఘయుష్షు ని ప్రసాధిస్తుంది. త్రయోదశి రోజున ఉపవాస దీక్ష చేసే వారికి పాపాల నుంచి విముక్తి దొరుకుతుంది.


కర్మ


న్యూమరాలజి ప్రకారం 13 సంఖ్య ఏకాగ్రత, స్వేచ్ఛ, సృజనాత్మకతకు ప్రతీక. దీన్ని అన్ లక్కీ అని తప్పుగా జడ్జ్ చేస్తుంటారు. జీవితంలో ఎదురయ్యే పరీక్షలు, కర్మలను తప్పిస్తుంది. కర్మను నమ్మని వాళ్లకు 13 దురదృష్ట సంఖ్య అయ్యే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే వీరి చెడు కర్మల ఫలితాలు కచ్చితంగా వీరిని బాధిస్తాయి.  


పుట్టిన రోజయితే


ఏదైనా పని ప్రారంభిస్తే 13 రోజున కచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. పదమూడు 4 కు చెందిన సంఖ్య.  నాలుగు మంచి అదృష్టాన్ని ఇచ్చే సంఖ్య. డెస్టినీ నంబర్ 1, 3, 4 కలిగి ఉన్న వారు చాలా తెలివైన వారు స్ట్రీట్ స్మార్ట్ కూడా.


13 మన పరిసరాల్లో ఉంటే


పదమూడు చాలా ముఖ్యమైన నెంబర్. మన జీవితాలకు పూర్ణత్వాన్ని ఇస్తుంది. ఇదే ఆద్యంతాలు. ఇది పూర్తి జీవిత చక్రాన్ని పూర్తి చేస్తుంది. మనకున్న నాలుగు కాలాల్లో పదమూడు వారాలు ఉంటాయి. మూన్ సైకిల్స్ కూడా 13. టీన్ ఏజ్ ప్రారంభం అయ్యేది కూడా 13 వయసులోనే.


అయితే ఈ పదమూడు సంఖ్య మరణ సమయానికి అంతిమ సంస్కారాలకు సంబంధించినవి కనుక అందరూ ఈ సంఖ్యను చూసి భయపడతారు. మంచి కర్మలతో జీవితం పూర్తి చేసిన వారు ప్రశాంతంగా మరణిస్తారు. లేదంటే చేసిన దానికి జీవితంలో ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. మనం మంచి పనులు చేస్తున్నంత కాలం మనకు 13 అన్ లక్కీ అనే అవసరం లేదు. 


Also read: మళ్లీ పుట్టుకొచ్చిన రెండు కొత్త కోవిడ్ వేరియంట్లు, పలు దేశాల్లో బయటపడుతున్న కేసులు


Also read: వాదనలో గెలిచేందుకు టాప్ టెన్ మానిప్యులేటివ్ ట్రిక్స్ ఇవే, వాడి చూడండి మీరే విజేత