Stampedes History: ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్( Hathras)లో జరిగిన ఘోర తొక్కిసలాటలో వందమందికిపైగా మృతి చెందారు. వేలాదిమందికి తరలిరావడం..ఒక్కసారిగా తోపులాటకు గురవ్వడంతోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటాయి. గతంలోనూ ఇలాంటి ఘటనలో వందలాది మంది ప్రాణాలు పొగొట్టుకున్నారు.అవి ఒకసారి చూద్దాం...
* మహారాష్ట్ర(Maharastra)లోని ప్రముఖ ఆలయాల్లో ఒకటైన మందర్‌దేవి(Mandhar Devi) ఆలయానికి భారీగా భక్తులు వస్తుంటారు. 2005లో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 350 మంది వరకు మరణించారు.
* రాజస్థాన్(Rajasthan)లోని చాముండాదేవీ(Chamunda Devi) ఆలయంలో 2008లో జరిగిన తొక్కిసలాటలో 250 మందికి పైగా మృతిచెందగా...దాదాపు 500 మంది గాయాలపాలయ్యారు
* హిమాచల్‌ప్రదేశ్(Himachel Pradesh)లోని వైనాదేవీ ఆలయంలోనూ 2008లో భారీ తొక్కిసలాట జరిగింది. ఈఘటనలో 162 మంది భక్తులు కన్నుమూశారు
*మధ్యప్రదేశ్(Madya Pradesh)లోని ఇండోర్‌లో గతేడాది జరిగిన తొక్కిసలాటలో 36 మంది చనిపోయారు
* దేశంలోనే అతిపెద్ద తొక్కిసలాట ప్రమాదం అంటే గుర్తుకొచ్చిది మాత్రం...1954 కుంభమేళా(Khumbhamela) ప్రమాదమే. ఉత్తరప్రదేశ్‌లోని (Uthara pradesh) ప్రయాగరాజ్ వద్దకు లక్షలాదిగా భక్తులు తరలిరాగా...ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈఘటనలో దాదాపు 800 మంది చనిపోగా...2 వేల మంది తీవ్రంగా గాయపడ్డారు.
*1994లో నాగ్‌పూర్(Nagpur)లో ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జి చేయగా తొక్కిసలాట జరిగింది. ఈఘటనలో 114 మంది చనిపోయారు. సుమారు 500 మంది గాయపడ్డారు.
*1999లో కేరళలోని శబరిమల(Sabharimala)లో మకరజ్యోతి దర్శనానికి వెళ్లిన అయ్యప్ప భక్తులు
తోసుకోవడంతో కిందపడిపోయిన భక్తులు ఊపిరిఆడక 53 మంది చనిపోయారు. 2011లోనూ మరోసారి తొక్కిసలాట చోటుచేసుకుని 106 మంది కన్నుమూశారు. మరో వందమంది భక్తులు గాయపడ్డారు.
*2005లో చెన్నై(Chennai)లో వరద భాదితులకు నిత్యవసరాలు పంపిణీ చేస్తుండగా జరిగిన తొక్కిసలాటలో 42 మంది చనిపోయారు.
* మధ్యప్రదేశ్(Madya Pradesh)లో రత్నగడ్ ఆలయానికి సమీపంలో 2013లో ఓ పాదచారుల వంతెన కూలిపోయి 115 మంది చనిపోగా..మరో 110 మంది గాయపడ్డారు.
* ముంబయి(Mumbai)లోని రైల్వేస్టేషన్ మెట్లమార్గంలో 2017లో జరిగిన తొక్కిసలాటలో 23 మంది చనిపోగా...39 మంది గాయపడ్డారు
* పంజాబ్‌లోని అమృత్‌సర్(Amruthsar)లో 2018లో రావణదహనం ఉత్సవం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 61 మంది చనిపోయారు.
* 2022లో జమ్మూలోని వైష్ణోదేవి(Vishno Devi) ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 12 మంది ప్రాణాలు విడిచారు.
* ఏపీలోనూ గోదావరి(Godhavari) పుష్కరాల సందర్భంగా 2015లో జరిగిన తొక్కిసలాటలో 27 మంది మృతి చెందారు.
జాగ్రత్త చర్యలేవి
జనం పిచ్చి మూడనమ్మకాలతో ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. ఒక్కసారిగా వేలాది మంది గుమిగూడితే ప్రమాదం జరుగుతుందని తెలిసినా...కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ముఖ్యంగా ఉత్తరాధిలో దొంగబాబాలు ప్రజలు భక్తి పేరు చెప్పి ఒకరమైన మత్తులోకి దించుతున్నారు. బాబా పాద ధూళి కోసం అమాయక ప్రజలు ప్రాణాలు పొగొట్టుకున్నారు. ఇప్పుడు ఆ బాబా మాత్రం ఆశ్రమం విడిచి పరారయ్యారు. తొక్కిసలాట ఘటనలో ఎక్కువగా మహిళలు, చిన్నారులే ప్రాణాలు కోల్పోతుంటారు. ఒక్కసారిగా జనం మీదపడటంతో తొక్కిసలాట చోటుచేసుకుని ఊపిరి ఆడక ప్రాణలు విడుస్తున్నవారే ఎక్కువ మంది ఉన్నారు. వేలాది మంది భక్తులు తరలివస్తారన్న సమాచారం ఉన్నప్పుడు ప్రభుత్వ యంత్రాంగం గానీ, పోలీసులు కానీ కనీస జాగ్రత్తలు తీసుకున్నట్లు లేరు. రద్దీని నియంత్రించే చర్యలు చేపట్టలేదు. అటు ఆశ్రమ నిర్వాహకులు సైతం చేతులెత్తేయడంతోనే ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గత అనుభవాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు