Vat Savitri Vrat 2023: తెలుగు నెలల్లో మూడో నెల జ్యేష్ఠం. ఈ మాసంలో వచ్చే పూర్ణిమనాడు చంద్రుడు జ్యేష్ఠా నక్షత్రానికి  సమీపంలో సంచరిస్తూ ఉండడంవల్ల ఈ మాసానికి ఈ పేరు వచ్చింది. ఈ నెలలో పాడ్యమి మొదలుకుని దశమి వరకు అంటే మొదటి పదిరోజులు కొన్ని నియమాలను పాటించడం వల్ల దశ పాపాలు నాశనం అవుతాయంటారు. ఈ పదిరోజులు బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకుని గంగానదిలో స్నానం చేసి గంగానదిని పూజించాలి. ఈ నెలలో ముఖ్యంగా చేసే వ్రతాల్లో వటసావిత్రి వ్రతం ఒకటి. జ్యేష్ఠమాసం పౌర్ణమి రోజు కొందరు ఆచరిస్తే...నెలలో చివరి రోజైన అమావాస్య రోజు ఇంకొందరు చేసే వ్రతం ఇది. 


వట సావిత్రీ వ్రతం 


తెల్లవారు జామునే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని పూజాద్రవ్యాలు తీసుకుని వటవృక్షం (మర్రిచెట్టు) దగ్గరకు వెళ్ళి పూజ చేసిన తర్వాత మర్రిచెట్టుకు దారం చుట్టుతూ 'నమో వైవస్వతాయ ' అనే మంత్రాన్ని పఠిస్తూ 108 ప్రదక్షిణలు చేయాలి. హిందూ సంస్కృతి, సంప్రదాయాలు పాటించడం,  కుటుంబ క్షేమము కోసం, కట్టుకున్న భర్త, బిడ్డలకోసం పురుషులకన్నా స్త్రీలే ఎక్కువ దైవారాధనలో మునిగి ఉంటారు. విధిని తమకు అనుకూలంగా మలచుకునేందుకు దైవాన్ని ప్రసన్నం చేసుకుని కుటుంబ క్షేమం కోసం చేసే ఉపవాస దీక్షలలో "వట సావిత్రీ వ్రతం" ముఖ్యమైనది.


Also Read: 4 నెలల పాటూ ఈ రాశులవారికి అత్యద్భుతంగా ఉంది!


భర్త ఆయుష్షు ఆరోగ్యం కోసం


తన పాతివ్రత్య మహిమతో యమధర్మరాజు నుంచి తన భర్త ప్రాణాలను మెనక్కు తెచ్చుకున్న సావిత్రి పతిభక్తికి గుర్తుగా ఈ పండుగను జరుపుకుంటారు. తన భర్త సత్యవంతుడు చనిపోతే పవిత్ర వృక్షమైన మర్రిచెట్టును భక్తిప్రపత్తులతో పూజించింది సావిత్రీదేవి. ఆ మహిమతోనే ఆమె యమధర్మరాజు వెంట నడిచింది. సామ, దాన భేద, దండోపాయాలు ప్రయోగించినా యముడు..ఆ పవిత్రవ ముందు వెనకడుగు వేయకతప్పలేదు. చివరికి ఆమె పతిభక్తికి, పాతివ్రత్యానికి సంతోషించి సావిత్రి భర్త ప్రాణాలు తిరిగి ఇచ్చేస్తాడు. పెళ్ళైన యువతులంతా వటసావిత్రీ వ్రతం రోజు సిందూరంతో మర్రిచెట్టును అలంకరిచి, నూలుదారం పోగుల్ని చెట్టుమొదలు చుట్టూకట్టి ప్రదిక్షిణలు చేస్తారు. వటవృక్షము అంటే మర్రిచెట్టు ... ఈ చెట్టును త్రిమూర్తుల స్వరూపంగా భవిస్తారు. మర్రిచెట్టు వ్రేళ్ళు బ్రహ్మకు, కాండము విష్ణువుకు, కొమ్మలు శివునికి నివాసస్థలములు. మర్రివృక్షంలా తమ భర్తలు కూడా సుదీర్ఘకాలం జీవించి ఉండాలని వటసావిత్రీ వ్రతములో మహిళలు ఈ చెట్టుకు మొక్కుకుంటారు. పూలు, గాజులు, పసుపు కుంకుమలు వంటి అలంకరణ సామగ్రితో అలంకరిస్తారు. ధూపదీప నైవేధ్యాలు సమర్పిస్తారు. సువిశాలమైన, విస్తారమైన ఈ వృక్షం కొమ్మకింద ఎలా నీడను పొందుతారో ఆ వృక్షంలా తమ భర్తలు కూడా కుటుంబానికంతా నీడనివ్వాలని కోరుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఆ శక్తిని తమ భర్తలకు ఇవ్వవలసిందిగా ఆ సావిత్రీదేవిని ప్రార్ధిస్తారు.కొందరు రోజంతా ఉపవాసం చేసి చంద్రుడిని చూసిన తర్వాత భోజనం చేస్తారు.  మరికొందరు పండ్లు మాత్రమే తింటారు. ఈ వటసావిత్రీ వ్రతం ఎప్పటి నుంచి మొదలైందో సరైనా ఆధారాలు లేవు కానీ నేపాల్ , బీహార్ తో పాటూ మనదేశంలో ఈ వ్రతాన్ని500 ఏళ్ళుగా ఆచరిస్తున్నారట. 


Also Read: మీ జాతకంలో ఈ గ్రహాలు బలంగా ఉంటే పర్వాలేదు కానీ బలహీనంగా ఉంటే జీవితం నరకమే!


వట సావిత్రీ వత్రం చేసేవారు ముందురోజు రాత్రి ఉపవాసం ఉండాలి. వ్రతం రోజు  తలకు స్నానంచేసి, దేవుడిని స్మరించుకుంటూ మర్రి చెట్టు వద్దకు వెళ్లి అలికి ముగ్గులు వేసి, సావిత్రి, సత్యవంతుల బొమ్మలు ప్రతిష్టించాలి. వారి చిత్ర పటాలు దొరకకపోతే పసుపు తో చేసిన బొమ్మలు ప్రతిష్టించుకుని మను వైధవ్యాధి సకల దోష పరిహారార్ధం అంటూ ఈ శ్లోకం పఠించాలి.
‘‘బ్రహ్మ సావిత్రీ ప్రీత్యర్థం
సత్యవత్సావిత్రీ ప్రీత్యర్ధంచ
వట సావిత్రీ వ్రతం కరిష్యే’’