Lord Sree Rama Family: రామాయణం, మహా భారతాలకు మన దేశంలో ఎంత ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ‘రామాయణం’లో రాముడి తరం, ఆయన తర్వాతి తరమయిన లవకుశుల గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ.. వాళ్ల తర్వాత రాముడి వంశం ఏమైంది? ఆ వంశంలో ఎవరెవరు రాజ్యాలేలారు. అసలు లక్ష్మణ, భరత, శత్రఘ్నులకు పిల్లలెంత మంది. వారి భార్యలు ఎవరు? త్రేతాయుగం నాటి శ్రీరాముడికి.. ద్వాపరయుగం నాటి కౌరవులకు ఉన్న రిలేషన్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రామాయణం.. శ్రీరాముని జీవితాన్ని మాత్రమే ప్రతిబింబిస్తుంది. తర్వాత జరిగిన విషయాలు గురించి ఎక్కడా ప్రాచుర్యంలో లేదు. అయితే పోతన రాసిన భాగవతంలోని నవమస్కందంలో రాముడి తర్వాత రఘువంశం గురించి కొంత వరకు వివరించారు. అలాగే వాల్మీకి రాసిన ఆనంద రామాయణం అనే కావ్యంలోనూ రఘువంశం గురించి మరికొన్ని వివరాలు ఉన్నాయి. అయితే శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు అయినప్పటికీ ఆయన తర్వాతి తరాలు మాత్రం రెండేసి పెళ్లిళ్లు చేసుకున్నట్లు ఆనంద రామాయణంలో వాల్మికి మహర్షి రాశారు.
సీతారాముడిలకు ఇద్దరు కుమారులు వారిలో పెద్ద కుమారుడు కుశుడికి ఇద్దరు భార్యలు, చంపిక, కుముద్వతి, కుముద్వతి నాగకన్య ఈమెకు మరో పేరు కంజాననా. వీరికి పుట్టిన కుమారుడు అతిధి ద్వారానే రఘువంశం తర్వాత వృద్ది చెందినట్లు పురాణాల్లో ఉంది. ఇక లవుడి భార్య పేరు సుమతి. రాముడి పాదుకలను సింహాసనం మీద ఉంచి రాజ్యమేలిన భరతుడి భార్య పేరు మాండవి, వీళ్లిద్దరికి కలిగిన పుత్రులే పుష్కరుడు, తక్షుడు. పుష్కరునికి ఇద్దరు భార్యలు కళావతి (నాగకన్య), (గంధర్వ కన్య). తక్షుడికి ఇద్దరు భార్యలు కాళిక (నాగకన్య ) మరియు చపల (గంధర్వ కన్య).
ALSO READ: మహాభారత యుద్ధం జరిగిన కురుక్షేత్ర ఎక్కడుంది..ఎలా వెళ్లాలి..అక్కడ చూసేందుకు ఏమున్నాయ్?
అన్నమాటనే శిరోధార్యంగా అగ్రజుడి వెంట అడవులకేగిన లక్ష్మణుడి భార్య పేరు ఊర్మిళ, వీరికి అంగదుడు, చంద్రకేతుడు అని ఇద్దరు కొడుకులు. అంగదునికి ఇద్దరు భార్యలు వారిలో కంజాక్షి నాగకన్య, చంద్రిక గందర్వకన్య. ఇక చంద్రకేతునికి కూడా ఇద్దరు భార్యలు వారిలో కంజాగ్రి నాగకన్య, చంద్రాసన గందర్వకన్య.
శ్రీరాముని మూడో తమ్ముడైన శత్రుఘ్నుడి భార్య పేరు శృతకీర్తి, వీరికి సుబాహుడు, శృతసేనుడు అనే ఇద్దరు పుత్రులు. సుబాహునికి ఇద్దరు భార్యలు కమల నాగకన్య, అచల గంధర్వకన్య. శృతసేనుడికి ఇద్దరు భార్యలు వారిలో మాలతి నాగకన్య, మదనసుందరి గంధర్వకన్య.
ఇలా మొత్తం శ్రీరాముడికి 16 మంది కోడళ్ళు, 120 మంది మనుమళ్లు, 24 మంది మనుమరాళ్లు కలిగారని పోతన నవమ స్కందంలో రాశారు. అయితే 120 మంది మనవళ్ల పెళ్లిల్లు, 24 మంది మనవరాళ్ల పెళ్లిళ్లు కూడా శ్రీరాముడి ఆధ్వర్యంలోనే జరిపించారట. వారు భూమండలం మొత్తం తమ తమ రాజ్యాలు ఏర్పాటు చేసుకుని పాలించినట్లు పురాణాలు చెప్తున్నాయి. అయితే శ్రీరాముడు సీతా నిర్యాణం తర్వాత నిత్యం యాగాలు, యజ్ఞాలు చేస్తూ ప్రజలను కన్నబిడ్డల వలే బావిస్తూ అవతరణ సమాప్తి చేసినట్లు పురాణాల ప్రతీతి.
ఇక రాముడి మొదటి కుమారైన కుశుడికి పుట్టిన అతిధి వారసత్వంలో ద్వాపర యుగంలో జన్మించిన బృహద్బలుడు కౌరవులకు విధేయుడిగా ఉంటూ మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన పాల్గొని.. అర్జునుడి పుత్రుడైన అభిమన్యుడి చేతిలో మరణించినట్లు పురాణగాథలు తెలుపుతున్నాయి.
Also Read: ఈ దుర్మార్గపు ఆలోచన కర్ణుడిదా? మహాభారతంలో అత్యంత కీలకఘట్టం వెనుక అసలు నిజం తెలిస్తే ఆశ్చర్యపోతారు!