AP Degree Online Applications: ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ఆన్‌లైన్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌కు ఉన్నత విద్యామండలి జులై 1న 'ఆన్‌లైన్ అడ్మిషన్స్ మాడ్యుల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ (OAMDC)' నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ/ఎయిడెడ్/ప్రైవేటు అన్ఎయిడెడ్/అటానమస్ డిగ్రీ కాలేజీల్లో సాధారణ డిగ్రీ కోర్సుల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. కౌన్సెలింగ్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జులై 2న ప్రారంభమైంది. విద్యార్థులు జులై 10 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.


ప్రత్యేక కేటగిరీ విద్యార్థులకు జులై 4 నుంచి 6 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. ఇందుకోసం సహాయ కేంద్రాలను ఏర్పాటుచేశారు. రిజిస్ట్రేషన్ పూర్తయినవారు కోర్సులు, కళాశాలల ఎంపికకు సంబంధించి జులై 11 నుంచి 15 వరకు వెబ్‌ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. ఆప్షన్లు నమోదుచేసుకున్నవారికి జులై 19న మొదటి విడత సీట్లను కేటాయిస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు జులై 20-22 లోపు సంబంధిత కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది. ఎన్‌సీసీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు, క్రీడాకారులు ధ్రువపత్రాల పరిశీలనకు ఎస్‌ఆర్‌ఆర్‌ & సీవీఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ- విజయవాడ లేదా డాక్టర్‌ వీఎస్‌ కృష్ణ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ-విశాఖపట్నం లేదా ఎస్వీ విశ్వవిద్యాలయం-తిరుపతిలోని సహాయ కేంద్రాల్లో జులై 4 నుంచి నిర్వహించే ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుంది. 


బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బి.వొకేషనల్, బీఎఫ్‌ఏ, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్ కోర్సుల్లో చేరేందుకు జులై 2 నుంచి 10 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగనుంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసే సమయంలో ఓసీ అభ్యర్థులు రూ.400, బీసీలు రూ.300, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులైతే రూ.200 చొప్పున ప్రాసెసింగ్ ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. ఇంటర్ పాసైన విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. 


కౌన్సెలింగ్ షెడ్యూలు..


➥ నోటిఫికేషన్ వెల్లడి: 01.07.2024.


➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: 02.07.2024 - 10.07.2024.


➥ స్పెషల్ కేటగిరీ అభ్యర్థులకు సర్టిఫికేట్ల పరిశీలన: 04.07.2024 - 06.07.2024.


➥ వెబ్‌ఆప్షన్ల నమోదు: 11.07.2024 - 15.07.2024.


➥ సీట్ల కేటాయింపు: 19.07.2024.


➥ రిపోర్టింగ్: 20.07.2024 - 22.07.2024.


OAMDC కౌన్సెలింగ్ ధ్రువపత్రాల పరిశీలనకు అవసరమైన సర్టిఫికేట్లు..


➥ ఇంటర్మీడియట్ మార్కుల మెమో, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (టీసీ)


➥ పుట్టినతేదీ ధ్రువీకరణ కోసం 10వ తరగతి మార్కుల మెమో.


➥ 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు అన్ని స్టడీ సర్టిఫికేట్లు


➥ EWS సర్టిఫికేట్ (2024-25)


➥ కుల ధృవీకరణ పత్రం (SC, ST, BC విషయంలో)


➥ ఇన్‌కమ్ సర్టిఫికేట్(ఆదాయ ధృవీకరణ పత్రం)


➥  రెసిడెన్స్ సర్టిఫికేట్ (ఏడేళ్ల కాలానికి)


➥ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్


➥ NCC & స్పోర్ట్స్ సర్టిఫికేట్లు 


➥ క్రీడా ధృవపత్రాలు 


➥ PH సర్టిఫికేట్


➥ CAP సర్టిఫికేట్


➥ ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ


➥ యాంటీ ర్యాగింగ్/అండర్ టేకింగ్ ఫారమ్


➥ ఎక్స్‌ట్రా కరికులమ్ యాక్టివిటీస్ ఉన్నవారు సంబంధిత సర్టిఫికేట్లు కలిగి ఉండాలి.


➥ SC/ST ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం తల్లిదండ్రుల డిక్లరేషన్ ఫారమ్


➥ రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు


Couselling Notification


Counselling Website





మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..