జూన్ 24 శుక్రవారం రాశిఫలాలు (Horoscope Today 24-06-2022)
మేషం
ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. వైవాహిక జీవితం బావుంటుంది.ఓ శుభవార్త అందుతుంది. మిత్రులను కలుస్తారు. పిల్లల అవసరాలను జాగ్రత్తగా చూసుకోండి. బాధ్యతలను సులభంగా నిర్వర్తించగలుగుతారు. పని పట్ల అంకితభావం మీకు సక్సెస్ ను ఇస్తుంది. అధికారులతో సత్సంబంధాలుంటాయి.
వృషభం
ఈ రోజు అనుకోని ఖర్చులు పెరుగుతాయి. వంకర ధోరణులు ఉన్న వ్యక్తులకు సహాయం చేసి మోసపోవద్దు. విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం పొందడం కష్టం. చేసిన పనిలో వెంటనే ఫలితాలు ఆశించవద్దు. విద్యార్థులకు కాస్త నిరాశగానే ఉంటుంది.
మిథునం
స్నేహితుల సహాయంతో ప్రయోజనం పొందుతారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కొత్త వ్యాపార భాగస్వామ్యం నుంచి ప్రయోజనం పొందుతారు. కుటుంబ సభ్యులు మీతో చాలా సంతోషంగా ఉంటారు. మీడియా రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈ రోజు చాలా మంచిది. ఆఫీసులో సహోద్యోగుల సహాయం అందుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.
Also Read: మీ ఇంట్లో నీరు ప్రవహించే దిశే (వాలు) మీ ఆర్థిక పరిస్థితిని నిర్ణయిస్తుంది
కర్కాటకం
విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఆదాయ వ్యయాల మధ్య సమతుల్యత ఉంటుంది. పరిశోధనపై ఆసక్తి పెరుగుతుంది. పెట్టుబడికి మంచి రోజు. ఇంటి సభ్యుల మధ్య సామరస్యం చాలా అవసరం. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.
సింహం
ఈ రోజు మీరు శత్రువుల నుంచి జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నవారికి మంచి రోజు. ఎవరికీ సలహా ఇవ్వకండి, ఎవ్వరినీ అతిగా విశ్వసించవద్దు. పై అధికారుల మాటలు మీలో నిరాశకలిగిస్తాయి. వాదన పెంచుకోకుండా ఉండడం మంచిది. మీ పనితీరు మార్చుకుంటారు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త.
కన్యా
ఈ రోజు కొంత ప్రతికూలత ఉంటుంది. బంధువుతో విభేదాలు రావొచ్చు. జీవిత భాగస్వామితో అనవసర చర్చలు, వివాద సూచనలున్నాయి. వాతావరణంలో మార్పు ప్రభావం మీ ఆరోగ్యంపై పడుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ ఆహారాన్ని నియంత్రించండి.
తులా
కఠిన పరిస్థితులను శక్తివంతంగా ఎదుర్కొంటారు. అనారోగ్యంతో బాధపడుతున్నవారికి కొంత ఉపశమనం ఉంటుంది. నిలిచిపోయిన ప్రభుత్వ పనులు ఈ రోజు ముందుకు సాగుతాయి. పాత వివాదాస్పద విషయాలను శాంతియుతంగా పరిష్కరించుకుంటారు. మంచి సమాచారం వింటారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.
వృశ్చికం
ఉద్యోగం మారాలి అనుకున్నవారికి మంచి సమయం ఇది. అనైతిక చర్యలకు దూరంగా ఉండాలి. గుర్తుతెలియని వ్యక్తులతో జాగ్రత్త వహించండి లేదంటే చాలా నష్టపోతారు. అధికారులతో మీ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. ఒత్తిడి కారణంగా బాగా అలసిపోతారు. కార్యాలయంలో కొత్త అవకాశాలు లభిస్తాయి.
Also Read: ఒకే రాశిలో బుధుడు-శుక్రుడు, ఈ 4 రాశులవారికి అదృష్టం దరిద్రం పట్టినట్టు పడుతుంది
ధనుస్సు
డబ్బు సంపాదించడానికి బలమైన అవకాశాలున్నాయి. ప్రశాంతంగా ఆలోచిస్తే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వైవాహిక జీవితంలో పరస్పర గౌరవం తక్కువగా ఉంటుంది. మీ అభిప్రాయాలను బలవంతంగా మీ జీవిత భాగస్వామిపై బలవంతంగా రుద్దకండి. పోటీ పరీక్షలు రాసేవారు మంచి ఫలితాలు పొందుతారు. విద్యార్థులు తమ కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు.
మకరం
ఎప్పటి నుంచో రావాల్సిన మొత్తం అందుతుంది. కొత్తవ్యక్తులను కలుస్తారు. అనారోగ్య సమస్యలకు ఎక్కువ ఖర్చుచేస్తారు. కార్యాలయంలో సహోద్యోగుల వల్ల మీ పని డిస్ట్రబ్ అవుతుంది. ఇంట్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి. చిరాకు పెరుగుతుంది.
కుంభం
విదేశాల నుంచి మంచి ఆఫర్లు పొందుతారు. కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. సాంకేతిక రంగంలో ఉన్నవారికి ధనలాభం ఉంటుంది. ఇంట్లో పిల్లలతో సరదాగా గడుపుతారు. దైవ సంబంధ విషయాలపై మనసు మళ్లుతుంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సకాలంలో పనులన్నీ పూర్తవుతాయి. ఎవరికీ సలహా ఇవ్వకండి.
Also Read: వృషభ రాశిలోకి శుక్రుడు, ఈ నాలుగు రాశుల వారికి అస్సలు బాలేదు
మీనం
ఎవరితోనైనా వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. మీరు ఆఫీసులో సహోద్యోగుల ఒత్తిడిని ఎదుర్కోవలసి రావొచ్చు. మీ ప్రణాళికలను విజయవంతంగా అమలు చేయగలుగుతారు. అనారోగ్య సమస్యలుంటాయి. ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలొస్తాయి.