2022 మే 22 ఆదివారం రాశిఫలాలు ( తులారాశి నుంచి మీనరాశి వరకు)
తులారాశి
ప్రయాణం వాయిదా వేసేందుకు ప్రయత్నించండి. బంధువులతో అభిప్రాయ భేదాలు రావొచ్చు. ప్రవర్తనలో దూకుడు కారణంగా మీరు చాలామంది కోపానికి గురవుతారు. మీ ఖర్చులను నియంత్రించడం అవసరం ఉంది. కొన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీరు వృద్ధుల అనుభవాల నుంచి ప్రయోజనం పొందుతారు.
వృశ్చికరాశి
మీ ప్రత్యర్థుల సంఖ్య పెరగుతుంది. దంపతుల మధ్య బాంధవ్యంలో మాధుర్యం ఉంటుంది. మీ పిల్లల పురోగతిని చూసి మీరు ఉత్సాహంగా ఉంటారు. వ్యక్తిగత సంబంధాల్లో దూరం పెరిగే అవకాశం ఉంది. కండరాల నొప్పితో బాధపడతారు. వ్యాపారులు లాభపడతారు. ఉద్యోగులకు సాధారణ ఫలితాలుంటాయి.
ధనుస్సు రాశి
కొత్తగా తలపెట్టిన పనుల నుంచి ప్రయోజనం పొందుతారు. పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇదే మంచి సమయం. మీరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. కొత్తగా తలపెట్టిన కొన్ని పనుల విషయంలో శ్రేయోభిలాషుల సలహాలు తీసుకోవాలి. విద్యార్థులు ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం పొందే అవకాశాలు ఉన్నాయి. నిలిపివేసిన మొత్తం తిరిగి చేతికి అందుతుంది. అనవసరంగా రిస్క్ తీసుకోకండి.
మకరరాశి
మీ ప్రవర్తన, పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులను కలుస్తారు. ప్రేమ సంబంధాలకు కుటుంబ సమ్మతి లభిస్తుంది. మీరు ఆర్థిక విషయాలకు సంబంధించి అదృష్టవంతులు అవుతారు. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం.
కుంభరాశి
కొత్త పనులు ప్రారంభించేందుకు అనుకూలమైన రోజు. మీరు కొన్ని పాత విషయాల గురించి కొంచెం ఆందోళన చెందుతారు. షేర్ మార్కెట్‌తో అనుబంధం ఉన్న వ్యక్తులు అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. ఓ కొత్త విషయాన్ని నేర్చుకోవాలనే ఉత్సాహంతో ఉంటారు. వివాహ సంబంధమైన అడ్డంకులు తొలగిపోతాయి. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి.
మీనరాశి
మీనరాశివారు ఈ రోజు ఏ పని తలపెట్టినా సులభంగా పూర్తిచేస్తారు. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు కూడా పూర్తిచేసేందుకు ప్రయత్నించండి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. అనుకోకుండా ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు. మీరు ప్రణాళికల ప్రకారం పనిచేయాల్సి రావొచ్చు. కొత్త వ్యక్తులను కలుస్తారు.. వారితో స్నేహం పెంచుకుంటారు. మీ ప్రత్యర్థులు సైలెంట్ గా ఉన్నారని మీరు నిర్లక్యంగా ఉండొద్దు.
Also Read: శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఈ నాలుగు రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది, మీరున్నారా అందులో
Also Read: కృష్ణుడు 36 ఏళ్లలో చనిపోవాలనే గాంధారీ శాపం నెరవేరిందా? కురుక్షేత్రంలో ఏం జరిగింది?