Lava Z3 Pro: రూ.8 వేలలోపే లావా కొత్త ఫోన్ - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా తన కొత్త స్మార్ట్ ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే లావా జెడ్3 ప్రో.

Continues below advertisement

లావా మనదేశంలో కొత్త బడ్జెట్ ఫోన్ లాంచ్ చేసింది. అదే లావా జెడ్3 ప్రో. మీడియాటెక్ హీలియో ఏ25 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఈ సంవత్సరం మార్చిలో మనదేశంలో లాంచ్ అయిన లావా జెడ్3కి ప్రో వేరియంట్‌గా ఈ ఫోన్ లాంచ్ అయింది.

Continues below advertisement

లావా జెడ్3 ప్రో ధర
దీని ధరను రూ.7,499గా నిర్ణయించారు. స్ట్రైప్డ్ బ్లూ, స్టైప్డ్ సియాన్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం లావా ఆన్‌లైన్ స్టోర్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

లావా జెడ్3 ప్రో స్పెసిఫికేషన్లు
ఇందులో 6.5 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు. స్క్రీన్ రిజల్యూషన్ 720 x 1600 పిక్సెల్స్‌గా ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉంది. దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. క్వాడ్‌కోర్ మీడియాటెక్ హీలియో ఏ25 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఇందులో ఉంది. స్టోరేజ్‌ను మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.

ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 8 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు సెకండరీ లెన్స్ కూడా ఉండనుంది. బ్యూటీ మోడ్, హెచ్‌డీఆర్ మోడ్, నైట్ మోడ్, పొర్‌ట్రెయిట్ మోడ్ వంటి కెమెరా ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ అందించారు.

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంను ఇందులో అందించారు. ఫోన్ వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. దీని మందం 0.89 సెంటీమీటర్లు కాగా.. బరువు 192 గ్రాములుగా ఉంది.

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

Continues below advertisement
Sponsored Links by Taboola