2022 మే 18 బుధవారం రాశిఫలాలు
మేషం
కెరీర్ కోసం పోరాడాల్సి వస్తుంది. మీ పని విధానాన్ని మార్చుకోపోతే సమస్యలు తప్పవు. వైవాహిక సంబంధాల్లో కొంత ఇబ్బంది ఉంటుంది. స్నేహితులతో కలసి పార్టీల్లో ఎంజాయ్ చేస్తారు. అధిక పనివల్ల అలసిపోయినట్టు అనిపిస్తుంది.
వృషభం
వేరేవారి కారణంగా మీరు ఇబ్బందుల్లో పడతారు. మనసలో సందేహాలు పెరుగిపోతూనే ఉంటాయి. ఆదాయ వనరుల్లో తగ్గుదల ఉంటుంది. బీపీ ఉన్నవారు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. మసాలా ఆహారానికి దూరంగా ఉండండి. తొందరగా ఒత్తిడికి లోనవుతారు.
మిథునం
మీ ప్రవర్తనను అంతా మెచ్చుకుంటారు. తలపెట్టిన పనులు పూర్తవుతాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం. మీనుంచి నేర్చుకునేందుకు చాలామంది ప్రయత్నిస్తారు. తెలియని వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి.
కర్కాటకం
చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలకు అనుకూలమైన రోజు. ఉద్యోగులు ఉన్నతాధికారుల సహాయం పొందుతారు. అసంపూర్ణంగా మిగిలిన పనులు ఈరోజు పూర్తిచేయండి. తోడబుట్టినవారితో సంతోష సమయం గడుపుతారు. కుటుంబంతో కలసి టూర్స్ ని ఎంజాయ్ చేస్తారు.
సింహం
కోపాన్ని అదుపులో ఉంచుకోండి. జీవితం పట్ల సానుకూలత పెరుగుతుంది. ఎసిడిటీ సమస్యతో ఇబ్బందిపడతారు. వ్యాపారులు పెద్ద ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇదే మంచి సమయం. మీ మనసులో ఆనందం, ఉత్సాహం ఉంటుంది. ఈరోజు మంచి రోజు అవుతుంది.
కన్య
మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బలంగా ఉంటుంది. శుభకార్యాలకు హాజరవుతారు. అనవసర వాదనలకు దూరంగా ఉండండి. కుటుంబంలో మీ హక్కులు పెరుగుతాయి. తల్లిదండ్రులు మిమ్మల్ని చాలా నమ్ముతారు. ఎవరికీ సలహా ఇవ్వకండి.
తులా
ఈ రోజు మంచి రోజు అవుతుంది. తలపెట్టిన పనుల్లో పురోగతి ఉంటుంది. లక్ష్యాలను సాధించడానికి మీపై ఒత్తిడి ఉంటుంది. ఈ రోజు మీ దృష్టంతా త్వరగా పని పూర్తిచేయడంపైనే ఉంటుంది. మీరు కొత్త ప్రణాళికలు వేసుకుంటారు. జ్ఞానులను కలుస్తారు.
వృశ్చికం
ఈ రోజంతా సానుకూలంగా ఉంటారు. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి. పిల్లల సక్సెస్ ను ఎంజాయ్ చేస్తారు. నిధుల కొరతతో ఇబ్బందులు తలెత్తుతాయి. బీపీ వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ పని చేయడం వల్ల బాగా అలసిపోతారు.
ధనుస్సు
నిలిచిపోయిన ప్రాజెక్టులను బిల్డర్లు చాలా వేగంగా ముందుకు తీసుకువెళతారు. రచనలతో సంబంధం ఉన్న వ్యక్తుల కీర్తి పెరుగుతుంది.సహాయ కార్యక్రమాలు చేసేందుకు ప్రయత్నిస్తారు. కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు అనుకూలమైన సమయం. లావాదేవీలు జాగ్రత్తగా చేయాలి.
మకరం
ఈ రోజు సాధారణంగా ఉంటుంది. కాలు నొప్పితో ఇబ్బంది పడతారు. ఈరోజు ముఖ్యమైన పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. మీ అభిప్రాయాలను ఇతరులపై రుద్దడం మానుకోండి. స్టాక్ మార్కెట్‌లో తెలివిగా పెట్టుబడి పెట్టండి. ఇతర నగరాల్లో నివసిస్తున్న బంధువులను కలుస్తారు.
కుంభం
ఆర్థిక పరిస్థితి బావుంటుంది. పాత విషయాల గురించి ఆలోచిస్తారు. రిస్క్‌తో కూడిన పెట్టుబడులపై ఆసక్తి చూపిస్తారు. భవిష్యత్ పై కీలకనిర్ణం తీసుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. విద్యార్థులకు ప్రయోజనం ఉంటుంది. వృత్తిలో పురోగతి ఉంటుంది. నిరుద్యోగులు ఉద్యోగం పొందవచ్చు.
మీనం
ఉద్యోగులకు కార్యాలయంలో వచ్చిన ఆటంకాలు తొలగిపోతాయి. గృహ అవసరాల కోసం వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ ఆసక్తికి అనుగుణంగా పని చేయాలనుకుంటున్నారు. పనికిరాని పనులతో సమయం వృథా కాకుండా చూసుకోవాలి. వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. మీ సంపద పెరుగుతుంది.