2022 మే 17 మంగళవారం రాశిఫలాలు
మేషం
ఈ రాశివారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు తగ్గించాలి. ఆదాయం బాగానే ఉంటుంది. తలపెట్టిన పనులు మధ్యలోనే ఆగిపోతాయి. వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులకు మిశ్రమ ఫలితాలున్నాయి.
వృషభం
ఈ రోజు మీకు చాలా మంచి రోజు. రుచికరమైన విందును ఆస్వాదిస్తారు. ఉద్యోగులకు ఈ రోజంతా శుభసమయం. పాత రుణాన్ని తిరిగి చెల్లిస్తారు. స్నేహితులతో చర్చిస్తారు. కొత్త ఆదాయ వనరులు కలిసొస్తాయి.
మిథునం
ముఖ్యమైన పనుల్లో కుటంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మీ సామర్థ్యాలను అంతా అభినందిస్తారు. ఆన్ లైన్ వ్యాపారం చేసేవారికి ఈ రోజు మంచి సమయం. ఉద్యోగులకు పని ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారం బాగా సాగుతుంది.
కర్కాటకం
బంధువుతో వివాదాలుంటాయి..మాట తూలకండి..తగాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. వివాహ సంబంధాలలో ప్రేమ, అంకితభావం ఉంటుంది. ఇంట్లో కొన్ని సమస్యలు ఇబ్బంది పెడతాయి. వ్యాపారులు, ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలుంటాయి.
సింహం
ఆర్థిక పరిస్థిత బావుంటుంది. పడిన కష్టానికి తగిన ఫలితం పొందుతారు. వ్యాపారంలో మీ సంబంధాలు మెరుగుపడతాయి. ప్రత్యర్థులతో గొడవ పడతారు. న్యాయవాద వృత్తితో సంబంధం ఉన్న వ్యక్తులకు సమాజంలో పేరుంటుంది. మీరు భవిష్యత్తు గురించి కొంచెం ఆందోళన చెందుతారు.
కన్యా
కెరీర్‌లో కొన్ని మార్పులు చేయాలనే ఆలోచన వస్తుంది. కొత్త ఉద్యోగాలు మారాలి అనుకుంటారు. కొత్తగా ఇల్లు కొనడంపై ప్లాన్ చేస్తారు. మీ జీవిత భాగస్వామితో వివాదం పెట్టుకోవద్దు. వ్యాపారంలో మంచి ఫలితాలను పొందుతారు. మీ పనితీరుతో అందర్నీ ఆకట్టుకుంటారు.
తులా
ఎవరితోనైనా మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. మీరు చేయాలనుకున్న పనిని నిర్భయంగా పూర్తిచేయండి. వ్యాపారులు లాభపడతారు. మీరు సామాజిక కార్యక్రమాల కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావొచ్చు. టెన్షన్ తగ్గుతుంది.
వృశ్చికం
కుటుంబం,సన్నిహితుల నుంచి మీకు ప్రోత్సాహం లభిస్తుంది. వైవాహిక సంబంధాలు మధురంగా బలంగా ఉంటాయి. విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. వ్యాపారంలో లాభాలను పెంచుకునే మార్గాలపై మీరు కృషి చేస్తారు.
ధనుస్సు
వ్యాపారంలో కొన్ని లావాదేవీలకు సంబంధించిన అడ్డంకులు ఉంటాయి. ప్రయాణాన్ని వాయిదా వేయడం మంచిది. మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోవద్దు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు పొందుతారు.
మకరం
ఉద్యోగులు ఈ రోజు మీ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు.వస్త్ర వ్యాపారులకు లాభాలొస్తాయి. తెలివైన వ్యక్తులతో సావాహం చేయండి. బంధువులతో మీ సంబంధాలు బలంగా ఉంటాయి.
కుంభం
ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది. అధికారులతో సమావేశం లాభిస్తుంది.నిరుద్యోగులకు కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. ఎదుటి వారి అభిప్రాయాలు మీపై రుద్దేందుకు ప్రయత్నిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేయాలనుకుంటే ఇదే శుభసమయం.
మీనం
మీరు నిర్వర్తించాల్సిన బాధ్యత పట్ల అజాగ్రత్తగా ఉండొద్దు. తల్లిదండ్రుల వ్యాపారంలో మంచి విజయం ఉంటుంది. కీళ్లలో నొప్పితో బాధపడతారు. ఇంటి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీ ఆహారాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.