2022 మార్చి 23 రాశిఫలాలు
మేషం
ఈరోజు చర్చలకు దూరంగా ఉండండి. మీ సహోద్యోగులతో మంచి ప్రవర్తన కలిగి ఉండండి.ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేయవద్దు. వ్యాపార సంబంధిత పనుల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. కొత్త పనులకు సంబంధించిన ప్రణాళిక ప్రస్తుతానికి సరికాదు.
వృషభం
ఈరోజు కుటుంబంతో సంతోష సమయం గడిపేందుకు ప్రయత్నిస్తారు. పెద్దల సలహాలు పాటిస్తే మంచి జరుగుతుంది. ముఖ్యమైన పనుల్లో బిజీగా ఉంటారు. వ్యాపార ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశం ఉంది. ఈరోజు ఇంటి పనులపై చాలా ఆసక్ని కనబరుస్తారు.స్నేహితులతో సంతోష సమయం గడుపుతారు.
మిథునం
కొంతమంది మిమ్మల్ని వ్యతిరేకించవచ్చు.విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అధికారులు మీ నుంచి ఎక్కువ పనిని ఆశిస్తారు. జీవిత భాగస్వామితో వాగ్వాదం వద్దు. పాత పొదుపుల నుంచి ప్రయోజనంని పొందుతారు. ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. తొందరగా అలసిపోతారు.
కర్కాటకం
కొత్త పనులపై ఆసక్తి చూపుతారు.ప్రేమికులు పెళ్లి విషయంలో తొందరపడటం మానుకోవాలి. చాలా రోజులుగా కొనసాగుతున్న సమస్యల గురించి మీరు కొంచెం ఆందోళన చెందుతారు. మీ కోపాన్ని నియంత్రించుకోండి. విద్యార్థులు చదువు విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. పాత మిత్రులను కలుస్తారు. దినచర్యలో మార్పు ఉంటుంది.
Also Read: సింహాద్రి అప్పన్న నుంచి కాటమరాయుడి వరకూ ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ నారసింహ క్షేత్రాలు
సింహం
కుటుంబానికి సమయం కేటాయించండి. తల్లి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. వ్యాపారంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. ఆఫీసులో సహోద్యోగితో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. యోగా, వ్యాయామంతో మీ మనస్సు- శరీరం ఆరోగ్యంగా ఉంటాయి. వినోద సాధనాల కోసం ఖర్చు చేస్తారు.
కన్య
ఉద్యోగావకాశాలు లభిస్తాయి.విహారయాత్రకు వెళ్తారు.తలపెట్టిన కొన్ని పనుల్లో సమస్యలు ఎదుర్కొంటారు. కొత్త పెట్టుబడులకు అనుకూల సమయం.స్నేహితుల సలహాలు మీకు ఉపయోగకరంగా ఉంటాయి. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఉన్నత పదవులు అందుతాయి. మీరు మీ ప్రేమను వ్యక్తపరచండి.
తుల
మీ ప్రవర్తనను నియంత్రించుకోండి. ఖర్చులు ఆకస్మికంగా పెరుగుతాయి. ఈరోజంతా సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు కార్యాలయంలో కొత్త బాధ్యతను పొందుతారు. ఎవరి నుంచీ ఎక్కువగా ఆశించవద్దు.విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ పెట్టండి.
వృశ్చికం
పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు పొందుతారు.మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది. ఉద్యోగం మారాలనే ఆలోచన ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలొస్తాయి. ఉద్యోగులు కార్యాలయంలో ప్రశంసలు పొందుతారు. బాధ్యతలను శ్రద్ధగా నిర్వర్తిస్తారు.
Also Read: యాదాద్రి సహా తెలంగాణలో నారసింహస్వామి కొలువైన మహిమాన్వితే క్షేత్రాలివే
ధనుస్సు
అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త.బరువులు ఎక్కువగా ఎత్తొద్దు.మీరు తలపెట్టిన పనులకు జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. ప్రేమ సంబంధాలను సమతుల్యంగా ఉంచుకోండి.ప్రయాణ ప్రణాళికలను వాయిదా వేయండి. రహస్య విషయాలు అందరికీ చెప్పకండి.
మకరం
మీరు చాలా సానుకూలంగా ఆలోచిస్తారు. రిస్క్ తీసుకుంటూనే సక్సెస్ అవుతారు. ఎనర్జిటిక్ గా ఉంటారు. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టేవారు లాభాలు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది.ఆరోగ్యం బాగానే ఉంటుంది. కోర్టు కేసులు ముందుకు సాగుతాయి.
కుంభం
మీ ప్రవర్తనతో అందర్నీ ఆకట్టుకుంటారు. నిరుపేదలకు సహాయం చేయండి. మీకు తెలియకుండా మీ చుట్టూ కొన్ని కుట్రలు జరగొచ్చు. ఆఫీసులో సహోద్యోగులతో కొంత ఇబ్బంది ఉండొచ్చు. ఎవరితోనైనా వివాదాలు రావొచ్చు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది.
మీనం
నిరుద్యోగులకు శుభసమయం. స్నేహితులతో సంతోష సమయం గడుపుతారు. ఈ రోజు మీరు కుటుంబ సభ్యుల గురించి కొంచెం ఆందోళన చెందుతారు. అవివాహితులకు పెళ్లి కుదురుతుంది. పనికిరాని పనులు చేస్తూ మీ సమయాన్ని వృధా చేసుకోకండి.