4 మార్చి 2022 శుక్రవారం రాశిఫలితాలు
మేషం
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. ఒకరిపై విమర్శలు చేసిన ప్రభావం మీ పనిపై పడుతుంది. మైగ్రేన్ రోగులు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. కంటికి సంబంధించిన చికాకులుంటే నిర్లక్ష్యం చేయవద్దు. పెరుగుతున్న ఖర్చుల గురించి ఇంట్లో చర్చలు జరుగుతాయి.
వృషభం
మీ పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. మీ నైపుణ్యంతో ఆకట్టుకుంటారు. బంధువుల నుంచి మంచి సమాచారం అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీరు స్నేహితులను కలుస్తారు. మీ ప్రేమను వ్యక్తపరిచేందుకు శుభసమయం. పని ఒత్తిడి తగ్గుతుంది.ప్రశాంతంగా ఉంటారు.
మిథునం
మీరు ఈరోజు విమర్శలకు గురవుతారు. కొంతమంది మిమ్మల్ని ద్వేషిస్తారు. వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. అధికారులు అసంతృప్తిని ఎదుర్కోవలసి ఉంటుంది. వ్యాపారంలో అనుభవజ్ఞులైన వ్యక్తుల నుంచి మార్గదర్శకత్వం పొందవచ్చు. మీ పెట్టుబడిని జాగ్రత్తగా ప్లాన్ చేయండి. కుటుంబంలో కలహాల వాతావరణం ఉండవచ్చు.
Also Read: కృష్ణుడు 36 ఏళ్లలో చనిపోవాలనే గాంధారీ శాపం నెరవేరిందా? కురుక్షేత్రంలో ఏం జరిగింది?
కర్కాటకం
కార్యాలయంలో సహోద్యోగులతో విభేదాలు ఉండొచ్చు. ఈరోజు అంత అనుకూలంగా ఉండదు. సాంకేతిక కారణాల వల్ల తలపెట్టిన పనులు పూర్తికావు. వ్యక్తిగత సమస్యలను బహిరంగపరచవద్దు. మీ నిర్ణయాలను ఇతరులపై రుద్దవద్దు. ఈ రోజంతా ఏకాంతంగా ఉండేందుకు ఇష్టపడతారు. జీవితభాగస్వామితో సఖ్యత ఉంటుంది.
సింహం
జీవిత భాగస్వామితో ఏదో ఒక విషయంలో మనస్పర్థలు రావొచ్చు. ఉద్యోగంలో మరింత కష్టపడాలి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి తొందరపడకండి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. భారీ వస్తువులను హ్యాండిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
కన్య
కుటుంబంలో సంతోషం ఉంటుంది. మీ దినచర్య చాలా క్రమశిక్షణతో ఉంటుంది. వివేకవంతుల సలహాలు తీసుకోవడం మేలు చేస్తుంది. వ్యాపార విస్తరణకు ప్లాన్ చేస్తారు.
తుల
ఈ రోజు తొందరగా అలసిపోతారు. బంధువులను కలవడంతో కొన్ని టెన్షన్లు క్లియర్ అవుతాయి. మీకు ఆసక్తి ఉన్న విషయంపై రాజీ పడొద్దు. ఎవ్వరితోనూ అనవసర వాదనలకు దిగొద్దు. మీరు మీ కుటుంబ సభ్యులతో ఏదైనా సమస్యను చర్చించవచ్చు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.
వృశ్చికం
ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలుంటాయి. వ్యాపారులు నిరాశాజనకమైన ఫలితాలు అందుకుంటారు. పనిని వాయిదా వేసే ధోరణి వల్ల మీపై చాలామంది కోపంగా ఉంటారు. అనారోగ్య సమస్యలుంటాయి. ప్రేమికులకు ఈరోజు అద్భుతమైన రోజు అవుతుంది. మీరు మీ భాగస్వామితో సంతోష సమయాన్న గడుపుతారు.
Also Read: అభిమన్యుడు, ఘటోత్కచుడు సహా ఈ 15 మంది పాండవుల సంతానమే..
ధనుస్సు
వ్యాపార పరిస్థితి గురించి ఆందోళన చెందుతారు. ఎవరికీ అడగకుండా సలహాలు ఇవ్వకండి. అప్పిచ్చిన మొత్తం తిరిగి పొందుతారు. కుటుంబ సభ్యులను నిర్లక్ష్యం చేయవద్దు. ఈరోజు మీరు ఏదో ఒక విషయంలో ఆందోళన చెందుతారు. మీకు కావలసిన ఆహారాన్ని ఆస్వాదిస్తారు.
మకరం
పూర్వీకుల ఆస్తి తగాదాలు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాల కోసం ప్రయత్నిస్తారు. పెట్టుబడులు పెట్టేందుకు శుభసమయం. ప్రేమికులతో మనసులో మాట మాట్లాడతారు. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం అందుకుంటారు.
కుంభం
ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. కొంతమంది మీ పట్ల అనుచితంగా ప్రవర్తించవచ్చు. కానీ పెద్దగా పట్టించుకోకుండా మీ పనిలో మీరు ఉండండి. ఆరోగ్యం క్షీణించడం వల్ల మనస్సు కలత చెందుతుంది. మీ మాటల్లో చిరాకు ప్రతిబింబిస్తుంది. పొదుపుపై దృష్టి పెట్టాలి. ఎవరి మీదా అనవసరంగా పగ చూపవద్దు.
మీనం
వ్యాపార పరిస్థితి అదుపులో ఉంటుంది. విదేశాల్లో ఉన్న మిత్రులతో చర్చలు జరుపుతారు. కుటుంబంలో కలహాలు తొలగిపోతాయి. వ్యాపారంలో లాభం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ప్రేమ సంబంధాల్లో స్థిరత్వం ఉంటుంది. ఉద్యోగులకు మంచి సమయం.