ఫిబ్రవరి 8 మంగళవారం రాశిఫలాలు


మేషం
ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి, ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, పాత పెట్టుబడుల నుంచి లాభాలు ఆర్జిస్తారు. ఒకరి మాటల ప్రభావం మీపై పడకుండా చూసుకోండి.  మీరు చేసే పనిలో కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది.


వృషభం
ఈ రోజు ముఖ్యమైన పనుల విషయంలో డబ్బు కొరత ఏర్పడొచ్చు. అప్పిచ్చిన మొత్తం చేతికి అందకపోవడం వివాదాలకు దారి తీస్తుంది. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఉండొచ్చు.


మిథునం
పనికిరాని విషయాల్లో మీ సమయాన్ని వృథా చేయకండి. విద్యార్థులు చదువుపై పూర్తి శ్రద్ధ పెట్టాలి. మీ బాధ్యతను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఒకరి మాటలు మిమ్మల్ని చాలా బాధపెడతాయి. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. 


కర్కాటకం
ఈ రోజంతా ప్రశాంతంగా ఉంటారు. మీ ప్రవర్తన సన్నిహితులకు,  ప్రియమైనవారికి శాంతి కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు కార్యాలయంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. భగవంతుని ఆరాధనలో నిమగ్నమై ఉంటారు. సకాలంలో బాధ్యతలు పూర్తిచేస్తారు.


సింహం
ఈరోజు మీరు పొదుపు పథకం డిపాజిట్ మొత్తాన్ని తిరిగి పొందవచ్చు. అనుకోని ఖర్చులు ఎదుర్కోవాల్సి రావొచ్చు. మీ ప్రయాణం వాయిదా వేసుకునేందుకు ప్రయత్నించండి. ఆధ్యాత్మికతపై మనసు నిమగ్నం చేస్తారు. ఖర్చులు పెరుగుతాయి. 


కన్య
మితిమీరిన బాధ్యత మిమ్మల్ని మానసికంగా కలవరపెడుతుంది. గృహంలో శుభ కార్యాలు జరుగుతాయి. బంధువులు వస్తూ పోతూ ఉంటారు. మీ కారణంగా ఎవ్వరూ బాధపడకూడదనే ఆలోచనలో ఉంటారు. మీ కోపాన్ని నియంత్రించుకోండి. 


తుల 
ఈ రోజంతా మీకు కలిసొస్తుంది. ప్రశాంతంగా, సంతోషంగా ఉంటారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. 


వృశ్చికం
ఈ రోజు మీరు ఎలాంటి కారణం లేకుండా వివాదంలో చిక్కుకోవచ్చు.  గృహానికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. ఒకరు మీనుంచి అప్పు తీసుకునే అవకాశం ఉంది.తప్పులు చేసే అవకాశం ఉంది...కాస్త ఆలోచించి వెనకడుగు వేయండి. కుటుంబంతో సమయాన్ని గడుపండి.


ధనుస్సు
ఈరోజు మీకు అకస్మాత్తుగా బంధువుల నుంచి కాల్ రావడంతో హడావుడిగా ప్రయాణం చేయవలసి వస్తుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు అజాగ్రత్తగా ఉండకండి. ధనలాభం పొందే పరిస్థితి ఉంటుంది. యువత ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. 


మకరం
ఈరోజు మీరు శత్రువుల వల్ల ఇబ్బంది పడవలసి వస్తుంది. మీరు విమర్శలకు గురవుతారు. మనస్సు భగవంతుని ఆరాధనలో నిమగ్నమై ఉంటుంది. అత్తమామల వైపు నుంచి శుభవార్తలు అందుతాయి. మీరు వివాహ కార్యక్రమంలో పాల్గొనవచ్చు.


కుంభం
ఈ ఉదయం నుంచి ఉరకల పరుగులుగా ఉంటుంది. శుభ కార్యాలు సజావుగా పూర్తి చేసేందుకు మీపై ఒత్తిడి ఉంటుంది. మోసపూరిత వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించడానికి ప్రయత్నించండి.  అనవసర మాటలు నియంత్రించండి. ఎవరితోనైనా విభేదాలు ఉండొవచ్చు.


మీనం
ప్రభుత్వ పనులు పూర్తి చేయడానికి ఈరోజు మంచి రోజు. మీ బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. పనికిరాని పనుల్లో చిక్కుకోకండి, మీరు మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. కొత్త పనులు ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు.